6, జూన్ 2012, బుధవారం

నాకెవ్వరు పోటీ

మామ్ ఒక్కసారి ప్లీజ్ పది నిమిషాల్లో ఇచ్చేస్తానుగా!
హ్మం !ఇప్పటి వరకు నీ దగ్గరే కదా ఎంత సేపు పేస్ బుక్ కాసేపు దానికి రెస్ట్ ఇవ్వు "నేను .
అబ్బ !నీవా బ్లాగ్స్ చూడటం మొదలెడితే ఇప్పట్లో ఇవ్వవు జల్లెడ అంటావు కాసేపు హారం కూడలి 
ఇవన్ని నీవు తిరిగి వచ్చేసర్కి నాకు నిద్ర ముంచుకు వస్తది ప్లీజ్ అమ్మా యిచ్చేస్తా "చిన్ని.
అయిన అంతసేపు లాప్టాప్లో వుంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వుతాయి "నేను. 
అబ్బా ఏమి కాదులే నీకు ఇష్టం అయిన పాట పెడతాను వింటూ వుండు ఈ లోపు ఇచ్చేస్తాను 
మొదలయ్యిందా గోల చిన్న పిల్లతో నీ పోటీ ఏంటి తోచకపోతే ఏదొకటి చదువుకోరాదు "శ్రీవారు .
మేము ఏదొకటి పడతాము నీకెందుకు "కసురుకుంటూ నేను ..
...మమ్మీ ఈ ఫోటో  చూడు ఈ పిచ్చుకలు ఎంత 
ముద్దుగా వున్నాయో "చిన్ని
అబ్బ ఎంత బాగున్నాయో ఎవరు పెట్టారు ఈ ఫొటోస్ "సంబరంగా నేను 
ఇప్పుడు ...................................................
నాకెవ్వరు జోడీ హ్మం !
ఇల్లంతా వెలితి !దుఖం గుండెల్లో నింపుకుని కన్నీరు దాచుకుంటున్న నాన్న 
అర్ధరాత్రిలో మెలకువ వచ్చి పక్కన తడిమితే నీవు లేవన్న పచ్చి నిజం గుండె 
పగిలిపోతుంది  గది గదిలో నీవున్నవనే ఆశ తో నీకోసం వెదుకుతున్న బుజ్జుల్ని 
చూస్తుంటే నా కళ్ళు నా మాట వినడం లేదు తల్లీ ....మా మూడు ప్రాణాలు నీకోసం తల్లడిల్లుతున్నాయి చిన్నీ !
ఇప్పుడు ఎవరు కన్నా నాతో పోటీ ?  
    
  

9 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

మీ టపా చదవగానే ఉండబట్టలేక చక చకా మీ పాత టపాలన్ని తిరగేసాను.అసలెందుకని ఇలా రాసారు అని. నేను కొత్త కదా బ్లాగ్స్ కి అందుకని, నాకు తెలీదు . మీ అమ్మాయికి వివాహం చేసారు అని అర్ధం అయ్యింది. అమ్మో! నేను అల్మోస్ట్ మా పాప 18 years తర్వాత నన్ను విడిచి వేరే స్టేట్ లో చదువుకోడానికి వెళ్ళినప్పుడు ఇంత బాధపడ్డాను. అందుకే మీ పోస్ట్ కి రిలేట్ చేసుకోగలిగాను. చిన్ని గారు,మనసంతా అదోలా అయిపోయిందండి మీ టపా చదవగానే!

మురళి చెప్పారు...

మీ బాధ నేను అర్ధం చేసుకోగలను.. అది నెమ్మదిగా తీరాలె తప్ప, ఒకరు తీర్చగలిగేది కాదు..
ఈ టపా మీ అమ్మాయి చూస్తే, ఆమె యెంత బాధ పడతారో ఒక్కసారి ఆలోచించారా??

భాస్కర్ కె చెప్పారు...

konnitiki siddapade premenchaalemonandi, pillalanu.

మాలా కుమార్ చెప్పారు...

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా అని పాడుకుంటున్నారాండి వాకే కారీఆన్ .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హిమ బిందువులు గారు.. ఏమిటండీ ఇలా!? అప్పుడప్పుడు చిన్ని చూస్తూనే ఉంటారు కదా!
అమ్మ మనసుని నేను అర్ధం చేసుకోగలను.కాస్త నిబ్బరం చేసుకోండి.
మీరు చిన్ని ని చూడాలంటే వీసా స్టాంపింగ్ అవసరం లేదు.కానీ ఎంతమంది తల్లులు బిడ్డలని చూడాలనుకుని మీలా గుండె గొంతుక లో కొట్టాడుకుంటూ ఉంటారో.ఒక్కసారి కనుల ముందు ఊహించుకోండి.
మురళీ గారు అన్నట్టు ..చిన్ని ఈ పోస్ట్ చూస్తే ఆ పాప పరిస్థితి ఏమిటి?
దూరమైనా కొలది పెరుగును అభిమానం - అనురాగం.. బంధం,- అనుబంధం .
కాస్త తెరుకోండి.
పాపాయి అల్లరి గుర్తు తెచ్చుకోండి. హాయిగా నవ్వుకోండి.

Hima bindu చెప్పారు...

@జలతారువెన్నెల
@మురళి
అనాలోచితంగా నా భాధని ఇలా వ్యక్తపరిచానండీ .అదీకాక ఇక్కడ అయితే దూరం అనిపించదండీ ఎప్పుడంటే అప్పుడు కలవొచ్చు ఇప్పుడు నా పరిస్థితి అది కాదు .నా ఓల్డ్పోస్ట్లు చదివినందుకు
ధన్యవాదములు .
మీరు అన్నది నిజమే ప్రస్తుతం తను చదివే తీరిక లేదులెండి
@the tree
ప్రేమ అన్నదానికి పరిమితులు విధించుకోలేమేమోనండీముఖ్యంగా పిల్లల విషయంలో.thanq.

Hima bindu చెప్పారు...

@మాలా కుమార్
లేదండీ అమ్మ దొంగ వినలంటేనే ఏడ్పు వస్తుంది వినలేను.
@వనజ వన మాలి
నేను ఆనందం వచ్చిన దుఖం వచ్చిన వ్యక్తపరుస్తాను ఇటీవల కాలంలో డైరీల కి తోడు ఈ బ్లాగ్ నా భావ వ్యక్తీకరణ కి వేదిక అయ్యింది .కాలం చాల గొప్పదని అనుకుంటాను ఇప్పటికే నా రొటీన్ లో పడిపోయాను :)థాంక్యూ .
అన్నట్లు నా పేరు నాలుగు అక్షరాలే సున్నా కలపకుంటే :)

Meraj Fathima చెప్పారు...

koncham digulugaaa anipinchindandee. baagaa raasaru

Hima bindu చెప్పారు...

@Meraj fathima
ధన్యవాదాలండీ