10, జూన్ 2012, ఆదివారం

ఇన్నాళ్ళకి వచ్చావా

ఇన్ని అందాలను ఆనందాలను ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మ !ఇప్పుడిప్పుడే మా ఊరు రావనుకున్నాము చెప్పాపెట్టకుండా మొన్న రాత్రి నీవు చూపిన దయతో మా ఊరంతా మురిసిపోయి తడిసి ముద్దయి పోయింది తెల్లారేసర్కి నీ జాడలు మాత్రం వదిలి వెళ్లి పోయావే !అప్పటినుంచి ఒళ్లంతా కళ్ళు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తున్నాను ఏమాత్రం అలికిడి అయిన  నువ్వోచ్చేసావు అనుకుంటు కిటికీ పరదాలు తీసి మన ఇంట వాకిట
ఆడుకుంటున్న  చిట్టి రెమ్మలని కొమ్మల్ని అడుగుతున్నాను . .
నీకు తెలుసా నీ కోసం మన ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో !అదిగదిగో మనస్సున్న మరుమల్లి యెలా
వాడి పోయిందో నీవులేక ,వన్నెచిన్నెల విరజాజి పందిరిని చూసావా తన నేస్తం చంపకం చెప్పే కబుర్లు మీద దృష్టి నిలపక మొర ఎత్తి కరిమబ్బుల  లో నీ జాడలు వెదుకుతుంది చిట్టి చేమంతులు ముద్దు గులాబీలు మరువపు పొదలు
సైతం ఆత్రుతగా నీ చిరు సవ్వడి కోసం ఆలకిస్తున్నాయి .........
హమ్మయ్య ఇన్నాళ్ళకి మా పయి దయ కలిగిందా !చిరుగాలి తో మా ఊరు చూసి రమ్మని కబురు  పంపావా !నీకు స్వాగతం  పలకటానికి విరులన్నీ కొలువు తీరి ఉన్నాయమ్మావడిగా వచ్చి ఆనందపు జల్లుల్లో మమ్మల్ని ముంచెయ్యి !  

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వానకోయిలకు ఆహ్వానం అందంగా ఉంది.

Hima bindu చెప్పారు...

ధన్యవాదాలండీ:-)

Padmarpita చెప్పారు...

Happy mansoons

Unknown చెప్పారు...

వచ్చిన చిరుజల్లుని ఆప్యాయంగా పలకరించారు. బహుశా అందరూ ఇలా పలకరిస్తే "మేఘ మధనాలు" అవసరమే ఉండదేమో...
మనిషీ ప్రకృతితో కలసి జీవించిననాడే ఆ ప్రకృతీ మనిషితో కలసి జీవిస్తుంది.
చక్కని చిరుజల్లుల పలకరింపు, బాగుంది.

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత
మీకు కూడా :-)
@చిన్నిఆశ
"మనిషీ ప్రకృతితో కలసి జీవించిననాడే ఆ ప్రకృతీ మనిషితో కలసి జీవిస్తుంది."well said:)

భాస్కర్ కె చెప్పారు...

maa voorlo kuda vana padindandi,
thank you

Hima bindu చెప్పారు...

@the tree
మీ ఊరిని కూడా ఒక చూపు చూసి రమ్మని నేనే చినుకమ్మ తో చెప్పానండీ:)

Meraj Fathima చెప్పారు...

chinnigaaru andamaina aahvaanam manchi bhaavana.

Hima bindu చెప్పారు...

@meraj fathima
థాంక్సండీ

Meraj Fathima చెప్పారు...

చిన్నిగారూ, అందమైన పదాలతో అల్లిన మీ కవితామాల చిరుజల్లులో తడిపెసారు.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఋతురాగాల కోసం వేచి చూస్తున్న తీరును అందంగా చెప్పారు..అభినందనలు..

Hima bindu చెప్పారు...

@కే.క్యూబ్ వర్మ
మీవంటి వారు అభినందించడం..హ్మం ..సూర్యుడి ముందు దివిటి చందాన....ధన్యవాదాలు .