1, జులై 2012, ఆదివారం

దూరం తగ్గినట్లే

నిన్న ఉదయం మూడున్నర గంటల్లో  విజయవాడ నుండి హైదరాబాద్  వెళ్ళగలిగాను సరిగ్గా నాలుగుగంటలు పని చూసుకుని  తిరిగి రాత్రి ఏడున్నరకి విజయవాడ లో వున్నాను.ఇంట్లోవాళ్ళు హాచ్చార్యపోయారు అసలు నేను మీటింగ్ కి వెళ్ళకుండానే తిరిగి వచ్చేసానేమోనని :)
మనం గన్నవరం వెళ్లి విమానం ఎక్కి వెళ్ళలేదు అలాగని ఏ సూపెర్ ఫాస్ట్  ట్రైను ఎక్కి వెళ్ళలేదు సాదాసీదాగా మనం ఎప్పుడు వెళ్లినట్టు నేషనల్ హై వే లోనే వెళ్లాను .ఈ హై వే కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం హై వే ఎప్పుడొస్తుందో ?,.హై వే వస్తుంది (విజయవాడ -హైదరాబాద్ )దాదాపు ఎనభయ్యి శాతం పూర్తయ్యినట్లు కనిపించింది ఎక్కడ ట్రాఫిక్ జామ్  లేదు లేట్ అంటూ జరిగితే సిటీలోనే మిగిలిన భాగం పూర్తయితే ప్రయాణం ఎంతో సులభం ముఖ్యంగా విజయవాడ హైదరాబాదు మద్య దూరం తగ్గినట్టే (సమయం)వెధవ ప్రమాదాలు చాలావరకు నియంత్రించినట్లే .

2 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

Good News చెప్పారు. నేను ఎప్పుడు వచ్చినా విజయవాడ కి hyderabad కి తిరుగుడు ఎక్కువ. ఇలా అయితే ఎంత హాయో!

Hima bindu చెప్పారు...

@జలతారు వెన్నెల
ఇంకొక నాలుగు నెలలు పట్టొచ్చేమో పూర్తిగా పూర్తవడానికి. టోల్ ప్లాజలు బ్రిడ్జెస్ నిర్మాణం లో వున్నాయి .,రోడ్ కంప్లీట్ అయితే ఎంచక్కగా పుల్లారెడ్డి స్వీట్లు తినలనిపిస్తే అప్పటికప్పుడు హైదరాబాదు వెళ్లి కొనుక్కోచ్చుకోవచ్చు