మూడవ రోజు మా చిన్న మేనమామ ఇంట్లో మా కజిన్స్ ఇంక కొంతమంది దగ్గరి భంధువులు చాల ఘనంగా వేడుక చేసారు విందు భోజనాలు పెళ్లి వారిని తలదన్నినట్లు ఏర్పాటు చేసారు .ఇక్కడ ఒక విషయం చెప్పాలి సనాతనం మరియు ఆధునికం కలిపే ఈ అయిదురోజుల తతంగం సాగింది ఒక ప్రక్క పూజలు నలుగు స్నానాలు జానపద గీతాలు మంగళ గీతాలు శ్రద్దగా ఆచరిస్తునే మరొక ప్రక్క సంగీత్ సాయంత్రపు సమయాల్లో నిర్వహించడం, మరొక ప్రక్క గంటగంట కి ఫలహారాలు ఆత్రేయపురం నుండి పూతరేకులు మడత కాజాలు కాకినాడ నుండి కాజాలు ఒంగోలు మైసూరు పాకం నిడదవోలు నుండి లడ్డులు డ్రై ఫ్రూట్ పూతరేకులు అరెసలు సున్నుఉండలు గంపలు గంపలు గారెలు బూరెలు గంపలనిండా పళ్ళుపూలు ఎటు చుసిన మల్లెల పరిమళం పిల్లల కోసం ఫ్రిజ్ నిండా రకరకాల చాక్లెట్స్ పళ్ళ రసాలు ఇది వుంది ఇది లేదు అని తడుముకోకుండా అందరికి అన్ని అందుబాటులో పెట్టాము
,మూడవరోజు సాయంత్రం అబ్బాయిలు ఆఖరకు మావారితో సహా ఆడి పాడారు మామయ్య కొడుకులు ఇంకా కజిన్స్ అత్యద్భుతంగా డాన్స్ చేసారు .పాప లగ్నం నక్షత్రం అనుసరించి కొన్ని పూజలు పెళ్ళికి ముందు చేయవలసినవి మూడో రోజు చేయించారు
.ఇదే రోజు భందువులందరికి నూతన వస్త్రాలు కుంకుమ బరిణ లు పిలుపుల సమయంలో అందని వారికి బహూకరించడం జరిగింది .అమ్మాయిని పెళ్ళికూతుర్ని చేసిన సమయంలోనే అంత అక్షతలు వేసి పట్టుబట్టలు కానుకలు ఇవ్వడం జరుగుతుంది .అమ్మమ్మల నుండి అత్తలనుంచి పెద్దమ్మ పిన్నులు ఇంకా స్నేహితులు ఆత్మీయుల నుండి వెల కట్ట లేని వస్త్రాలు నగలు అందుకుంది .
.దూరం ఊర్లనుంది వచ్చిన భందువులకు వసతి ఏర్పాట్లు చేసాము కేవలం అర్ధరాత్రుళ్ళు పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవడనికే ,అదీ కాక మా చుట్టూ ప్రక్కలే పది పైన దగ్గర చుట్టాలం వున్నాము దానితో వసతి కోసం దూరం ఊరు భంధువులు ఇబ్బంది పడలేదు
.ఇల్లంతా పూల తోరణాలతో విద్యుత్ దీపాలతో శ్రద్దగా అలంకరించాము పందిరి క్రింద రంగవల్లులు చుట్టార పూల తోరణాలు ..వాకిట నుండి ఇంటిని చుస్తే కళ్ళు చాలలేదు :) (అతిశయోక్తి కాదు )
ఆ అర్ధరాత్రి కలిగింది బెంగ నా కూతుర్ని ఈ ఇంటి నుంచి పంపించేస్తున్నానని ఆ వాకిట నిలబడి ఏడ్చాను వెక్కి వెక్కి నన్ను చూసి మా పిన్నమ్మలు చెల్లెళ్ళు స్వరం కలిపారు ........................

6 కామెంట్‌లు:
Continue
@kastephale
sure sir.
చాలా బాగా వ్రాసున్నారు చిన్ని గారు..అభినందనలు!
నేను కూడా పెళ్ళి గురించి ఒక సీరియల్లో వ్రాశాను. వీలైతే చదవండి.
http://nityavasantam.blogspot.in/2011/11/14_25.html
ఈ అయిదు రోజుల పెళ్ళి గురించి ఇంకో పెద్ద కథ వ్రాయబోతున్నాను. మీరు వ్రాసేవి నాకు చాలా ఉపయోగపడొచ్చు. అందుకు మీకు ముందస్తు ధన్యవాదాలు.
సురేష్ పెద్దరాజు
థాంక్సండీ.తప్పకుండ చుస్తానండీ.చాల సంతోషం నా రాతలు మీకు ఉపయోగపడితే.ప్రతిరోజు చాల కార్యక్రమాలు జరిగేవి తలోకరం పర్యవేక్షించే వాళ్ళం వయసు ను బట్టి (డెలిగేషన్ అఫ్ వర్క్ అన్నమాట )గుర్తున్నంతవరకు క్రమపరుస్తున్నాను.
ఏమోనండి..నాకెందుకో అమ్మయికి పెళ్ళి చేస్తూ ఏడ్వటం నచ్చదు. నాకు తెలుసు అమ్మాయితో పెనవేసుకున్న బంధం అది అని. కాలేజీ కి పై చదువులకి వెళుతుంటేనే బాధ గా ఉంటుందే! అర్ధం చేసుకోగలను కాని, నేను మాత్రం ఏడ్వకూడదు...అనుకుంటూ ఉంటాను. చూదాము!!
@జలతారువెన్నెల
ఏడవకూడదు అని అనుకున్న మనస్సు మాట వినదు షి ఇజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై వరల్డ్ .మీరు వద్దనుకున్న ఆ సమయానికి వర్రీ అవుతారు .పెళ్లి రెండ్రోజుల ముందు నుండి నా ముఖంలో నవ్వు లేదు
కామెంట్‌ను పోస్ట్ చేయండి