7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఇదీ జీవితం

 చూడవద్దు అనుకుంటూనే కళ్ళప్పగించి టివి చూస్తుండిపోయాను .ఆ పెద్దాయనకి ఈ వయస్సులో ఎంత కష్టం వచ్చింది !సర్వం కోల్పోయి పాలుగారేవయస్సున్నమనవడి భుజంపైన కుండ ఆని ఆన్చకుండా తన హస్తాలలో ఇముడ్చుకుని    హాలాహలం లాంటి నిజాన్ని దిగమింగుతూ తన కొడుకు పార్థివదేహం చుట్టూ తిరుగుతుంటే  ఇక చూడలేక టివి ఆఫ్ చేసేసాను న్యూస్ కోసం తప్పించి నాకు టివి చూసే అలవాటు లేదు .వాళ్ళు వీళ్ళు టివి సీరియల్స్ చూస్తుంటే ఒక లుక్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్పించి పూర్తిగా చూసింది ఎప్పుడు లేదు .సుమన్ గురించి విన్నాను ,చదివాను బహుశ వాళ్ళ స్వగ్రామం మా స్వగ్రామం ప్రక్క ప్రక్కనే వుండటం ఒకే మండలం కావడం వలన ఒకింత ఆసక్తి .గత రెండు సంవత్సరాలుగా అతని ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలా ఆశ్చర్యపోయేదాన్నిఆ మహమ్మారి ఎప్పటికైనా తనని కబళిస్తుంది అని తెలిసిన మామూలు వ్యక్తిలా తను గడిపిన జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం .తెలుగు పట్ల ఆ  కుటుంబం తీసుకున్న శ్రద్ద అబినందనీయం ,నిజానికి  ఈ మధ్యనే నేను ఆ పెద్దాయన నుంచి అందుకున్న" తెలుగు వెలుగు"
గురించి రాయాలనుకున్నకాని విధివశాత్తు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ప్రస్తావించాల్సి వచ్చింది.
బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు ,భర్తను కోల్పోయిన భార్య ,తండ్రిని కోల్పోయిన పిల్లలు ,సోదరుని కోల్పోయిన సహోదరుడు ఈ తీరని దుఖం నుండి తీరుకోవాలని సుమన్ ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. 

3 కామెంట్‌లు:

యశస్వి చెప్పారు...

హాలాహలం లాంటి నిజాన్ని దిగమింగుతూ తన కొడుకు పార్థివదేహం చుట్టూ తిరుగుతుంటే ఇక చూడలేక ..
ఆయన అనుచరులుగా మేమంతా చూడకూడదనుకున్నా రోజది.

భాస్కర్ కె చెప్పారు...

వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@the tree
థాంక్సండీ .మీకును శుభాకాంక్షలు