బాల్యం అన్నా వాటి తాలూక జ్ఞాపకలన్నా నాకు "ప్రాణం ".కాల చక్రం వెనక్కి తిరిగిపోయి తిరిగి మా అమ్మ నాన్న లతో అక్క చెల్లెళ్లు తమ్ముళ్ళ తో జీవితం మరల మొదలైతే ఎంత బాగుండును అనిపిస్తుంది ,పెద్దవాళ్ళం అవ్వకుండా అక్కడితోనే యెప్పటికి ఆగిపోతే ఎంత బాగుంటుందో అని ఎన్నో సార్లు మేమంతా అనుకుంటూవుంటాము ,ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ అని తెలుస్తుంది నాటి పాత మధురాలు ప్రతి ఒక్కరి హృదయంలో అపురూపంగా దాచబడి వుంటాయి వాటిని వెలికి తీసే కొద్ది అపురూపమైన జ్ఞాపకాలు పొరలు పొరలుగా వస్తుంటాయి.జీవితం లో అత్యంత ఆనందముగా గడిపిన రోజులు తరచి చూసుకుంటే అమ్మమ్మ ,నానమ్మ ఊర్లలో హద్దులు లేని అల్లరితో నేను గడిపిన జీవితం అపురూపం
.ఇంట్లో ఆరుగురు పిల్లల్లలో నేను చాల అల్లరి చేసేదాన్ని .ఆటల్లో అలగడం తోండీ ఆటలు ఆడటం లో కూడా దిట్టనే నా వెనుక ఎప్పుడు పిల్ల గ్యాంగ్ ఉండవలసిందే ,నేనేమి నా కూడా రమ్మని చెప్పేదాన్ని కాదు అయిన నా వెనుక అనుసరించేవారు ఊరులోని చుట్టాలందరికి నేను పరిచయమే అంటే ప్రతి ఇల్లు సర్వే చేసి వచ్చేదాన్ని అన్నమాట .పిల్లలం పెద్ద క్లాసులకి వచ్చేసరికి రెండు ఊర్లు తరచూ వెళ్ళడం అమ్మ తగ్గించేసింది,తరువాత కాల చక్రంలో అమ్మమ్మ , నాయనమ్మ గతించేసరికి పూర్తిగా తగ్గించి అడపదడప ముఖ్యమైన పెళ్ళిళ్ళు కార్యక్రమాలకి వెళ్ళడానికి పరిమితం అయ్యాము
.ఈ మధ్య అమ్మవాళ్ళ నాన్నగారికి(తాతయ్య ) వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుట్టిన రోజు పండుగ ఆయన సంతానం అంత అమ్మమ్మ ఊర్లో వేడుకగా జరిపాము ఆ రోజు ఆదివారం కావడం అంత ఆటవిడుపుగా తిరిగి మా "బాల్యం "లోకి మేము వెళ్ళిపోయాము మా పిల్లలకన్నా అనిమిక్కిలిగా అల్లరి చేసాము మధ్యాహ్నం భోజనం తరువాత ఇంటి వెనుకనే వున్నా మా పంట పొలాల్లోకి మా సైన్యాన్ని తీసుకుని వెళ్ళాము ,చిన్నప్పుడు మేము తిరిగిన పంట బోదెలు చెరువులు తిప్పి మా కథలన్నీ పిల్లలికి వర్ణించి వర్ణించి చెప్పాము , కోల్పోయిన బాల్యం పోల్చి ఊరించి మరీ చెప్పాము గడ్డి వామీ లో మేము ఆడిన దాగుడుమూత ఆటలు చెప్పి అక్కడ పొలం లో వున్నా గడ్డి వామిలో ఉత్సాహంగా ఎక్కేసాము పిల్ల పెద్ద పాతిక ముప్పయ్యి మందిమి ఎక్కి తొక్కి కథలు కబుర్లు చెప్పుకుంటూ వుండగా దారిన పొయ్యేవారు మా వంక విచిత్రంగా చూసి వెళ్ళడం ఊర్లో అందరికి ఉప్పు అందిచ్చారు అనుకుంటాను మా పెద్ద మామయ్యా (అమ్మ తమ్ముడు )పొలం గట్టు మీదనుండే గట్టిగ ఒక కేక వేసాడు "రేయ్ దిగండ్రా ,లక్ష రూపాయల పంట తోక్కేసార్రా "అంటూ మామయ్యా అంటే అందరకి కొంచెం భయం లక్ష రూపాయలూ అనేసర్కి తెల్లబోయాము ,విషయం ఏవిట అని చూస్తె మేము ఎక్కి తోక్కినది నూర్చడానికి పేర్చిన వరికుప్ప అట చిన్న చినుకు పడిన ధాన్యం మొత్తం నాశనం అంట ,మాకేం తెలుసు చిన్నప్పుడు ఆడుకున్న వరిగడ్డి వాము అనుకున్నాము అని ఎదురు ధభాయించాము ,ఆనక నలుగురైదుగురు కలిసి గడ్డి తెచ్చుకుని సరిచేసుకున్నారు యధాప్రకారం ఇంటికి వెళ్ళాక పిన్నమ్మలు భంధువులు పరిహాసాలునా తుంటరి పని చిన్నప్పటి తుంటరి పనులు మానలేదా అని తామరాకులో ఆమ్లెట్.ఇన్ని రోజుల్లో సంవత్సరాల్లో అన్ని మరచి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపినది డిసెంబర్ ముప్పయ్యవ తారీఖునే .....జీవితం .

6 కామెంట్‌లు:
మళ్ళీ ఆ నాటి జ్ఞాపకాలలోకి వెళ్ళారన్న మాట.. బాగుందండీ.
Fully enjoyed:)
nice..nice...
:-)
@రామకృష్ణ
అవునండీ ,ఆ రోజు గుర్తుంచుకోవలసిన రోజండీ :)
@ప్రేరణ
రీ చార్జ్ అవ్వడం అన్నమాట:)
@మురళి
థాంక్యూ థాంక్యూ :)
:) :)
Baagundi. ekkadikO tessuku veLLaaru.
Thank you!!
@వనజ వనమాలీ సో మీది మా గ్రూపే అన్నమాట :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి