18, సెప్టెంబర్ 2013, బుధవారం

విరామం


ఒకటా రెండా నెల రోజులు దాటి పది రోజులు అయ్యిపోయాయి :-(
మొదటి పదిరోజులు అయాచితంగా వచ్చిన సమయాన్ని ఆనందంగా గడిపేసాక
ఇక మొదలయ్యింది ఇరవయ్యి నాలుగు గంటలు ఇంట్లో కుర్చోవాలంటే నా వాళ్ళ కావడం లేదు తిరిగే కాలు తిట్టేనోరు కుదురుగా వుండవ్వన్న చందాన నాకేమి తోచడం లేదు ఇలాటి తీరిక సమయం కోసం ఎంత ఎదురు చుసేదాన్నో ఇంట్లో వుండే ఆడాళ్ళను చూసి అసూయా పడ్డ  రోజులెన్నో
 ఉదయాన్నే లేవడం సూర్యోదయం చూస్తూ టీ త్రాగుతూ గంట సేపు ప్రకృతిలో విహరించి వంటగది కార్యక్రమాలు చక్కబెట్టి అయ్యవార్ని ఆఫీసు కి పంపి ఇంకేమి చేయ్యాల్ చెయ్యాలి అనుకుంటూ ఫోన్ తీసుకుని వివిధ నగరాల్లో సమ్మెలు ఎలా జరుగుతున్నాయో మిత్రుల నుండి ప్రత్యక్ష ప్రసారాలు విని కాసేపు వాపోయి  అలుపోచ్చేదాక ఎక్కడెక్కడి చుట్టాలని కదిపి ఫోనుల్లో క్షేమ సమాచారాలు విచారించి కాసేపు బుజ్జులు తో ఆదుకుని పుస్తకాలు ముందేసుకుని రోజుకి ఒకటి రెండు చొప్పున పూర్తి చేస్తూ సాయంకాలం బెడ్ రూమ్ కిటికీ లోంచి క్రుంగిపోయే సూర్యుడిని చూస్తూ మొక్కల్ని కాసేపు పరామర్శించి చీకటి పడుతుండగా ఇంట్లోకి వచ్చి డిన్నర్ ప్రిపరేషన్ ముగించి సగం చదివి వదేలేసి వున్నా పుస్తకం చేతబట్టుకుని మద్య మద్యలో శ్రీవారు టీవి చూస్తూ చేసే వ్యాఖ్యానాలకి ఆ ..ఉ  అంటూ సమాధానం చెబుతూ మధ్యలో చిన్ని తో గంట కబుర్లు చెప్పి ఆ రోజు ముగింపు అలా కరిగిపోతుంది ,కొద్ది పాటి మార్పులు చేర్పుల తో ప్రతి రోజు ఇలానే వుంటుంది నిద్ర లేవడం వంట చేయడం తినడం నిద్రపోవడం హ్మ్మ్ ... నో ఆఫీసు నో స్టాఫ్ నో బాస్ నో విసిట్ట్స్ నో టెన్షన్స్ ... హమ్మో ఇంట్లో వుంటే ఇంత హరిబుల్ గా ఉంటుందా .ఉద్యోగ విరమణ జీవితం ఇలానే ఉంటుందన్న మాట ...ఈ సమస్యలు అందరికి ఆమోద్యంగా ఎప్పటికి పరిష్కారం అవుతాయో ఆఫీసు ముఖం ఎప్పుడు చూస్తామో .... 

4 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

నిజమేకదా....రియల్ ఫీల్ :-(

Hima bindu చెప్పారు...

@ పద్మార్పిత
నిజంగా రియల్ ఫీల్ :)

జయ చెప్పారు...

ఇప్పుడు ఈ అవస్థ మీ వంతు:) పోన్లెండి మీ చిన్ని తోటి, బుజ్జులు తోటి బాగా కాలం గడపండి. మంచితరుణం మించిన దొరకదు:)

Hima bindu చెప్పారు...

@ జయ
ప్రస్తుతం చిన్ని బుజ్జు బుక్కు తో గడిపెస్తున్నాను