బ్లాగు తీసి రాయాలని అనిపిస్తుంది ,,,,,బ్లాగు రాయడము మొదలు పెట్టి పది సంవత్సరాలు దాటింది మొదట్లో వున్నా శ్రద్ద సంతోషము ఇప్పుడు లేవు ,,,సీరియస్ గా పనిలో వున్నప్పుడు కాస్త తీరిక చేసుకుని రాయాలని కూర్చుంటానాబుర్ర అంతా గందరగోళము .... వున్నా ఒక్కగానొక్క అమ్మాయి భూగోళనికి అవతల ,,,,ఇంత పెద్ద ఇంట్లో మేము ఇద్దరమే ,,,మీకు తోడు మేము ఉన్నాము అంటూ కోకిల హ్యాపీ లు ( పెట్ డాగ్స్ ) జోరీగల్లా జ్ఞాపకాలు ...ఎక్కడా కుదురు లేదు ఈ రెండున్నర ఏళ్ల లో అమ్మ నాన్న బుజ్జులు (నా dog ) ని కోల్పోవడము తీర్చలేని లోటు కబుర్లు సలహాలు చెప్పడానికి అమ్మలేదు కెరీర్ గూర్చి ఉద్యోగములో వచ్చే ఒడిదుడుకుల మీద చర్చ కి నాన్న లేరు ఎటు వెళ్తే అటు నా కూడా కూడా తిరుగుతూ నాకోసము గుమ్మములో ఎదురు చూసే బుజ్జులు లేదు ,,,,మరచిపోదాము అన్నా మరవలేని నా ఆత్మీయులు ,,,వీళ్ళని అస్సలు ఎప్పటికయినా చూడగలనా ???? నిజంగా చనిపోయిన వారంతా పైన లోకములో కలుస్తారా ????? ఇవన్నీ మనస్సుకు ఉపశమనము కలిగించడానికి కల్పితాలేమో ....ఆ భావన భ్రమల్లో పడి జీవన ప్రవాహములో పడటానికి అనుకుంటాను ,,,,,,,వద్దనుకున్నా నా మనస్సు గతం లోనే విహరిస్తోంది ప్రస్తుత స్థితిని వదిలి ,,,,,,,,ఖాళి దొరికినపుడు నాకు ఇష్టం అయినా వ్యాపకం మొక్కల్ని పెంచే క్రమములో పడ్డాను ,,,,పుస్తకాల పట్ల కూడా మనస్సు నిలవడము లేదు ,,,సేంద్రీయ పంటలు పండించాలని మిద్దె తోటలు అభిరుచి పెరటి రుచులు యు ట్యూబుల్లో సీరియస్ గా వాచ్ చేయడములో నిమగ్నం అయ్యాను ,,,,,,,,ముందు ముందు నా బ్లాగు పోస్ట్స్ ఆక్రమిస్తాయి అనుకుంటాను ,
13, నవంబర్ 2019, బుధవారం
10, సెప్టెంబర్ 2019, మంగళవారం
ఒక తరము వెళ్ళిపోయింది
మా గైడ్ ఫిలాసఫీర్ గొప్ప వ్యక్తిత్వము విలువలు కలిగిన మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు ఇల్లు పూర్తిగా ఖాళి అయ్యింది ,,,,https://himabinduvulu.blogspot.com/2009/06/blog-post_21.html
25, మే 2019, శనివారం
శీత వేళ రానీయకు --శిశిరానికి చోటీయకు
అప్పుడే కొత్త సంవత్సరము సగములోకి వచ్చేసాము ,,,ఇంకేముంది నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే ఆరు నెలలలోకి .....నాకోటి అర్థం కావడం లేదు భూమి ఏమైనా తన వేగాన్ని పెంచిందా అని సందేహం వస్తుంది ..... మనకేమో సంవత్సరాలు నెత్తి మీదకి వస్తున్నాయి కానీ ఒక్క వెండివేణి కనబడటం లేదు ,,,కళ్ళు మాత్రం కొంచెం మసకబారి అద్దాలు లేనిదే చిన్న అక్షరాలూ కాన రావడం లేదు ఇది వయస్సు తో వచ్చిన చత్వారం అని డాక్టర్ గారు సెలవిచ్చారు కొన్నాళ్ళకి తగ్గిపోతుంది అని ఊరట నిచ్చారు ,,, రోజు వీడియో కాల్ పిల్లలతో మాట్లాడుతుంటే
అప్పుడు గుర్తొస్తుంది నిజంగానే భూమి వేగంగా తిరిగి పోతుందని .... నిన్న కాక మొన్న పుట్టిన అమోఘ ప్రీస్కూల్
కి వెళ్ళడము ఏమిటి ... వింత కాపోతే అనిపిస్తుంది ,,,,, ఇంకా నా మనస్సు లో శశిరానికి తావు రాలేదు
అప్పుడు గుర్తొస్తుంది నిజంగానే భూమి వేగంగా తిరిగి పోతుందని .... నిన్న కాక మొన్న పుట్టిన అమోఘ ప్రీస్కూల్
కి వెళ్ళడము ఏమిటి ... వింత కాపోతే అనిపిస్తుంది ,,,,, ఇంకా నా మనస్సు లో శశిరానికి తావు రాలేదు
4, మార్చి 2019, సోమవారం
అమెరికా
రెండు నెలల క్రితము భూగోళము ఆవ
లకి ప్రయాణం అని చెప్పాను కదా ... వెళ్ళడము రావడము జరిగింది .. ఆ చలిలో మంచులో నాకు అస్సలు నచ్చలేదు అమెరికా .... యేది నాకు అద్భుతం అనిపించలేదు ...... ఇండియా లో ఉన్నంత రాయల్ లైఫ్ అక్కడ ఏది అనిపించింది .... ఎంతమందిలో వున్నా ఒంటరితనం .... డబ్బు సంపాదించడము ఒక్కటే జీవితముగా కనిపించింది నాకు అక్కడ తారసపడిన వారిలో ..

7, డిసెంబర్ 2018, శుక్రవారం
భూగోళం ఆవలికి ప్రయాణం
అమ్మాయి పెళ్ళీ అయ్యి ఆరు నెలల్లోనే అమెరికా వెళ్ళిపోయి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయ్యినా ..అమ్మమ్మ గా ప్రమోషన్ వచ్చినా .. యెంతమంది గొడవ చేసినా భూగోళముఆవలికి
అడుగు పెట్టలేదు ...కారణాలు చాలా వుంటాయి ..చూసేవాళ్ళకి మాత్రం విడ్డురమే !
ముఖ్యంగా చంటిపిల్లలా మమ్మల్ని వదలకుండా కాళ్ళ వెంట కూడా కూడా తిరిగే మా బుజ్జులు ..కోకిల ను వదలడము చాలా కష్టము తో కూడిన పని ...
రెండోది సర్కారీ కొలువులో నెలలు సెలవు మంజూరు ఒక యుద్ధమే !
ఎట్టికేలకు నెల రోజులు సెలవు తీసుకుని అమెరికా కు ప్రయాణం అయ్యాను ...మా విజివాడ నుండే .... ఇంత చలిలో ఏందబ్బా అని ముక్కు మీద వేలు వేసుకుని అందరు ఒకటే హాశ్చర్యము ....మనవరాలు పిలుస్తుంది రమ్మని ... నేను వెళ్లకుండానే పుట్టేసింది హడావిడిగా ... రేపే నా ప్రయాణం !

29, నవంబర్ 2018, గురువారం
మిస్ యూ అమ్మా .బుజ్జులు
దాదాపు సంవత్సరం అయ్యింది బ్లాగు రాసి ..... రాయాలని మనస్సులో ఆలోచన వుంటుందికానీ చుట్టూ పరిస్థితులు పర్మిట్ చేయడము లేదు ... అమ్మ మమ్మల్ని వదలి వెళ్ళిపోయి యేడాది దాటిపోయింది ఆ డిప్రెషన్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే నా బుజ్జులు నన్ను మా ఇంటి వారందరిని ధుఃఖ సాగరంలో ముంచివేసింది ఇందులో తన తప్పేమి లేదు డాక్టరు నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది .... తలుచుకుంటుంటే గుండె చెఱువు అవ్వుతుంది .. నాకు ప్రాణం అయ్యినవారు ఇద్దరు లేరు ....ఒకింత విరక్తి ... జీవితం ఇంతేనా ...ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టవలసిందే కదా ...ఈ మాత్రం బ్రతకడానికి మనుష్యుల్లో ఇంత ఆరాటం యెంతో పోరాటం ఎందుకో అనిపిస్తుంది ....రెగ్యులర్ గా యోగా ధ్యానం తరగతులకు వెళ్తున్నాను క్రమం తప్పకుండా ఉదయపు నడకలు నడుస్తున్నా ... మనిషిని చిక్కానే కానీ మనస్సులో వ్యధ ఇసుమంతయినా తరగడము లేదు ...మనో వ్యాధికి మందు లేదంటారు ...నిజమే ...లేదు ..కాలం
మారుస్తుందేమో వేచి చూడాలి .... మిస్ యూ అమ్మా .బుజ్జులు
పిల్లల మధ్యలో అమ్మ
మారుస్తుందేమో వేచి చూడాలి .... మిస్ యూ అమ్మా .బుజ్జులు
పిల్లల మధ్యలో అమ్మ
22, అక్టోబర్ 2017, ఆదివారం
ఏకాంతంగా
నిన్న మొన్నా వున్నా దూకుడు తగ్గింది ... వెనక్కి తిరిగి చూసుకుంటుంటే యెంత మార్పో ! ప్రతి పనిలోనూ మనమే ముందుండాలని అద్భుతంగా ఉండాలని ఇంటిపని వంటపనిలోను
మనదైన ముద్ర వుండాలనే ఉత్సాహం ఏమై పోయిందో ప్చ్! అటు ఉద్యోగం అయినా గొప్పగా
వెలిగిస్తున్నామా అంటే అదీ లేదు ఇంకా యెన్నాళ్ళు చేయాలో అని లెక్కలు వేసుకునే స్థితి కి
యెప్పుడో వచ్చేసాను !అలా అని వాలంటరీ ఇద్దాము అంటే యెంత కష్టపడితే ఈ గ్రూప్ వన్
తెచ్చుకున్నానో కళ్ళ ముందు కదులుతుందీ ప్రతీ నెల అకౌంట్ లో జమ అయ్యే జీతం కనబడుతుంది
అస్సలు యే పని చేయకుండా స్థబ్దతగా ఉదయం నుండీ వరండాలో ఏకాంతంగా కూర్చుని ఆ పచ్చటి చెట్లనూ వాటి మీద
అల్లరి చేసుకుంటూ తిరిగే ఉడుతలను కిచకిచలాడే పిట్టల్ని ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నిస్తున్న తూనీగలను
ఎక్కడినుండో రివ్వున వచ్చి వెళ్తున్న సీతాకోక చిలుకని నీరెండలో విడిపోతున్న దూది లాంటి మబ్బుల్ని చూస్తూ
ఆరు నెలల క్రితం మమ్మల్ని వదిలి వెళ్లిన "అమ్మ "ఆ మబ్బుల్లో ఎక్కడైనా దాగి మమ్మల్ని చూస్తుందేమో
కనబడుతుందేమో అనే ఒకింత ఆశ తో (సత్య దూరమైనా )గడపాలనిపిస్తుందీ

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)