16, నవంబర్ 2019, శనివారం

ప్రక్కింటోళ్ల స్థలములో నా చెట్లు

ఈ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉత్తర దిక్కు మొక్కల్ని పరకాయిస్తు ప్రహరీ ఆవల కి ఒక లుక్ ఇచ్చాను నా బొప్పాయిలు కాస్త రంగు మారాయి అరటి చెట్టు భారంగా ఒంగి నేలను చూస్తుంది ... ఇక వాటి భాధ చూడలేక డ్రైవర్ కుర్రాడిని పిలిచి  అర్జంటుగా గోడ దూకి అరటి గెల బొప్పాయిలు కోసేసెయ్యి అని వంటగదిలోకి వెళ్లి చాకు తెచ్చి ఇచ్చాను ...రెండు క్షణాల్లో అవి మన ఇంటికి వచేసాయి .... అవి గెల వేసినప్పటినుండి కాపలా కాయలేక చస్తున్నాను అస్సలుకే మనది క్యాంపుల ఉజ్జోగము అన్నట్టు మనది ఇప్పుడు విజ్జివాడలో ఉజ్జోగాము  కాదు రత్నాల సీమ కి వెళ్లి సంవత్సరము అయ్యింది కానీ వారము వారము విజివాడ చూడకుండా ఉండను గోడకి అవతల మనది కానీ స్థలములో నేను పెంచుతున్న వనముని చూడకుండా ఉండలేను ..ఆ స్థలము వాళ్ళు ఇటు దిక్కు కూడా చూడరు ... నేను అప్పుడెప్పుడో జంగారెడ్డిగూడెంకు నుండి తెచ్చిన అరటి చెట్లు ప్రహరీ పొడవునా సైనికుల్లా పెరిగి బోల్డన్ని గెలలు వేసి బరువు తో ప్రహరీ మొత్తము కూలగొట్టాయి ...ఇక దొరికిందే వంక మా వారు నిర్ధాక్షిణ్యంగా మొక్కలన్నీ నరికించి సిమెంటు చేపించి ప్రహరీ కట్టించారు ...నేను కిమ్మనకుండా వాటి పిలకల్ని ప్రక్క స్థలములో ..కొన్ని అమ్మ వాళ్ళింట్లో నాటెను .... వాటి ఫలాలు అన్నమాట ! చుట్టూ ప్రక్కల వారికి నాలుగు డజన్లు పంపిణి చేసి మిగిలినవి ఇవి ....ఇవి కూడా మా ఇంటికి ఎవరు వచ్చిన మా వారు అరటికాయలు వున్నాయి తీసుకు వెళ్ళండి అంటూ బలవంతంగా అంటగడతారు ..అరటి కూర తన గొంతుకలో దిగదు మరీ ఒకసారి తింటే గోప్పే ! బొప్పాయిది ఇంచుమించు ఇదే కథ ... మరోమారు గుర్తు చేసుకుందాము
  

15, నవంబర్ 2019, శుక్రవారం

పళ్ళ మొక్కలు పూలమొక్కలు కూరలు అన్నీ టెర్రేస్ ఎక్కేయి







ఇవన్నీ కొత్తగా ఇంటికి వచ్చిన పాపాయిలు ,,ఇంకొక విశేషము రెండు నెలలు క్రితము పారవేసిన బొప్పాయి గింజలు గ్రో బాగ్స్ లో  కళ్ళు విప్పేసి అప్పుడే పూలు పిందెలు వేసింది ,,క్రింద నేల తక్కువగా వుంది చుట్టూ చెట్ల తో  నీడలో మొక్కల ఎదుగుదల అస్సలు బాలేదు ..సో  కొత్తవన్నీ  టేర్రెస్  ఎక్కేస్తున్నాయి             


14, నవంబర్ 2019, గురువారం

పూల పిచ్చి

పది సంవత్సరాల క్రింద నా మొక్కల ప్రపంచము ,,,,,,,అమ్మ గారు మరల  వెనుకకు తిరిగారు  :-)



































13, నవంబర్ 2019, బుధవారం

కొత్త వ్యాపకం

బ్లాగు తీసి రాయాలని అనిపిస్తుంది  ,,,,,బ్లాగు రాయడము  మొదలు పెట్టి  పది సంవత్సరాలు  దాటింది  మొదట్లో వున్నా శ్రద్ద సంతోషము ఇప్పుడు లేవు ,,,సీరియస్ గా పనిలో వున్నప్పుడు కాస్త తీరిక చేసుకుని రాయాలని కూర్చుంటానాబుర్ర అంతా  గందరగోళము .... వున్నా ఒక్కగానొక్క అమ్మాయి  భూగోళనికి  అవతల ,,,,ఇంత పెద్ద ఇంట్లో మేము ఇద్దరమే  ,,,మీకు తోడు మేము ఉన్నాము  అంటూ కోకిల హ్యాపీ లు ( పెట్ డాగ్స్ ) జోరీగల్లా జ్ఞాపకాలు ...ఎక్కడా కుదురు లేదు  ఈ రెండున్నర ఏళ్ల లో అమ్మ నాన్న బుజ్జులు (నా dog ) ని కోల్పోవడము  తీర్చలేని లోటు కబుర్లు సలహాలు చెప్పడానికి అమ్మలేదు కెరీర్ గూర్చి ఉద్యోగములో వచ్చే ఒడిదుడుకుల మీద చర్చ కి నాన్న లేరు ఎటు వెళ్తే అటు నా కూడా కూడా తిరుగుతూ నాకోసము గుమ్మములో ఎదురు చూసే బుజ్జులు లేదు ,,,,మరచిపోదాము అన్నా మరవలేని నా ఆత్మీయులు ,,,వీళ్ళని అస్సలు ఎప్పటికయినా చూడగలనా ???? నిజంగా చనిపోయిన వారంతా  పైన లోకములో కలుస్తారా ????? ఇవన్నీ మనస్సుకు ఉపశమనము కలిగించడానికి కల్పితాలేమో ....ఆ భావన భ్రమల్లో పడి జీవన ప్రవాహములో పడటానికి అనుకుంటాను ,,,,,,,వద్దనుకున్నా నా మనస్సు గతం లోనే విహరిస్తోంది  ప్రస్తుత స్థితిని వదిలి  ,,,,,,,,ఖాళి దొరికినపుడు నాకు ఇష్టం అయినా వ్యాపకం  మొక్కల్ని పెంచే క్రమములో పడ్డాను ,,,,పుస్తకాల పట్ల కూడా మనస్సు నిలవడము లేదు ,,,సేంద్రీయ పంటలు పండించాలని మిద్దె తోటలు అభిరుచి పెరటి రుచులు యు ట్యూబుల్లో సీరియస్ గా వాచ్ చేయడములో నిమగ్నం అయ్యాను ,,,,,,,,ముందు ముందు నా బ్లాగు పోస్ట్స్ ఆక్రమిస్తాయి అనుకుంటాను ,


10, సెప్టెంబర్ 2019, మంగళవారం

ఒక తరము వెళ్ళిపోయింది

మా గైడ్ ఫిలాసఫీర్ గొప్ప వ్యక్తిత్వము  విలువలు కలిగిన మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు  ఇల్లు పూర్తిగా ఖాళి అయ్యింది ,,,,https://himabinduvulu.blogspot.com/2009/06/blog-post_21.html

25, మే 2019, శనివారం

శీత వేళ రానీయకు --శిశిరానికి చోటీయకు

అప్పుడే కొత్త సంవత్సరము సగములోకి  వచ్చేసాము ,,,ఇంకేముంది నాలుగు రోజులు  కళ్ళు మూసుకుంటే ఆరు నెలలలోకి .....నాకోటి అర్థం కావడం లేదు భూమి ఏమైనా తన వేగాన్ని పెంచిందా అని సందేహం వస్తుంది ..... మనకేమో సంవత్సరాలు నెత్తి మీదకి వస్తున్నాయి కానీ ఒక్క వెండివేణి  కనబడటం లేదు ,,,కళ్ళు మాత్రం కొంచెం మసకబారి అద్దాలు లేనిదే చిన్న అక్షరాలూ కాన రావడం లేదు  ఇది వయస్సు తో వచ్చిన చత్వారం అని డాక్టర్ గారు సెలవిచ్చారు కొన్నాళ్ళకి తగ్గిపోతుంది అని ఊరట నిచ్చారు ,,, రోజు వీడియో కాల్  పిల్లలతో మాట్లాడుతుంటే
అప్పుడు గుర్తొస్తుంది  నిజంగానే భూమి వేగంగా తిరిగి పోతుందని .... నిన్న కాక మొన్న పుట్టిన అమోఘ ప్రీస్కూల్
కి వెళ్ళడము ఏమిటి ... వింత కాపోతే అనిపిస్తుంది ,,,,, ఇంకా నా మనస్సు లో  శశిరానికి  తావు రాలేదు 

4, మార్చి 2019, సోమవారం

అమెరికా

రెండు నెలల క్రితము భూగోళము ఆవ
లకి ప్రయాణం అని చెప్పాను కదా ... వెళ్ళడము రావడము జరిగింది .. ఆ చలిలో మంచులో నాకు అస్సలు నచ్చలేదు అమెరికా .... యేది నాకు అద్భుతం అనిపించలేదు ...... ఇండియా లో ఉన్నంత  రాయల్ లైఫ్ అక్కడ ఏది  అనిపించింది .... ఎంతమందిలో  వున్నా ఒంటరితనం .... డబ్బు సంపాదించడము ఒక్కటే జీవితముగా కనిపించింది నాకు అక్కడ తారసపడిన వారిలో ..