గత టపాలో మా స్వంత కార్ మీద పనిచేసిన డ్రైవర్ కథ రాసాను ..ఇది ఆఫీసు కార్ మీద పనిచేసిన డ్రైవర్ కథ.ఈ మద్య కాలం లో గవర్నమెంటు స్వంత కార్స్ కొనకుండా ఏడాదికి టాక్సీ వి అగ్రీమెంటు చేసుకుంటునారు,అందువలన కార్ లో పనిచేసే డ్రైవర్ బయటి వ్యక్తి అయ్యి వుంటున్నాడు.అదీ ట్రావెల్స్ వాళ్ళేనియమిస్తారు.తరుచు డ్రైవర్లు మారుతుంటారు.నేను చెప్పబోయే సంఘటన నాలుగు నెలలు క్రిందట జరిగిందీ.
ఒక డ్రైవర్ చెప్పకుండా మానేస్తే నలభయ్యేళ్ళ పై వయస్సున్న వ్యక్తిని పంపించారు .అతని డ్రైవింగ్ విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా చక్కగా డ్రైవ్ చేసేవాడు .మనిషి సన్నంగా ,కొంచెం పొడవుగా ,కళ్ళు ఎప్పుడు తీక్షణం గా వుండేవి .చెప్పిన టైంకి ఐదు నిముషాలు ముందు వుండేవాడు.కాంట్రాక్టు డ్రైవర్ అయిన ఆఫీసు సిబ్బందితో త్వరగానే కలిసిపోయాడు.ఎప్పుడైనా ట్రాఫ్ఫిక్ లో అడ్డం వచ్చిన అవతలివారితో చాల రఫ్ఫ్ గ వ్యవహరించేవాడు,నేను వారిస్తూ వుండేదాన్ని.
ఒకసారి అత్యవసరంగా స్టేట్ కాన్ఫరెన్స్ విశాఖ లో పెట్టారు.పది గంటలకు ఎట్టి పరిస్థితిలో అక్కడ వుండాలి,ఏమాత్రం మానినా ,లేట్ అయ్యిన ఆ సినియర్ ఐయేఎస్ ఆఫీసర్ వూరుకోడు.ట్రైన్ కాని బస్ కానివీలు కాలేదు.తప్పనిసరి అయ్యి కార్ లో బయలుదేరల్సివచ్చింది . తెల్లవారుజామున మూడు గంటలకు మా సినియర్ అసిస్టెంట్ ని తీసుకుని ఇంటివద్ద బయలుదేరాం ..అది శీతాకాలం చలి చంపుతున్న సర్కారి సేవకులం కాబట్టి చచ్చినట్లు అవి పక్కన పెట్టి హైవే లో బయలుదేరాం .డ్రైవెర్ విపరీతమైన వేగం తో నడపడంతో నిద్రవస్తున్న అతన్ని అప్పుడప్పుడు హెచ్చరిస్తూ చీకటిలోకి చూస్తూ హై వే పొడవునా మిరిమిట్లుగోల్పుతున్న రెడిyam దీపాలు చూస్తూ అప్పుడప్పుడు నిద్రలోకి ఒరుగుతుండగా సడెన్గా మెలుకవ వచ్చింది ,ముందు సీట్ లో వున్నా నా స్టాఫ్ ఘాడంగా నిద్రపోతున్నాడు .రోడ్ కి ఇరువైపులా కాంతులు కనబడటం లేదు ,వెంటనే డ్రైవర్ ని అడిగాను ..."ఎటు వెళ్తున్నాం నాయన ' అని ...అతని నుండి సమాధానం రాలేదు వినలేదా విని చెప్పడం లేదా అని ఒక్కసారే డౌట్ వచ్చింది .మరల గట్టిగ అడిగేసరికి స్టాఫ్ లేచాడు.మేము వేల్తున్నాది కచ్చ రోడ్ 'నల్లజర్లరోడే ' తారు రోడ్ వేసిన అటు ఇటు చెట్ల తో ముందుకు పోయేసరికి క్యరీ లు ,కొండలతో వుంటాది ,నాకు అర్ధం కాలేదు బంగారం లాటి హైవే వదిలి ఇటేందుకు వచ్చాం ,కార్ వెనక్కి తిప్పమన్నాను ,నిజానికి ఆ క్షణం లో బయం వేసినా భింకంగా వుండటానికి ప్రయత్నించాను .మా స్టాఫ్ కి దారుల పట్ల అవగాహన లేదు ,నేను చెప్పేసరికి డ్రైవెర్ ని గట్టిగ గద్దిచ్చాడు...ఇది దగ్గర దారండి అని అతని నుండి నిర్లక్షమైన సమాధానం వచ్చింది .అయిష్టంగా కార్ వెనక్కి తిప్పాడు ,అప్పటికి పందొమ్మిది కిలోమీటర్లు వచ్చాము హై వే నుండి ...నిద్ర ఎగిరిపోగా నా కోపం మా స్టాఫ్ మీద చూపిస్తూ తెల్లవారేసరికి రాజమండ్రి చేరి అక్కడే వున్నా నా ఫ్రెండ్ దగ్గర అరగంట ఆగి మొత్తానికి వైజాగ్ సమయానికి చేరడం జరిగిందీ .నా మనసులో ఆ డ్రైవర్ పట్ల అనుమానం మొదలయింది ...అతను పైకి కనిపించేంత మంచి వ్యక్తి కాదనే బీజం నా మనస్సులో పడిపోయింది.అతన్ని తీసేయడం అంత వుత్తమం ఇంకొకటి లేదనిపించింది.
అతను చేరినప్పటి నుండి ఒక విషయమై ముఖం మీద చెప్పాను ,సిగరెట్లు డ్యూటీ పిరియడ్ లో త్రాగావద్దని ,కార్ మొత్తం ఏ.సి.లో పట్టేస్తుందని ....అతన్ని ఎంత హెచ్చరించిన అతని అలవాటు మార్చుకోలేదు రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరల మొదలు పెట్టేవాడు.దానితో చాల ఇబ్బందిగా వుండేది ,వాళ్ళ ఓనరు ని పిలిచి చెప్పాను ,ఇలాటి అలవాట్లు మానితేనే మా దగ్గర వుంచమని .ఒక రోజు మా ఆఫీసు స్టోర్ రూం తాళాలు పోయి రాకపోతే డ్రైవర్ ఒక్క నిమిషం లో తాళం రెండు ముక్కలుగా పగలకొట్టాడు ..నాకయితే అనుమానం భలపడింది
మా కార్ ఓనరు కి గట్టిగ చెప్పేసాను ...పూర్తిగా అతను సిగరెట్లు మానితేనే రమ్మనమని లేకపోతె వేరే ఎవరినయినా పెట్టమని కుదరని పక్షంలో కార్ కాంట్రాక్టు కాన్సిల్ చేసుకుంటాం అని చెప్పేసాను .దానితో ఆ ఓనరు గట్టిగ డ్రైవర్ ని హెచ్చరించేసరికి 'నా అలవాట్లు మానుకోను 'అని అతను చెప్పడం నాకు వేరే డ్రైవర్ ని పెట్టడం జరిగిందీ ...
ఇది జరిగిన నెలరోజులకు మా ఆఫీసు వాళ్ళందరు నేను వెళ్ళేసరికి టెన్షన్ తో కూడిన చర్చల్లో వున్నారు ....అందరు నన్ను చుట్టూ చేరి "మేడం చూసారా ?"అని పేపర్ నా చేతికి ఇచ్చారు.చుసిన నేను వాళ్ళలా తెగ ఆశ్చర్య పోలేదు,ఎందుకంటే అలాటిది ఎప్పుడో చూస్తాము ,అని......ఇంతకి జరిగిందీ ఏవిటంటే మా దగ్గర మానివేసినా డ్రైవర్ తన ఇంట్లో అద్దెకు వున్నా వ్యక్తిని తన భందువుల సహాయం తో చంపి ఇసుక దిబ్బలలో పూడ్చిపెట్టాడు,అది అతని కొడుకుకి సంభందించిన వ్యవహారం లో కలిపించుకుని చేసిన హత్య. అది చేసిన రెండురోజుల్లోనే పోలీసులు పట్టుకోవడం ,క్రైమ్ వాచ్ లో చూపించడం జరిగిందీ ...మా ఆఫీసు లో .ఒక్క నా క్యాంపు క్లార్క్ కి మాత్రమె తెలుసు అతన్ని నేను అనుమానపడుతున్నాను అని ...ఇంట్లో వాళ్లకి సరేసరి వద్దన్నా ఏదొక కంప్లైంట్ చేబుతానుగా :)
ఏమైనా ఇంట్లో పనివారి ఎంపికలో ,డ్రైవర్ ,ఎంపికలో కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలిసిందే...ఇది జరిగాక నాకు అతి జాగ్రత్త ఎక్కువ అయ్యింది .:)..............సమాప్తం .
12 కామెంట్‌లు:
ఏమిటో, ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్ధంగాని పరిస్థితి...
అమ్మో ఎలాంటి వ్యక్తి తో కలిసి వెళ్ళేరో కదా వైజాగ్ దాకా. మీకు కార్ డ్రైవర్ లు అచ్చి రావటం లేదండీ, నా మాట విని ఒక డ్రైవరమ్మ దొరుకుతుందేమో చూడండి. :-)
మాకు సస్పెన్స్ సినిమా చూపించారు కదా...
"సమాప్తం" .. అయ్యో..అయితే సీరియల్ ఐపోయినట్టేనా??
Miku drivers bhale dorukutaare? Jagrattandoy.
my god!luckyly you escaped...
okkoesaari mana sixthsense eami chebutundoe vini daaniki mana observation kooDaa kalipi aloechinchi disaiDu chaesukoevaali!. right time !right decision.
అమ్మో..మీ టపా మా అమ్మకు చూపిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఆటో ఎక్కడానికి కూడా ఇష్టపడదు. భయపెట్టేసారు కదా!!
@ఉమా
నాకో చెడ్డ అలవాటున్దండి,ప్రతీది నిశితంగా పరిశీలించడం బహుశా ఇలాటివే ఒక్కో అప్పుడు మనం ఇబ్బందుల్లో పడకుండా రక్షించ బడతమేమో .
@భావన
నాకు తలుచుకుంటే ఇప్పుడు భయమేనండి ...అబ్బ ఇది ఇండియా అండీ. అదీ గాక ఆంద్ర అండీ మనకి కండక్టర్అమ్మలు దొరుకుతారు కాని డ్రైవెర్అమ్మలు దొరకరు :)
@మురళి
ఏదో ఆడకూతుర్లు ఇలాటివి చదివి జాగ్రత్త పడతారని నా చేదు అనుభవాలు రాస్తే ఇలా యెగతాళి చేస్తారా ?బదులు
తీర్చుకుంటాను .
@భా.ర.రే
ఏమి కాదండోయ్ మంచి డ్రైవెర్ లు వున్నారు ..మనం మంచి త్వరగా చెప్పముగా,చెడు చెప్పినంత త్వరగా .:)
@అనఘ
అవునండి అద్రుష్టవంతురాల్ని ఇప్పటివరకు .
@సునీత
మీరన్నది నిజమే,మనం ప్రతి విషయం సూక్ష్మంగా ఆలోచించిన తప్పకుండ హింట్స్ అందుతాయి .
@శేఖర్
అయితే తప్పకుండ మీ మదర్ కి చదివించండి ,హైదరాబాద్ ఆటో వాళ్ళంటే నాకు మరీ భయం ...
మీరే డ్రైవ్ చేసేసుకోండి చిన్నిగారూ.. ఆఫీసురూ, డ్రైవరూ మీరే ఉభయకుశలోపరి..! అబ్బే ఉత్తుత్తినే..అలా కోపంగా చూడకండి మరి).
@praneetha
thanq...:)
నిజమే చిన్నిగారూ ! ఇలాంటి అనుభవాలు రాస్తే చదివినవారు జాగర్తపడతారు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి