5, ఆగస్టు 2009, బుధవారం

" కారు డ్రైవర్ కథ "

కథ శీర్షిక చూసి బోల్డంత ఆశ్చర్యపోతున్నారా !నాలుగు నెలల క్రితమే 'అనంతం 'బ్లాగ్ లో చూసాముకదా అని మరల ఇదేమీ కాపీ కథ అనుకుంటే అది నా తప్పు కాదు. మనకు .ఎదురయ్యే సంఘటనలతో ఎన్నో చెప్పొచ్చు .అతి జాగ్రత్తగా ఎంచుకోవలసిన వ్యక్తుల్లో వీరు వస్తారు ..నిజమే కదండీ మన నిత్య జీవితం లో మనం ఆధారపడే వ్యక్తిల్లో పనమ్మాయి ,డ్రైవర్లు నా వరకు ముఖ్యమైన వాళ్ళే .ఇపుడు ఏ ప్రభుత్వకార్యలయాల్లో కండిషన్ బండ్లు లేక ,కొనడానికి పర్మిషన్ లేక సెంట్రల్ ,స్టేట్ గవర్నమెంట్ లో ప్రవేట్ వెహికల్స్ ఇయర్ కి హైర్ చేయడం తో కారు డ్రైవర్లు ప్రవేట్ వ్యక్తులై వుంటారు.ఆఫీసు కార్ డ్రైవెర్ కన్నా ముందు ఇంట్లో కార్ డ్రైవెర్ కథ చెప్తాను . .మూడేళ్ళ క్రితం ఇంట్లో వున్న స్వంత కార్ కి మావారెంత వారిస్తున్నా వినకుండా డ్రైవర్ ని పెట్టాను .తనకి స్వంత డ్రైవింగ్ మీదే నమ్మకం ,నా గోల పాప గోల భరించలేక ఒప్పుకున్నారు.... ఆ డ్రైవర్ ని మా ఎదురింటి డ్రైవర్ తీసుకొచ్చాడు ,ఎదురు మార్వాడి దగ్గర పదేళ్ళ నుండి నమ్మకం గా పనిచేసే అబ్బాయి ఇలా అతన్ని తేవడం వలన గొప్ప నమ్మకం తో అప్పటికప్పుడే కుదిర్చేసాను/అతనికి ఓ పాతికేళ్ళు వుండొచ్చు.
.ఆ డ్రైవెర్ తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగాని,అన్న అక్కలు మంచి చదువులు చదివారని , ఇతని కి మాత్రమె చదువబ్బక డ్రైవింగ్ నేర్చుకుని ఇలా పనులు చేస్తున్నాడని చెప్పాడు.మేము ఇచ్చే జీత భత్యాలకు ఎదురు ఇంత కావాలని అడగకుండా పనిలోకి చేరిపోయాడు .

ఆ అబ్బాయి చాల పద్ధతి గా టైం కి రావడం నీట్ గా కార్ తుడుచుకోవడం చూసి మావారికి చాల ముచ్చటేసింది ..పోనిలే ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావు అని మనకు కీతాభుఇవ్వటం జరిగిందీ .ఎక్కువ పని వుండేది కాదు ,చక్కగా చెట్ల క్రింద కార్ పార్క్ చేసుకుని ఎఫ్ .యెమ్.వింటునో ,సీ.డి లు వింటూ పేపర్ పుస్తకాలు బుద్దిగ చదువుకుంటూ వుండేవాడు.ఒకరోజు చెప్పాపెట్టకుండా మానేసాడు .మరుసటిరోజు వచ్చి చాల అర్జెంటుగా ఊరెల్లాల్సి వచ్చిందన్నాడు ( మిగిలినది రేపు )

8 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మీకు కామెంటు కూడా రేపే..

Hima bindu చెప్పారు...

@బాస్కర రామిరెడ్డి
చిన్న సందేహం ...రేపు రాయకపోయినా కామెంట్ రాసేస్తారా -:) మాకు నిద్ర టైం అని అక్షరాలూ ముందుకు పడటం లేదండి అందుకే వాయిదా .

ఉమాశంకర్ చెప్పారు...

మీరు ఇన్నింటికి నిద్రపోదాం అని ముందే నిర్ణయించుకొని, కావాలనే దానికి ఒక పది నిమిషాల ముందు రాయడం మొదలెట్టి , మమ్మల్నిలా సస్పెన్స్ లోపెట్టి.. అంతా కుట్ర ....:)

మరువం ఉష చెప్పారు...

చిన్నీ, ముందే విన్నట్లుందబ్బా... మా పాల అబ్బాయి వెంకటేష్ తమ్ముడు నగేష్ ఇలాగే వచ్చాడు. కానీ అక్క అక్క అంటూ చాలా ప్రేమగా వుండేవాడు. రామ భక్త హనుమాన్ లెక్కన తిరిగేవాడు. మానటం మాట అటుంచి నేను ఆఫీసు ఎగ్గొట్టిన రోజు కూడా అలా గుమ్మంలో కూర్చునివుండేవాడు..;) మిగతా వ్యాఖ్య మీ తర్వాతి టపా చదివిన తర్వాత..

భావన చెప్పారు...

ఏమిటి ఇది టీవి సీరియల్ లా ఒక్క సారి చెప్పకుండా.... నేను ఖండిస్తున్నా..

మురళి చెప్పారు...

ఈ కుట్రని నేను కూడా ఖండిస్తున్నా :-)

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

చదువరులను సస్పెన్స్ లో పెట్టే కుట్రలు నశించాలి. రెండో భాగం వెంటనే చెప్పెయ్యాలని 'అఖిల భారత సస్పెన్స్ భరించలేని సంఘం' తరపున డిమాండ్ చేస్తున్నా. :-)

Hima bindu చెప్పారు...

@అఖిల భారత సస్పెన్స్ భరించలేని సంఘ సభ్యులకు :)
@ఉమాశంకర్
@బావన
@మురళి
@శేఖర్ పెద్దగోపు
మీ అందరి కోరిక మన్నించి సమయం ,మూడ్ లేకపోయినా రెండో ది మరునాడే రాసేసాను,మీ అందరికి దన్యవాదములు .
@ ఉష జీ
మీ డ్రైవర్ కథ కోసం నేను ఎదురుచూస్తున్నాను,ఇవన్ని మనం మరింత జాగ్రత్తకి పనికి వస్తాయి.

.