24, ఆగస్టు 2009, సోమవారం

"గుత్తివంకాయ కూరోయి మామ "

గుత్తోంకాయి కూర మీద పాట రాస్తున్నాను అనుకుంటునారా !...ఓహ్ ...నేను వండిన కూర గురించి అనుకుంటున్నారా !..అబ్బే అదేం కాదు....
ఈ రోజు లేవడమే చికాకుతో లేచాను ...బాబా ని కూడా చూడలనిపించలేదు,కాని కిచెన్ లోకి వెళ్ళేప్పుడు "నన్ను వదిలి నీవు పోలేవులే...అది నిజములే " అన్న తరహాలో పూజ గది ముందే దర్శనం ఇస్తుందాయే,చూడకుండా పోదామనుకున్నా కాని క్రితం రోజు నా చిన్నారి చేసిన పాలవెల్లి అలంకారాలు నా అడుగు పక్కకు పడనీయలేదు..పూలు ఆకులు ఇంకా తాజాగా వున్నాయా అని ఒకసారి పరిశీలించి మొక్కుబడిగా దేవుళ్ళన్దరికి ఓ నమస్కారం పడేసి కిచెన్ లోకి పోయి టీ చేసుకుని తనకి ఓ కప్ మనకొక కప్ తీసుకుని పేపర్ చదువబోయా ...టీ అయ్యింది కాని ఒక్క లైన్ కదిలితే ఒట్టు..తగ్గట్టే ఆఫీసు ఫోన్ మోగడం వరుస చికాకులు ,అటు వంట చేస్తూ వెధవ గోలకి ఆన్సర్ చేస్తూ...పదకొండు తరువాతే ఆఫీసు చేరాం ....మరల మొదలు,నా విసుగు తో విసిటేర్స్కి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు..ఎప్పుడు ఇలా చేయలేదు ...కొంచెం రిలాక్స్ కావడానికి నా మిత్రులు కొందరిది బాతాకాని "సోదికబుర్లు"చెప్పి మద్యలో అరగంట బ్లాగ్లు చదివి బోల్డంత పనిచేసి అలిసిపోయాను ....ఎన్నడు లేనన్ని టెన్షన్స్ అన్నీ ఒక్కసారే !..ఇంత చిరాకు లో వుండగా నా స్నేహితుడి నుండి కాల్....బోజనంకి ఇంటికి వెళ్ళడం లేదా అని ,లేదని చెప్పి తనని కాసేపు విసిగించాక ..".సరే ఇంటికి వచ్చాక కాల్ చేయండి నేను తీరికగానే వున్నాను తీరికగా మాట్లాడుదాం "అన్నాడు. బాగా విసిగించానేమో అని ఒక్క క్షణం డౌట్ పడ్డా ...హు ..ఏముందిలే మనం ఎప్పుడు ఇంతే కదా అనుకుని సరే అనేసాను ...పని వలన త్వరగా వెళ్ళలేకపోయాను...ఈ లోపు నా స్నేహితుని కాల్స్ ,ఇల్లు చేరాన ,లేదా అని ..
ఇంటికి చేరగానే సమాచారమందుకున్న నా మిత్రుడు పావుగంటలో ప్రత్యక్షం .....మాములుగా కాదు చేతి లో పెద్ద టిఫిన్ బాక్స్ తో,..అబ్బో ఏంటిది అంటూ హడావిడిగా మూత తీసానో లేదో ....ఘుమ ఘుమల తో "గుత్తొంకాయ కూర "డబ్బా నిండుగా ..'.నేనే మద్యాహ్నం చేసాను కష్టపడి '.మెరిసే కళ్ళతో తనకే ప్రత్యేకమైన అందమయిన నవ్వు తో ...చెప్పాడు ......ప్రోద్దుటినుండి నుండి వున్నా విసుగు ,కోపం ,చిరాకు ..హుష్ ...మాయం ......ఎలా వుందో తిని చెప్పాలంట........ఇదిగో ఇంత అధ్బుతంగా వుంది .....మద్యాహ్నం వున్నా రైస్ తో కొంచెం తిన్నాను...అప్పుడే వచ్చిన మా వారికి కొంచెం రుచి చూపించాను ...అబ్బో నా మార్కులే కాదు మా శ్రీవారి మార్కులు కొట్టేసావ్ .....ఇదిగో చెల్లికి,అమ్మకి కూడా పంపిస్తున్న .........వాల్లెన్ని మార్కులేస్తారో ......గుత్తొంకాయ కూర అధ్బుతంగా చేసారని ...ఇదిగో ప్రపంచానికి చాటింపు వేస్తున్నా......:):).....ఇప్పుడు నేను కూల్ గా వున్నాను .

17 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మా మార్కులు కూడా వేసేసామ్.

సృజన చెప్పారు...

:)..:)

Bhãskar Rãmarãju చెప్పారు...

ఎలా చేసావ్? అని అడిగి, ఇలా చేసారట అని ఇక్కడో ముక్కపడేస్తే అరిగిపోతారా?

మురళి చెప్పారు...

మనలో మన మాట.. మర్యాద కోసం 'బాగుంది' అన్నారా? :-) :-) మగవాళ్ళ వంటమీద నాక్కొంచం నమ్మకం తక్కువని 'నలభీమ' కి కోపం వస్తుందేమో...

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

ఏంటండి మీరు...గుత్తి వంకాయ మీద టపా రాసి నోరూరించేస్తున్నారు...అసలే మీ టపా భోజనంకి వెళ్ళే ముందు చదివాను. గుత్తి వంకాయ మీదకి మనసు మళ్ళటం వల్ల లంచ్ అస్సలు సరిగ్గ చెయ్యలే. దీనికి పరిష్కారం మీరు ఓ బాక్స్ లో మాకు ఆ కర్రి పంపించేయటమే...
@మురళి గారు, అన్నన్నా..ఏంటీ మీకు మగవాళ్ళ వంట మీద నమ్మకం ఉండదా!! అయితే ఈ సండే మీరు మా ఇంటికి రావాల్సిందేనండీ. నా చేత్తో చేసిన బిర్యానీ తినాల్సిందే.

Hima bindu చెప్పారు...

@భా.రా.రే.
యెన్ని మార్కులు వేసారండి?-:)
@సృజన
ధన్యవాదాలండి
@బాస్కర రామరాజు
ఎలా చేసావు అని అడిగేశాను ...రాసేస్తాను,మరి నేనెలా చేస్తానో కూడా రాస్తాను ...రెండు మీరు ప్రయోగం చేసి మా ఇద్దరిలో ఎవరిది బాగుందో చెప్పాలి మరి ...-:)

Hima bindu చెప్పారు...

@మురళి
హు ..మర్యాద కోసం బాగుంది అనలేదండి .
కూరకాదు ఇక్కడ తను చేసిన పని రోజంతా నేను పడ్డ చికాకుని తరిమేసిందని నా అసలు ఉద్దేశ్యం పెళ్లి లలో ,పెద్ద
విందుల్లో వంటలు చేసేది మీ 'నలభీములే 'కదా !

@శేఖర్
అర్జెంటుగా మీ అడ్రెస్స్ ఇచ్చేయండి 'వేడివేడి గుత్తొంకాయ కూర 'మీకు పంపెస్తాను డబ్బా నిండుగా ...చిన్న సవరణ నేను చేసిందే ...సుమా ..............హు మీ భోజనం మురళి కి మాత్రమేనా ...మేం అలిగాం .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఎన్ని మార్కులా చెప్పమంటారా? పేద్ద గుండు సున్నా :)
లేకపోతే మాకు అడుగు బొడుగు అన్నా వుంచకుండా మొత్తం నాకేస్తారా? :-)

Hima bindu చెప్పారు...

@
భా .రా.రే
అయ్యో అస్సలు విషయం మరచిపోయి మీ మార్కులు అడిగేసాం,దక్షిణం లేకుండా మీ అభిప్రాయం చెప్పరుకదా ....అప్పుడెప్పుడో 'తంగేడుపూల' విషయంలో నే నాకు,ఉష కు చెప్పారుగా...సరేసరే అడుగుబోడుగు పంపడం మీలాంటి పెద్దోరికి భావ్యం కాదు.తాజాగా వండేసి దక్షిణం సమర్పిస్తాం.అప్పటివరకు మీ గుండుసున్న మీ దగ్గరే వుంచుకోండి,ఎవరికి చెప్పకండే :):)

sunita చెప్పారు...

చక్కగా " గుత్తోంకాయి కూర వండి పెట్టి " మీ చికాకుని దూరం చేసిన మీ స్నేహితునికి ఇవ్వాలి 100 మార్కులూ.

Hima bindu చెప్పారు...

@సునీత
అందుకేనండి ప్రపంచానికి చాటిచేబుతున్నా :) ధన్యవాదాలు .

మరువం ఉష చెప్పారు...

Lucky you. I get such unexpected surprises once in a while but turn out to be chicken for rest of family :( and I am back to my own swayampaakam....

anagha చెప్పారు...

me guttivankaya kura katha bagundi...inka kura ye nthabagundo...iyena abbayelu vantalu cheyadamenti
naku nachhaledu.

Hima bindu చెప్పారు...

@ఉష
అసలు స్నేహితులనుండి ఊహించని గిఫ్ట్ లు తీసుకునే 'ఆనందమే' వేరు కదండీ ...అదీ ఒక్క చిన్న చాక్లెట్ అయ్యుండొచ్చు .నాకు చాక్లెట్స్ ఇష్టమని నా స్నేహితులు ..మా శ్రీవారు అప్పుడప్పుడు ఇలా స ప్రైజ్ ఇస్తుంటారు
@అనఘ
అదేంటండి వంటలు చేసే వాళ్ళంతా అబ్బాయిలెకద!...సవరణ ..పెద్ద పెద్ద వంటలు . ధన్యవాదాలు .

ప్రణీత స్వాతి చెప్పారు...

అన్యాయం..!! మీరు తిన్నారు మరి మాకో?

Hima bindu చెప్పారు...

@pranitha
address please-:)

పరిమళం చెప్పారు...

ఓహో ..నాకిష్టమైన కూరల్లో ఒకటి ! వేజిటేరియన్స్ చికెన్ అని ముద్దుగా పిలుచుకుంటాం ...మరి మాకో ?
అడ్రెస్ : పరిమళం , కూడలి లేదా జల్లెడ ..లేదా ఎవరి బ్లాగ్ కామెంట్స్ లో అయినా దొరుకుతాం !