16, డిసెంబర్ 2009, బుధవారం

కళామాత ముద్దుబిడ్డలు

ఇప్పటివరకు సమైక్య ఉద్యమానికి కాని తెలంగాణా ఉద్యమానికికాని యువతే స్పూర్తిదాయకంగా నిలబడి తమ చదువులు ప్రాణాలు సైతం లెక్కచేయక కదం తొక్కుతున్నారు,వీరంతా రాజకీయ నాయకులకి భలంగా వున్నరనడం లో ఎటువంటి సందేహం లేదు .అన్ని వర్గాలు ,స్త్రీలు పురుషులు ,వ్యాపారులు ఉద్యోగులు సైతం ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు .ఉద్యోగులు పెన్ డౌన్ చేసి తమ నిరసన తెలియచేస్తున్నారు .ఇంత జరుగుతున్న ఒక వర్గం మాత్రం స్పందించడం లేదు .ఎన్నికలప్పుడు ,విపత్కర పరిస్తితులప్పుడు హంగామా చేసే వీరు ఏమైపోయారు ...వారిని ఎవరైనా ఆపుతున్నారా? వీరికున్న మాస్స్ ఫాల్లయింగ్ వేరేవారికి ఉండదే ?వారికి ఏమి వద్దా ? ముఖ్యంగా కోస్తాజిల్లాల నుండి వెళ్ళిన ఈ కళామాత ముద్దు బిడ్డలు ఏమయ్యారో ?గళం ఎత్తి గానం చేస్తున్నా వినబడటం లేదే ?

13 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

వాళ్ళు అడకత్తెరలో పోకచెక్కలు పాపం,నోరు విప్పలేరు.

భావన చెప్పారు...

కళా మాత ముద్దు బిడ్డలంటే సినిమా యాక్టర్స్ ఆ? రేపు సినిమా రిలీజ్ ఐతే తెలంగాణా, కోస్తా అన్ని చోట్ల ఆడాలి కదా.. ఎవరి గోల వారిది. :-)

అజ్ఞాత చెప్పారు...

ఇంతకీ ఎవరండీ ఆ వర్గంవారు

Hima bindu చెప్పారు...

@చిలమకురి విజయమోహన్
నిజమే కాని వారు సమాజం లో భాగం కదండీ .
@భావన
వారే .:)
@అజ్ఞాత
ప్రేక్షకుల గుండెల్లో దేవుళ్ళు.

జయ చెప్పారు...

అవును మరి, ఇప్పుడు వీళ్ళేం చేస్తారో. చిరంజీవి, మోహన్ బాబు మీద మొదలయ్యిందికదా. చూద్దాం, ముందు ముందు ఈ కళామతల్లి ముద్దు బిడ్డల సంగతేంటో.

మురళి చెప్పారు...

ఇవాళ రాజధానిలో ఏదో ప్రదర్శన చేస్తారట.. ఒక మహానటుడు చిత్తూరులో నిరాహారదీక్ష మొదలు పెట్టాడు, ఆయన (ఒకప్పటి) మిత్రుడు పదవికి రాజీనామా చేసి మరీ పోరాడుతున్నాడు.. జనం ఏమో వాళ్ళ పోష్టర్లు చించేస్తున్నారు..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అంతా సినీ 'మాయ'...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ కామెంట్లు ముఖ్యం కాదన్నావు కాబట్టి..నేనింక కామెంటను పో.
ఇంతకీ ఒకప్రక్కన చేరారా లేక ఇంకా "గోపి" లేనా?

Hima bindu చెప్పారు...

@జయ
మీరు చెప్పినవారు రణరంగం లో దూకారు ...రగులుతుంది .
@మురళి
స్పష్టత ఏర్పడింది ...కాని ఇంకా రావాల్సినవారెందరో వున్నారు
@శేఖర్
అదే మాయా మాస్ లోకి బాగా వెళ్తుంది
@భా.రా.రె
హెంత మాట అనేసారు ! మనం ఏమి గోపి లము కాదమ్మా ...కొన్ని రూల్స్ వుంటాయి ,ఇకపోతే ఆవేశం వస్తే రూల్స్ ఉల్లంఘించి దూకేస్తాం -:)బహుశా ఆ పరిస్థితి రాదేమో .మేమంతా శాంతి దూతలం..సమైక్యతా మాకు ముద్దు .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ ఆ మాటన్నది మిమ్మల్ని అనుకొన్నారా? హయ్యో రాత, మీ కళామాత ముద్దుబిడ్డలని అన్నది.

Hima bindu చెప్పారు...

ఓహ్ ! నన్ను అనుకున్నాను ..హమ్మయ్య థాంక్స్ -:):) చూద్దాం అండీ పెద్దోల్లు కూర్చున్నారుగా సీమలో ...వరుసపెడతారేమో

ఉమాశంకర్ చెప్పారు...

లాయర్లూ, డాక్టర్లూ, ప్రభుత్వోద్యోగులూ, కాలేజీ స్టూడెంట్లూ అందరూ వచ్చేసారు.. సివరాఖరికి స్కూలు పిల్లలు కూడా..మరి ఈ ముద్దుబిడ్డలకేమయిందో? ..ఎవరైనా మైకు పెట్టి "ఏక్షన్" అని గూబ గుయ్ మనేలా అరిస్తే తప్పితే రారేమో ..

caర్తీక్ చెప్పారు...

http://tammunililalu.blogspot.com/2009/12/blog-post.html