27, డిసెంబర్ 2009, ఆదివారం

అట్లపిండి

నా చిన్నతనం లో మాకు ఒక నాయనమ్మ వుండేది .ఆమె పేరు వెర్రి బామ్మ ,కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది .ఆవిడ చేస్తే ఇంతవరకు ఒక్కసారిగా ,పాతికట్లకంటే తక్కువ తిన్నాడు లేడుమాలో. ఆమెని అట్లబామ్మా అనే వాళ్ళం .ఎల్లా చేసేదో ఆ పిండి లో 'ఏం కలిపేదో ' ఎవరికి తెలియదు .ఒకసారి నేను మా చేల్లిలి గారి ఊరు వెళ్తున్న,మా చెల్లెలు గర్భిణి తో వుంది బామ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది ,బామ్మ ఏం చేసిందంటే ,పిండి కలిపి ,ఒక పెద్ద సత్తేప్పాల లో వేసిసిబ్బి బోర్లించి ,గుడ్డ వాసిన కట్టి ,నన్ను ముందు తీసికెళ్ళమంది .మరునాడు రైల్ కి తను వస్తానంది .....
తరువాత కథ మీకు మీరు చదివితేనే అద్భుతంగ వుంటుంది .ఈ కథ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది .నేనైతే బాగా ఎంజాయ్ చేసాను .చదివిన ప్రతిసారి నవ్వించక మానదు .పిండి గిన్నె పట్టుకుని రైలు ప్రయాణం దిగినాక పాట్లు ...సో నేను చెప్పేకంటే మీరు చదవడం బాగుంటుంది .
సరికాని ఎవరు రాసింది తల్లీ అంటారా?
ఇంకెవరు మన గుడిపాటి వెంకటచలం -:)
హ్మం !చలం అంటే ఒక్కసారే ఉలిక్కిపడ్డారా ?
నిజంగా చలం గారి రచనేనండీ ...అయన కథలనగానే స్త్రీ వాదం అనేస్కుంటారని నొక్కి వక్కాణిస్తున్న -:)
కథ పేరు "అట్లపిండి ".చలం గారి రచనలు చదివేవారు చదివే వుంటారు .ఈ కథ కావాలనుకుంటే సులువుగా దొరికే మార్గం చెబుతాను వినండి . సాకం నాగరాజ అద్వర్యంలో సంకలనం చేసిన "తెలుగు కథకి జేజే !" పుస్తకంలో పొందుపరచిన మొదటి కథే "అట్లపిండి "..ఈ పుస్తకం రెండువేల ఏడు లో ప్రచురించబడినది .వెల మూడు వందల రూపాయలు మాత్రమె .విశాలాంద్ర అన్ని బ్రాంచిల్లో దొరుకుతుంది .
నేను మాత్రం కొనలేదు -:) నా కొలీగు ( నా ఒకప్పటి మిత్రురాలు )నా పుట్టినరోజుకి బహుమతిగా పంపించారు .తోచక పుస్తక ప్రక్షాళన చేస్తుంటే కంటబడింది ,చదవవలసిన మంచి పుస్తకం అని మీతో పంచుకుంటున్న

20 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

నేను చదివానండీ ఈ కథ.. చాలా సరదాగా ఉంటుంది.. మీరన్నట్టుగా చలం అంటే స్త్రీవాద కథలు మాత్రమే అనుకునే వాళ్ళు తప్పక చదవాల్సిన కథ..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

సాగే కాలంలో వారు వీరవుతారని, మురళి గారి కామెంట్లు చూసీ చూసీ, చదివి చదివీ, మీరు వారయ్యారా? ;)

Padmarpita చెప్పారు...

వంటల గురించేమో అనుకున్నాను.
కధ గురించి అయితే పూర్తిగా రాసి ఉండవచ్చుకదండీ...ఈ సస్పెన్స్ ఎందుకో:)

Hima bindu చెప్పారు...

@మురళి
ఈ రోజు కనబడగానే మరల చదివాను , చలం నుండి మనం ఇటువంటివి ఊహించం కదూ ! ఆయనకీ పాపం ఒకటే ముద్ర .అన్నట్లు బుజ్జిగాడు నా ఫేవరేట్ పుస్తకం .
@భా.రా.రె
హ హ హ్హ ..నేను మురళి కామెంట్లు చదివి నేర్చుకున్ననా .ఆరు నెలలు సహవాసం అంటారా ? ఏమో మీలా కవితలు ,తనలా సమీక్షలు రాయలేను కాని కనిపించినవి చదివేస్తాను .నేను పుస్తకాల పురుగునండీ -:)

Hima bindu చెప్పారు...

@పద్మార్పిత
అయ్యో మనం వంటల గురించి రాయమండీ ,ఎందుకంటే మనం కొత్త వంటల జోలికి వెళ్ళాం -:)మనది అంతా పాత తరం వంటలే .
అమ్మో కథంతా రాస్తే ఇక్కడ ఊరుకోరు కదండీ .మురళి గార్ని అప్పుడెప్పుడో ఎవరో కోప్పడ్డారు కూడా -:)

పరిమళం చెప్పారు...

శీర్షిక , మొదలుపెట్టిన తీరు చూసి మీ జ్ఞాపకాలేవో చెప్తున్నారనుకున్నా :)

@ మురళి గారూ !మీరు చదవని కధ ఉంటుందా :)

మరువం ఉష చెప్పారు...

అసలీ పది రోజుల సెలవలూ పుస్తకాలు చదవటానికే కేటాయించాను. :) కానీ ఇలా నాకు వెంటనే దొరకనివన్నీ చెప్పటం + గుర్తు చేయటం ప్చ్ నాట్ ఫెయిర్.. :(

ఆ.సౌమ్య చెప్పారు...

ఇదే కథ చలం రాసిన "జెలసీ" పుస్తకంలో కూడ వుంది వెల 35 రూపాయిలు. అన్ని విసాలాంధ్ర కొట్లలోనూ దొరుకుతుంది.
ఈ జెలసీ పుస్తకం ఒక 10-12 కథల మిళితం...అన్ని అద్భుతాలే. "నా మొదటి క్రాఫ్" అనే కథ అయితే ఇంకా అదరహో...నిజం చెప్పలంటే ఇందులో ఉన్న అన్ని కథలూనూ...వేటికవే సాటి

ఆ.సౌమ్య చెప్పారు...

ఇదే కథ చలం రాసిన జెలసీ పుస్తకంలో కూడ వుంది వెల 35 రూపాయిలు. అన్ని విసాలాంధ్ర కొట్లలోనూ దొరుకుతుంది.
ఈ జెలసీ పుస్తకం ఒక 10-12 కథల మిళితం...అన్ని అద్భుతాలే. "నా మొదటి క్రాఫ్" అనే కథ అయితే ఇంకా అదరహో...నిజం చెప్పలంటే ఇందులో ఉన్న అన్ని కథలూనూ...వేటికవే సాటి

సిరిసిరిమువ్వ చెప్పారు...

నిజమే చలం గారి మీద పడ్డ ముద్రని చెరిపివేసే కథ ఇది. మీ టపాలో సత్తేపాల అని చూడగానే ఈ కథ గురించే అనుకున్నా. "తెలుగు కథకి జేజే"..పుస్తకంలోని కథల గురించి చెప్దామని మొదలుపెట్టి ఆరంభశూరత్వం అంటారే అలా ఓ నాలుగు కథల గురించి ఎప్పుడో నా బ్లాగులో చెప్పి ఆపై దానికి మూతపెట్టాను..మంచి కథని మరోసారి గుర్తుచేసారు.
http://vareesh.blogspot.com/2007/06/1.html

శివ చెరువు చెప్పారు...

మంచి కధ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.. చలం గారంటే స్ర్తీ వాదం అనుకుంటామని ముందుగా బానే ఇంట్రో ఇచ్చారు. నాకు పుస్తకం ఎవరైనా బహుమతి ఇస్తే బాగుణ్ణు ;)

Hima bindu చెప్పారు...

@పరిమళం
అవునా -:)
@ఉష
మీకు ఏమేమి పుస్తకాలు కావాలో చెప్పండి మేడం,నేను మీకు పంపిస్తాను .ఈ సారి సెలవల్లో చదువుదురుగాని .నిజం .
@సౌమ్య
అవునండి 'జలసి'లో వుంది .నా ఉద్దేశం చలంగారు ఇలా కూడా అని తెలియచేయడం మరియు తెలుగుకథ పుస్తక పరిచయం.ధన్యవాదాలండీ
@సిరిసిరిమువ్వ
చూసానండీ :) మిగిలిన కథలు కూడా పరిచయం చేయమని మనవి .
@శివ చెరువు
-:)అలాటి ముద్ర ఉందనే ....
ఏంటో నండీ నాకైతే తెగ బహుమతులుగా పుస్తకాలు ఇచ్చేస్తుంటారు ,బహుశ నా ముఖం చుస్తే కొనే బాపతుగా కనబడనేమో ,చూడండీ మొన్నటికి మొన్న కొత్తపాళీ గారి పుస్తక ఆవిష్కరణ సభకి వెళ్లి ఫ్రీగా 'రంగుటద్దాల కిటికీ 'తెచ్చుకున్నాన -:) ఇది చూసి మీ స్నేహితులు తప్పకుండ బహుమతిగా పుస్తకం ఇస్తారులెండి .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ నాకు బొక్కులొద్దు కానీ అట్లు కావాలి.:) పంపిస్తారా ? .mvb

Hima bindu చెప్పారు...

@భా.రా.రె
అట్లు కావాలా ? అట్లు మీ దగ్గరికి చేరాక వాటిని వదల్చడానికి పోయినోల్లందరూ దిగివస్తారు ...ఇక మీ ఇంట్లో వారని శాంతించడానికి పులిహోరే పులిహార ..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఎందుకని చిన్నీ, నాకు అంట్లు తోమడం కూడా కొద్దిగా వచ్చు. ఆ తరువాత డిష్ వాషర్ లో వేస్తే తళ తళ లాడే మెరుపు సొంతం.

kittu చెప్పారు...

I wanted to follow ur blog ...could you please tell me how to add ur blog reference to my blog...I am new to this thing...Thank you

తృష్ణ చెప్పారు...

మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@కిట్టు
నాకు తేలీదు..ఇది చూసి పెద్దోల్లు ఎవరైనా చెబుతారేమో చూడండీ .
@తృష్ణ
ధన్యవాదాలు ...మీకు కూడా శుభాకాంక్షలు

SRRao చెప్పారు...

చిన్ని గారూ !
చలం గారి 'అట్లపిండి' మంచి పరిచయం. అభినందనలు. అప్పుడప్పుడు ఇలా ప్రసిద్ధ రచయతల మంచి కథల్ని గుర్తుచేసుకోవడం చాలా అవసరం. నాకు కూడా చదవడమే బాగా అలవాటు. దానికి నిదర్శనం ఈ కథతో బాటు ఇంకా చాలా కథలున్నా సమీక్షించే అలవాటు లేక పరిచయం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యలేదు. ఆ మధ్య రావిశాస్త్రిగారి కథల్ని కొన్ని పరిచయం చేసే ప్రయత్నం చేసాననుకోండి. ఏమైనా ఇకపైన ప్రయత్నం చేస్తాను.
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

SRRao
sirakadambam

Hima bindu చెప్పారు...

@ఎస్ .ఆర్.రావు
మీకును నూతన సంవత్సర శుభాకాంక్షలు . రావి శాస్త్రి గారివి పరిచయం తప్పక చేయండి .