16, జూన్ 2010, బుధవారం

మనసు మాట వినదే..ప్చ్

ఈ పది సంవత్సరాలలో నేను పోగు చేసుకున్న ఆస్తి (డైరీలు ,జి.వో లు ,పేపర్ క్లిప్పింగ్స్ కార్డ్స్ ,డిపార్టుమెంటు పేపర్స్ ,నానాజాతి సమితి (కథలు ,కవితలు )మొత్తం సర్దితే పెద్ద అట్టపెట్టేడు అయ్యాయి ,అవసరం లేనివి చింపగా)బద్రంగా ఇంట్లోకి చేర్చాను రెండుగంటల క్రితం .నా సంస్థానం ,నా సింహాసనం వైపు చివరిచూపు చూస్తున్నపుడు మసకబారిన నా కళ్ళకి మొత్తం అలికేసినట్లు అక్కడేమో కనబడలేదు .ఇన్నాళ్ళు ఇరవయ్యినాలుగు గంటలు నన్నంటిపెట్టి వున్నా నా మొబైల్ నంబర్ వేరేవారికి ఇవ్వడానికి నా ప్రాణం విలవిల లాడింది .
.ప్రాణం లేని వాటిమీద నాకెందుకు ఈ మమకారం ఎందుకో అర్ధం కావడం లేదు
దేవుడా త్వరగా వీళ్ళందర్నీ ,ఇక్కడ వున్నా అనుబంధాలని మరచిపోయే వరమివ్వు .

9 కామెంట్‌లు:

ఉమాశంకర్ చెప్పారు...

పది సంవత్సరాలు! .. తక్కువ టైమేమీ కాదు.

కొన్ని నెలల క్రితం , కొలువు మారేముందు ,నేను ఇదే రకమైన బాధకు లోనయ్యాను.ఇప్పటికీ కొద్దిగా బాధగా ఉంటుంది అక్కడి పరిచయస్తులతో మాట్లాడినా, అప్పుడు తీసుకున్న ఫోటోలు చూసినా..

Wish you all the best.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అంత త్వరగా పోతుందా మమకారం.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

నేను వ్యాఖ్య వ్రాయొచ్చా అండీ :) లేకపోతే మళ్ళీ రింగ్ టోన్ వినిపిస్తారా?

మరువం ఉష చెప్పారు...

చిన్నీ, మిమ్మల్ని తేలికపరచాలనే పోయినసారి టపాలో అలా వ్రాసాను. నేను సిడ్నీ వదిలి వచ్చేసేముందు పది రోజులీ లోకం లోనే లేను..యాంత్రికంగా, నిస్సత్తువగా, ఎలా గడిపానో. నాకిచ్చిన ఫేర్ వెల్ కి సీనియర్ మానేజర్స్ అంతా వచ్చారు. అలాగే ఇండియన్ స్నేహితులూను. దాదాపు డెబ్బై పైన కుటుంబాలు పరిచయం. ఉదయాన్నే లాసేంజిలస్ కి ఫ్లైట్.. మొత్తం పదిహేను కుటుంబాల వారు సెండ్ ఆఫ్ కి వచ్చారు. పెళ్ళి అప్పగింతలకి కూడా అంత ఏడ్వలేదు నేను నిజంగానే.. కనుక తప్పవివి. తట్టుకోండి.. కాలానికి ఎక్కుప్పెట్టి వదలాల్సిన సమస్యలివి.

పరిమళం చెప్పారు...

ప్చ్ .....ఏడేళ్ళు ఉన్న అద్దె ఇంటిని వదిలి వచ్చేస్తున్నపుడు నాకూ ఇటువంటి బాధేకలిగింది !కొన్ని తప్పవు !జీవితం రైలుప్రయాణం ...ఈ పరిచయస్తులు ప్రయాణీకులు . అందరూ మనగమ్యం వరకూ రారుకదా ! కొత్తచోటు మీకు నచ్చేసి ,త్వర త్వరగా అందరూ పరిచయమైపోయి కొత్త విశేషాలతో కొత్త టపాలతో హిమబిందువులు మెరిసిపోవాలని కోరుకుంటున్నా......

Hima bindu చెప్పారు...

@ఉమా శంకర్
మూడు హోదాల్లో అదే కేంద్రంగా కలిగి చేసానండి .సాధారణంగా ప్రబుత్వ ఉద్యోగులకు రెండు మూడేళ్ళకు కదలిక తప్పదు.ఇప్పుడు తప్పలేదు .థాంక్సండీ .
@చిలమకూరి విజయమోహన్
నిజమే పోవడం లేదండీ .
@భా.రా.రె .ఇప్పుడు ఆ నంబర్ ఇమ్మంటే ఇస్తాను .(ఆ రింగ్ టోన్ వినాలి అనుకుంటే ).
@ఉష
నేను అస్సలు ఫీల్ కాలేదండి ...లేకపోతె ఒక్కొక్కరి అనుభవం బట్టి అంటారు అనుకున్నాను .ఇప్పుడు అర్ధం అయ్యింది :-).నా కోసం ఇప్పటికి కన్నీరు ...నిన్న కొత్త కొలువునుండి వస్తు పాత ఆఫీసు కి వెళ్లి చార్జ్ మొత్తం ఒప్పగించి నా వస్తువులు సర్దే నా సబ్ స్టాఫ్ లను ఎలా ఓదార్చాలో కూడా అర్ధం కాలేదు .వద్దు అనుకున్న కొన్ని బంధాలు అంతే అండీ .
@పరిమళం
అవునండి జీవితం రైలు ప్రయాణమే .తప్పకుండా అండీ ....నేను చదివిన సోషల్ వర్క్ సార్ధకత ఇప్పుడు చేపట్టిన ఉద్యోగంలో అయ్యేట్లు వుంది .అదొక్కటే నాకు కలిగే సంతోషం .

జయ చెప్పారు...

అయ్యో, చిన్నిలు, బుజ్జులు, కన్నలు, ఇలా దిగులు మీద దిగులు పడిపోతే ఎలా తల్లి? చెప్పిన మాట వినాలమ్మ. గుండె దిటువు చేసుకోవాలి మరి. ఇంతకీ బంగారంగాడేమి చేస్తున్నట్లు.

Hima bindu చెప్పారు...

@జయ
చాల రోజుల తరువాత కనిపించారు .ఏం చేద్దాం జయగారు వెదవమనసు ప్రతిదానికి యిట్టె ఫీల్ అయిపోతుంది .థాంక్యూ
బంగారంగాడు మహా అల్లరి అయిపోయి ఇల్లు పీకి పందిరి వేస్తున్నాడు ,కొంచెం విసుక్కుంటే చాలు కుర్చీ క్రిందో ,సోఫా క్రిందో దాక్కుని అలిగేస్తున్నాడు ..సారీ చెప్పి ఇంటిల్లపాది బ్రతిమాలితే గాని మాములుకాడు ,అస్తమాను వరండాలో ,లేక పైకో తీసుకెళ్ళాలి లేకపోతె పోట్లాటే ఓ.క పెద్ద టపా రాయాల్సిందే :-) .

భావన చెప్పారు...

అంతా జీవితం లో ఒక భాగమే కదా చిన్ని. కదులుతున్న కాలం లో కదలని నీడలే మన జ్నాపకాలు తోడు తీసుకుని నడవటమే మరి మనం చెయ్యగల పని. Good luck in your new endeavors.