26, జూన్ 2010, శనివారం
సొగసు చూడ తరమా !
రెండ్రోజుల క్రిందట ఒక మిత్రుని వివాహం జరిగితే వాళ్ళ ఊరు వెళ్లాను .నిజంగా మరో కేరళ చూసినట్లుంది. కేరళ వెళ్ళినపుడు 'అయ్యో మనవైపు ఇంత అందంగా లేవే' అని తెగ భాద పడిపోయాం.అప్పుడప్పుడు ఈ ప్రాంతం వెళ్ళడం జరిగింది కాని ,ఎప్పుడు ఆఫీసు హడావిడి ,పని ఆలోచనలతో పూర్తిగా ఎంజాయ్ చేయలేక పోయేదాన్ని .చుట్టూ పచ్చగా కొబ్బరి తదితర చెట్లతో ,సన్నటి వర్షపు తుంపర్ల తో ఆ సౌందర్యాన్ని వర్ణించడం సాహసమే సుమా అనిపించింది . దేవుడికి ఇంత బయాస్ ఎందుకో కొన్నిటిని మాత్రమె అధ్బుతంగా సృష్టించి మరి కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం ,వెళ్ళేప్పుడు మసక చీకటిలో 'గోదారి 'అందాలు వచ్చేప్పుడు కళ్ళార్పకుండా వయ్యరాలుపోతు వంపులు తిరిగి వెళ్తున్న కాలువలు ,పొలాలు వాటికి కాపలా గా క్రమశిక్షణ గల సైనికుల్ల కొబ్బరి చెట్లు .... అద్బుతమయిన కోనసీమ .అప్రయత్నంగా నా నోటినుండి ఈ పాటా ..."బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు ...................ప్రభు మాకేల నీయవూ ..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
26 కామెంట్లు:
bagundi,chala chakka ga simple ga rasaru ,bhavalu chala andam varnicharu ,medi chavinataruvatha naa godaari anubhavam rayalanipisthondi so velunte rasthanu gala gala godari gurinchi ...saavirahe
nijame nanDi, emainaa devuDi srushTi mumdu manishi srushTi entha...
అవునండి , ఆ దేవుడు ఎంత పక్షపాతో కదా అందాలన్నీ ఆ కోనసీమకే ఇచ్చాడు .
సృష్ఠిలోని మధురమైన భావాలు తెలియజేసేదే ప్రకృతిలోని అందం. అప్పుడప్పుడు ఈ ఆనందం లేకపోతే జీవితంలోని మధురిమ కూడా తెలియదు. ఈ మానసిక తృప్తే మనకి బలాన్ని పెంచుతుందని నా నమ్మకం. ఆ నూతన ప్రపంచ వీక్షణమే జీవితంమీద కోరిక పెంచుతుంది:)
హే హోయ్ ఆహాహా...మా గోదావరి మాదే, మా సీమలు మావే..వాటి అందాలు మావేలే మావేలే..అనుభూతులు మావేలే..మీవేలే మీవేలే ఆస్వాదనలు మీవేలే..చిన్ని, అన్నిటా చూడాలే గాని అందం+ఆనందం ఉంటుంది..ఆఖరుకి గడ్డిపువ్వు కూడా గడసరి నవ్వుల మనని కట్టిపడేస్తుంది. మనసు కి కళ్ళు, చెవులు కావాలి అంతే!
అవునండీ .....సొగసు చూడ తరమా ........
@సావిరహే
థాంక్సండీ ...రాయండి మీ గోదావరి అందాలు .
@హను
అవునండీ
@మాలా కుమార్
అందుకే అక్కడ పుట్టిన వాళ్ళని పట్టలేము (నేను అన్నాను అని ఉష తో అనమాకండీ )
@ జయ
ఎంత చికాకుగా వున్నా అందమైన ప్రకృతి కనిపిస్తే నన్ను నేను మరిచిపోతానండీ .మనస్సంతా ప్రశాంతంగా అవుతుంది.
@ఉషా
హు మిమ్మల్ని చూస్తుంటే మహా కుళ్ళు (జలసీ )గా వుంది .ఏమైనా ఒప్పుకోవాల్సిందే కోనసీమ వాళ్లకి (కళలు )అన్నీ ఎక్కువే అని .:-).మీరు పెంచే తోట మీ వంట అన్ని చూసామండి.
@పరిమళం
మన తరం కాదేమోనండీ :-)
చాలా అందంగా చెప్పారు :-)
చిన్నీ, పిచ్చితల్లీ నేను పుట్టింది కృష్ణమ్మ ఒడిలొ అదీ పల్నాడులో.. ;) బుగ్గవాగు గూట్లో.. చాలా కాస్త అసూయ తగ్గిందా.. ఎన్నైతేనేమి ఈనాడు ఈ కర్మభూమిలో కూర్చుని మిమ్మల్ని వెక్కిరిస్తూ..మీ భాగ్యరేఖకి జెలస్ ఫీలవుతూ..అయినా మీకు మాలాగారి మాట అడ్డు ఎంత పనికొస్తుందీ నేనంటూ మీద పడితే? :)
నేను ఒకసారి తాడేపల్లిగూడెం వెళ్ళానండీ, కేరళకి బాబులా అనిపించింది....ఆహా మనకీ ఉన్నయి ప్రకృతి అందాలు అని తెగ మురిసిపోయాననుకోండి.
@రామకృష్ణ రెడ్డి
:-) థాంక్యూ
@ఉష
హబ్బే నేనేం అనలేదండీ :-)
@సౌమ్య
నిజమేనండోయ్ నిన్ననే నిడదవోలు నుండి తాడేపల్లిగూడెం కాలువ ప్రక్కనుండి వస్తుఆశ్చర్యపోయానుకొంచెం కోనసీమల వుందని ..కేరళ లా మాత్రం కాదులెండి :-)
చిన్నీగారూ, ఇంతకీ ఏప్రెండు పెళ్ళి అండీ? :)
ఏంటీ చిన్ని తెగ పొగిడేస్తున్నారు కోన సీమను? ఏంటీ కథ. అసలే ఈ కోన సీమ వాళ్ళు ఆ పైన ఇలా మన పల్నాడూ వాళ్ళు కూడా మెచ్చుకుంటే ఇంక ఆప తరమా చెప్పండీ. హి హి హి
@బా.రా.రె
మన ఫ్రెండ్ పెళ్ళే అండీ ,భావన ని అడగండీ :-)
@భావన
హవ్వ హవ్వ నేను 'కోనసీమ 'వాళ్ళని పొగిడానా ! కోనసీమ బాగుంది అని మాత్రమె చెప్పాను ,అస్సలే వాళ్ళంటే నాకు భయం ,'చాప క్రింద నీరు ,తడి బట్టలతో గొంతు కోస్తారు 'అని బోల్డు బోల్డు సామెతలు విన్నాను .మనం అయితే అక్కడికక్కడే ఫటాఫట్ అని కత్తులతో పొడిచేస్తాం అయ్యే" ఒంగోలు మనోహర్" లా ..హిహి :-).
తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్య అధ్యక్షా.. మా ఒంగోలు ని ఇలా అప్రతిష్టపాలు చేసినందుకు వాకౌట్ చేస్తున్నా.
@బా .రా.రె
ఇప్పుడు వాకవుట్ సేత్తే ఏం బాగుంటది రెడ్డి గారు ,మీ ఒంగోలు పోరగాడు హత్య చేసి అయిదేళ్ళు దాటిపోలా ! సరే మీకు మద్దతుగా నేను వాకవుట్ సేత్తాను.:-):)
ఎక్కడన్నా సేత్తేమాని గానీ నా బ్లాగులో మాత్రం చెయ్యక.
మనోహర్ గాడిది ('గాడిద'ది) ఒంగోలా, నేను విజయవాడ అనుకున్నా !!.... అయితే భా.రా.రే గారు సభాముఖంగా అందరికీ అపాలజీలు చెప్పాల్సిందే :-)..అప్పటిదాకా మా నిరసనలు ఆగవు ;-)
@బా.రా .రె
క్రింద చూడు మీ సోదరుడు ఏమంటున్నారో ,ముందు ఆ సంగతి చూడండీ .
@రామకృష్ణారెడ్డి కోట్ల
అవునండీ ఒంగోలే .విజయవాడ జైల్లో చాల కాలం వున్నాడు , అడ్డ గాడిద లానే తయారయ్యాడు .మేము డిమాండ్ చేస్తున్నాం .
"చాప క్రింద నీరు ,తడి బట్టలతో గొంతు కోస్తారు" ఎంటండి ఇవి... మా గొదారొళ్ళని ఇంత ఇంత మాటలంటారా... అసలు ఈ భూ పెపంచకం లొ మా అంత అమాయకులు వుంటారా.. మేము ఈ వ్యాఖ్యలు అతి తీవ్రం గా ఖండిస్తున్నాం.. చిన్ని గారు , భావన గారు, భారారె, కిషన్ అందరూ మాకు అపాలజి చెప్పాల్సిందే.. లేక పొతే ఈ ధర్నా తీవ్రతరం చేస్తాం..
@మంచు .పల్లకి
లేదండీ ,నేను అనడం లేదు .,అలా అంతా అంటారని అంటున్నాను .గోదారి వాళ్ళు అమాయకులు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోం అలా అమాయకంగా బిల్డప్ ఇస్తారు :-).ఎనీ హౌ ''గోదారి వాళ్ళ ''మనోభావాలు గాయపరిచినట్లయితే క్షమాపణలు .
నేన్ జెప్ప..ధర్నా చేసుకుంటే చేసుకోండ్రి. ఇద్దో కిషనూ నీకెదురుగుండా రోజూ ఆ అరవోడే కూర్చొను గాక.
చిన్నీ మావూరొస్తావు కదా అప్పుడు చెప్తా నీపని. ఇప్పుడేదో స్థానబలమనుకుంటున్నావేమో :-)
ఇలా అయితే మేము గొ బ్లా స పెడతాం...
@భా.రా.రె
నువ్వు ఇట్టాటి వాడివి అనుకోలా,హెంత ప్రాంతీయాభిమానం వుంటే మాత్రం మనోహరుడ్ని సమర్దిస్తావా !మీ ఊరు వచ్చే పనిలేదుగా ,నాకేం భయం లేదు.
ఒకసారి జైల్లో ఉన్నవాళ్ళకి నాలుగు మంచి మాటలు చెప్తానికి నన్ను పిలిస్తే వెళ్లాను ,అక్కడ చూసాను 'మానవ మృగాన్ని'.అప్పటికి మనిషిలో పశ్చాతాపం కనబడలా !,పెద్ద హీరోలా పాకెట్ లో చేతులు పెట్టుకుని ఒకింత నిర్లక్ష్యంగా స్తంబానికి ఆనుకుని ఆ అరగంటసేపు అదే పోజు.చుట్టూ వున్నవారు అతన్నో హీరోలా చూస్తూ .....అస్సహ్యంవేసింది .
అయితే బా.రా.రె "ప్ర .బ్లా .స." పెడతారేమో :-):)
ఏమిటో! ఎంత నేర్చినా ఎంతవారలైనా కన్నజిల్లా/కన్ననదీమ ముద్దు బిడ్డలే.. మంచుపల్లకి గారికి మద్దతుగా నేను సైతం.. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి