1, జూన్ 2011, బుధవారం
మేఘమా స్వాగతం
నిన్నటి నుంచి నాలో నూతనోత్సాహం అంబరాన్ని చుంబిస్తుంది..కారణం ఏవిటా అని తరచి చూసుకుంటే హప్పుడు అర్ధం అయ్యింది .నిన్న లేచి లేవగానే చుట్టుముట్టిన నీలిమేఘాలు తాకగానే చిన్ని చిన్ని బిందువులై తనువెల్ల తడిపాయి ..కానుగ చెట్టు గొడుగు క్రింద కూర్చుని నీలగిరి తేనేరు వేడి వేడిగా సేవిస్తుంటే నాలో తెలీని ఉత్సాహం పురులు విప్పి నాట్యం చేసింది ....ఆ అందమైన అనుభవం ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తున్న వదలక వెన్నంటే వుంది నీలం పచ్చదనం నీటి బిందువులు పోటిపడి కనువిందు చేస్తున్నాయి .....ఇంత అధ్బుతమైన ఆనందాన్ని కలిగిస్తున్న "వర్ష ఋతువా"నీకుస్వాగతం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
:)) me too
మీతో పాటు నేను కూడా పలుకుతున్నానండి స్వాగతం!
@మురళి
మా వర్షం మీ వైపు వచ్చేసినట్లుంది :-)
@పద్మర్పిత
బహుకాల దర్శనం ! మీకును స్వాగతం :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి