22, ఆగస్టు 2012, బుధవారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి

అమ్మాయి పెళ్లి చేసి అప్పుడే ఆరు నెలలు పూర్తి కావొస్తుంది.సరదాగా నా బ్లాగులో నాటి  పెళ్లి వేడుకలు  షేర్ చేసుకోవాలనిపించి అలనాటి పెళ్లి సందడి పంచుకుంటున్నాను .
అసలు ఇంత త్వరగా వివాహం చేస్తాను అనుకోలేదు అప్పుడెప్పుడో మావారు హార్ట్ ప్రోబ్లం తో సిక్ కావడం తిరిగి కోలుకోవడం జరిగింది ఆరోగ్యంగా తిరుగుతున్నపుడే భాధ్యతలు  తీర్చుకోవాలని గట్టిగ నిర్ణయించుకుని  సంభంధం రావడం ఖాయం చేసుకోవడం జరిగింది లేకుంటే ఏదొక ఉద్యోగం లో స్థిరపడ్డాక చేయలనుకున్నాము.
మా అమ్మ,పిన్ని వాళ్ళంతా పూర్వంలా తొమ్మిది రోజులో లేక అయిదు రోజుల పెళ్లి చేద్దాము అని నిర్ణయించేశారు .ఇక చూడండీ మా ఇల్లంతా పెళ్ళికి పది రోజుల ముందునుండి సందడే సందడి .అయిదురోజుల పెళ్లి సందడికి ఏర్పాట్లు చేసాము.
తొమ్మిది పూట్ల పసుపు స్నానాలు అంటే పెళ్లి జరగబోయే రోజు ఉదయం తొమ్మిదో సారి పెళ్ళికూతుర్ని చేయడం అన్నమాట.
ఈ కార్యక్రమానికి ముందు వరుడి ఇంటికి పళ్ళు స్వీట్స్ కానుకలు  ఆహ్వాన పత్రిక తీసుకుని నేను మా శ్రీవారు మా మేనమామల తో కలిసి వెళ్లి ఆహ్వానించి వచ్చాము.
ఈ అయిదు రోజులు మా వారి తరుపు నా తరుపు  ఆత్మీయ బంధువు లంత కొలువులకు సెలవు పెట్టి మా సంతోషంలో భాధ్యతలను నెత్తిన పెట్టుకుని మాకు ఎటువంటి శ్రమ లేకుండా ఆద్యంతము పంచుకున్నారు .
వున్నా ఊర్లో చుట్టాలు దూరంగా వున్నా చుట్టాలు సహితం  ఇరవయి రెండు ఉదయానే వచ్చేసారు.మా పల్లె నుండి తాటి ఆకుల్ని పందిరి వేసే చుట్టాల్ని పిలిపించి పెద్ద పందిరి వేసి అందమైన ముగ్గులతో అలంకరించి   మా భంధువులు కాక ఇరుగు పొరుగుపెద్దలను ఆహ్వానించి గంధం పసుపు కుంకుమలతోమంగళ వాద్యాల తో పెళ్లి కూతుర్ని చేయడం జరిగింది.దాదాపు మూడు వందల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు ...మొదటిరోజు మా  కాబోయే అల్లుడు వారి భంధువులు కూడా ఈ వేడుకలో వున్నారు.
పసుపు కార్యక్రమం ఎలా చేశామంటే ..............
ముగ్గుల మద్య పసుపు పీటలు వేసి(ఒకటి తోడి పెళ్ళికూతురికి ) వధువుని కూర్చుండబెట్టి  .
పచ్చికొమ్ముల పసుపు పెసర సున్ని  కచ్చురాలు భావంచాలు మంచి గంధం సాన మీద తీసినది గిన్నెల నిండా  తీసుకుని పెద్ద ముత్తైదువలు అమ్మలు అమ్మమ్మలు తల పై నూనె అక్షతలు వుంచి వధువు కి నలుగు పెట్టి మేలమాడుతూ నలుగు పాటలు పాడారు..వారే ఇద్దరకి నలుగు స్నానాలు కుంకుడు శికాయలతో తలకిపోసి అక్కడ కూడా పాటలు పట్టు చీరతో వధువుని అలంకరించి మంగళ హారతులు పాడి వధువు చేత తాంబూలాలు ఇప్పించి   పెద్దలంత అక్షతలతో దేవెనలు ఇవ్వడం ఖరీదైన కానుకలు వస్త్రాలు వధువుకు ఇవ్వడం విందు భోజనాలుఏర్పాటు చేయడం జరిగింది . నాది  మావారిది పెద్ద పెద్ద కుటుంభాలు కావడం వలన తొమ్మిది పసుపు స్నానాలు పూట పూట కి పంచేసుకున్నారు .మేనత్తలంత ఒక పూట పిన్నులంతా ఒకపూట అలా పెళ్లి రోజు ఉదయం వరకు సాగింది .(తరువాత). 



  

,




7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Interesting pl continue

Hima bindu చెప్పారు...

థాంక్యూ ,తప్పక రాస్తానండీ జ్ఞాపకాలని అక్షర రూపంలో పదిలపరచుకోవాలనే ప్రయత్నం.

జయ చెప్పారు...

ఈ పెళ్ళి ముచ్చట్లు చాలా బాగుంటాయండి. తప్పకుండా అయిదు రోజుల పెళ్ళి వివరించండి. ఈ మధ్యనే మా చిన్నత్తగారి మనవరాలి పెళ్ళి అయిదు రోజులు చేసాము.పెళ్ళికూతుర్ని చేసినప్పుడు నా వంతు రోజైతే గోదాదేవి అలంకారం చేసాను. ఎంత ముద్దుగా ఉందో చెప్పలేను. ఫొటోలు కూడా చూపిస్తారా మరి. ఇంతకీ పెళ్ళిలో బుజ్జులు స్పెషాలిటీ ఏమన్నా ఉందా లేదా:) మీ అమ్మాయికి నా విషెస్ తప్పకుండా అందజేయండి.

Hima bindu చెప్పారు...

@జయ
బాగున్నారా?
చాల రోజులకి మీ వాయిస్ వినిపిస్తుంది .సో మీరు కూడా చేసి వచ్చారన్నమాట ! ఫొటోస్ గుర్తోచాయి పెట్టాను .గుర్తున్నదంతా వరుస క్రమం లో రాయాలనే ప్రయత్నం .బుజ్జులు పెళ్లి మండపం కి తప్పించి అంత హడావిడి చేసింది మరి అక్క పెళ్లి కదా :)

జలతారు వెన్నెల చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
జలతారు వెన్నెల చెప్పారు...

వారం క్రితమే పెళ్ళి కి వెళ్ళాను. మొత్తం ఏడు రోజుల హడావిడి.. రాయండి..అందులోను నేను వెళ్ళింది అబ్బాయి తరుపు, అమ్మాయి తరుపు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అన్నట్టు చిన్ని గారు, విజయవాడ నుంచి హైదరాబాద్ నాలుగు గంటలలో వెళ్ళిపోయాను మీరు చెప్పినట్టుగానే!

Hima bindu చెప్పారు...

@జలతారు వెన్నెల
మా విజయవాడ వచ్చారన్న మాట!మాకు చెబితే కొంచెం తేనీరు ఇచ్చయిన ఆతీధ్యం ఇచ్చేవాళ్ళం కదా ..
క్రమంలో రాయటానికి కొంచెం కష్టం అయిన గుర్తున్నంత వరకి రాయలనే ప్రయత్నం ,మీరు ఆ ఏడురోజుల విశేషాలు రాయండీ .