ఆత్మీయ అతిధులంతా తీరిక చేసుకుని ఎంతో దూరం నుండి అమ్మాయిని పెళ్లి కుమార్తె ను చేసే కార్యక్రమానికి వచ్చి దీవించి ఇంటి ముందు తాటాకు పందిరి క్రింద ఏర్పాటు చేసిన బోజనాలు చేసారు .మధ్యాహ్నం రెండు తరువాత అమ్మాయిని కూర్చుండబెట్టి ఎదురుగా పాలు పెరుగు పళ్ళెం లో నింపి పసుపు కొమ్ములు కట్టిన రెండు పెద్ద రోకళ్ల ను పళ్ళెం లో ముంచి అటుఇటుగా పాప బుజాలకి తాకించారు నాయి బ్రాహ్మడు. పెద్దలు తాతలు పెదన్నాన్నలు బాబాయిలు మేనమామలు మేనత్తలు పెద్దమ్మలు చుట్టాలు ఒక్కొక్కరుగా వచ్చి వడ్లు(బియ్యం ) దోసిట అమ్మాయికి అటునిటు పోసి వారి చిత్తం కొలది రూపాయిలు అమ్మాయి కి దిష్టి తీసి ప్రక్కనున్న పళ్ళెం లో వేసారు ఇదొక గంటపైన సాగింది (మేళ తాళ ల తో ) మరొక ప్రక్క ముత్తైదువలు తలంబ్రాల బియ్యం కలపటం ముగించేసర్కి అమ్మాయి పెద్దలందరికి మొక్కి ఇంటినుండి కళ్యాణ మండపంకి బయలుదేరడం చాల హడావిడిగా జరిగింది పాప వెళ్ళేప్పుడు వాళ్ళ నాన్న అమ్మమ్మ పిన్నులు అత్తలూ అంత మనసార దీవించి వీడ్కోలు పలికారు. మరొకవైపు మా ఆడపడుచులు మా వారి బావగార్లు మా తమ్ముళ్ళు మేనమామలు చాకలిని తీసుకుని పానకాల బిందెలతో వియ్యాల వారికి స్వాగతం పలకడానికి వెళ్ళారు వారి వెనుక నేను మా వారు పెళ్లి కుమారునికి
ఆహ్వానం పలకడానికి ఎదురు వెళ్ళాము .చాకలి గుమ్మడికాయతో దిష్టి తీసిన తరువాత మా అమ్మాయికి తమ్ముడు (చెల్లి కొడుకు ) బావగారిని ఆహ్వానిస్తూమెడ లో ఉత్తరీయం కప్పాడు మా ఆడపడుచులు ఆరతి ఇచ్చాక కాబోయే అల్లునికి ఆహ్వానపత్రిక శాస్త్రోక్తంగా కొంత నగదు పెట్టి విడిదికి ఆహ్వానించాము ఇలా........తరువాత పానకాలు అందించడం .....ఆ తరువాత ఇంటికి పోయి అన్నీసర్దుకుని కళ్యాణ మండపం దారి పట్టాము.
మా వారికి సర్జరీ కావడం వలన ఎవర్ని ఆయన స్వయంగా ఆహ్వానించలేదు ఫోన్ ద్వారానే పిలుపులు కార్డ్స్ పంపడం అయ్యింది అయిన ఎవ్వరు నొచ్చుకోకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు ముహూర్తం ఎనిమిది పదమూడు కి కావడం వలన బోజనాలు ఆహ్వానం నా అక్కచేల్లిల్లు ఆడపడుచులు కజిన్స్ ముఖ్యంగా కొంతమంది స్నేహితులు నా ఆఫీసు స్టాఫ్ చూసుకున్నారు
|
పెళ్లి మంత్రాలను అయిదుగురు పురోహితులు సామూహికంగా ఉచ్చారణ చేస్తుండగా వివాహం మొదలయ్యింది.అమ్మాయి తో అక్కడే గౌరీపూజ అటు ప్రక్క అబ్బాయి చేత వరపూజ జరిపించి కన్యాదాన కార్యక్రమానికి కూర్చున్నాము .వధూవరులు జీలకర్ర బెల్లం అయిన తరువాత సుమారు రెండు గంటలు పైన బంధు మిత్రులు అక్షతలు వేసే కార్యక్రమం జరిగింది మాతో పాటు మా వియ్యంకులు ఓపిగ్గా అన్ని గంటలు నిలబడి అతిధులకి నమస్కరించారు .ఎంతో దూరం నుండి వచ్చిన మిత్రులని అధికారులని బంధువులని పేరుపేరునా పలకరించి మా ఆతీధ్యం స్వీకరించి వెళ్ళమని కోరాము .మద్యలో ఒక పది నిముషాలు క్రిందికి వెళ్లి అతిదులని పలకరించి వచ్చాము .ఆ తరువాత మిగిలిన వివాహ తంతు చక్కని ఉచ్చారణతో అర్దాలను వివరిస్తూ జరిపించారు సన్నాయి బ్యాండు మేళాలు సమయానికి తగినట్లు వీనుల విందు చేసాయి .వధూవరులు అరుంధతి నక్షత్రం చుసేవరకి అక్కడే వుండి మిత్రులను భందువులను కలుసుకుని వచ్చిన వారికీ కృతజ్ఞతలు తెల్పి సెలవు తీసుకున్నాము .ప్రతి కార్యక్రమం చక్కగా పద్దతిగా చేసామని బంధుమిత్రులు అభినందనలు తెల్పారు.
|
3 కామెంట్‌లు:
మళ్ళీ ఐదురోజులపెళ్ళికి నాంది పలికినట్లుంది.
చాలా బాగుందండి. అమ్మాయి పెళ్ళి నాకు తెలియకుండానే ఆల్రెడీ చూసేసానన్నమాట:) ఇంత సస్పెన్స్ ఎందుకో మురళిగారికి! సో, ఇది చూసిన వారికి, చెప్పిన వారికి, విన్న మా వంటి వారికి అందరికీ ఆనందమే.
@కష్టేఫల
అవునండీ .నాకు ఏకైక కుమార్తె తన వివాహం అంగరంగ వైభవం గా చెయ్యాలని ఆత్మీయులందర్నీతగిన రీతి గా సత్కరించుకోవడానికి ఒక్కరోజు సమయం సరిపోదనే అదేవిధంగా ఈ ఇదురోజులు మరపురాని విధంగా వుండాలని వివాహం క్రతువునకి వేదపండితులచే జరిపించాము .ఓపిగ్గా చదువుతూ రాయమని ప్రోత్సహించిన మీకు ధన్యవాదాలు :)
@జయ
మన రాతల్ని(పెళ్లి) చూసి మెచ్చినందుకు బోల్డన్ని థాంక్సులు.నిజానికి అంత హడావిడి లో చేసిన తతంగం అంత గుర్తు చేసుకుని రాయడం కొంచెం కష్టమే అనుకోకుండా గుర్తొచ్చింది అక్కడ లింక్ ఇస్తే కళ్ళముందు యధాతధంగా సాక్షరిస్తుంది కదా అని :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి