23, జనవరి 2013, బుధవారం

పేరు చూసి మోసపోయన్రా బాబోయ్ !

   వెళ్ళక వెళ్ళక  చాలా కాలం తరువాత  సినిమాకి వెళ్లాను ఆ సినిమా టైటిల్  విన్నప్పుడే ఆ సినిమా మీద తెగ లవ్ పెంచేసుకున్నాను,పేరు చూసి ప్రేమించేస్తార అని సందేహం రావచ్చు పేరుకి తగ్గట్టు కథ వుంటుందా సినిమా ఉంటుందా అలాగే మనుష్యులు వుంటారా ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్య పొతే అది నా తప్పు కాదు అది నా మనస్సు తప్పు అల్లా ఊహించేసుకుంటాను :(
కనీసం సినిమాకి తగిన టైటిల్ పెట్టొచ్చుగా లేక ఆ టైటిల్ నచ్చేతే దానికి తగ్గ కథ అల్లవచ్చుకదా !కనీసం వెళ్ళేప్పుడు రివ్యు లు  చదవకపోవడం నా తప్పే ,అంతా అయ్యాక అవలోకన చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు మద్య రిలేషన్స్ ఎలా ఉంటాయో లేక పనిపాట లేక ఊరి మీద పడి  తిరిగిన ఆత్మాభిమానం కండబలం గుండె బలం వుంటే బ్రతికేయొచ్చు అనే సందేశం ,అందమైన అబ్బాయిలు కనబడితే అమ్మాయిలూవారి వెంటబడి  వాళ్ళ కోసం వెర్రెత్తి పోవడం అనక పెళ్ళి చేసుకోవడం ..హ్మ్మ్ ప్చ్
యెంత నిరాశ కలిగిందంటే చెప్పలేను ..      మరచిపోలేనంతగా ఒక శంకరాభరణం సాగర సంగమం సీతారామయ్యగారి మనవరాలు మున్నగు వాటి కోవలోకి వస్తుందని సినిమా పేరు చూసి బ్రమ పడ్డాను అసలు నాకు తెలియక అడుగుతున్నాను అసలు ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారు ? 

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Hahahaha.....All that glitters is not....G

Hima bindu చెప్పారు...

@కష్టేఫలే
అవుననుకొండీ :)

Zilebi చెప్పారు...



ఇంతకీ సినిమా పేరు ఏమిటి మహా ప్రభో! సస్పెన్సు తో చచ్చి పోతున్నా!


జిలేబి.

Hima bindu చెప్పారు...

@zilebi
అయ్యా జిలేబిగారు ! తవరు కొంచెం ఓపిక చేసుకుని మరొక్కసారి చదివితే సస్పెన్సు యిట్టె వీడిపోతుందీ ,రెండు క్లూస్ అందులోనే వున్నాయి :-)

Mauli చెప్పారు...

హ హ, మగవాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసిన సినిమాకి మీరెందుకు వెళ్ళారు :)

స్వర్ణమల్లిక చెప్పారు...

Clues enduku jilebee garu. Ne cheptaga "sita mother gatelo siri jasmin tree"
(telugulo muchatlu)

స్వర్ణమల్లిక చెప్పారు...

@chinni garu
sankarabharanam, sagara sangamam la oohinchukunnara... So funny ... Avi teesindi viswanath garu. Ippati directorski ayana pakka nunchune arhata kuda ledu.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హిమబిండువులు గారు.. మీరు ఇలా సమయాన్ని వేస్ట్ చేస్తారా!?

కనీసం మన బ్లాగులలో రివ్యూ లైనా చూడండి. :)

అజ్ఞాత చెప్పారు...

హమ్మయ్య నేను బ్రతికిపోయానురా దేవుడా

Hima bindu చెప్పారు...

@Mauli
వెళ్ళిన తరువాతే కదండీ తెలిసింది ఇది మగవారి కోసం తీసిందని :)
@స్వర్ణ మల్లిక
డైరెక్టర్ ని చూసి కాదండీ సినిమా పేరు చూసి వెళ్లాను కొత్త నీరు వస్తుందనే ఆశ కదా!
@వనజ వనమాలీ
అయ్యో రాత బ్లాగు రివ్యులు చదివినట్లైతే ఇంత నిరాశ వుండేది కాదు కదండీ :(
@లలిత
మీరు బ్రతికే వుండాలని కోరుతున్నాను అండీ :-)

చాతకం చెప్పారు...

ROFL. be happy that there are less formula elements such as Tata sumo chase, bloody fights, old age boy in college, 3 heroines for one hero, sister not dead.

Hima bindu చెప్పారు...

@చాతకం
థాంక్సండీ ..మనం అందుకే సినిమాల జోలికి వెళ్ళడం మానేశాము ఏదో అప్పుడప్పుడు ఇలా మోసపోతాము:)