10, మార్చి 2013, ఆదివారం

గుండెల్లో గోదారి

గుండెల్లో గోదారి టైటిల్ తగ్గట్టుగానే బానే వుంది కథ ఎక్కడో చదివినట్లుగా అనిపించింది  బి. రామారావు గోదారి కథల్లోని దా అన్నట్లు అనిపించింది,సినిమా చాలా వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారు ముఖ్యంగా ఉప్పెన సమయం లో గోదారి గ్రామాల్ని ముంచెత్తే దృశ్యాలు గుండెలు దడ దడ లాడక మానవు నాకైతే నేనే అక్కడి వరదల్లో చిక్కుకున్నానేమో అన్నంతగా అనిపించింది ,బహుశ అంతగా లీనం అయ్యాను అనుకుంటా :-) గ్రామీణ వాతావరణం పల్లెకార్ల కుటుంబాలు  వారి సాంస్కృతిక  జీవనం  కష్ట జీవులు  దళారి వ్యవస్థ కోరల్లో చిక్కి జీవించడం   ప్రభుత్వ వైద్యశాల పొలిసు స్టేషన్,అమాయకుల పై అక్రమంగా కేసులు బనాయించడం పెద్దవారు బడుగు జీవులపై చేసే పెత్తనం చక్కగా చిత్రీకరించారు గోదారి పరిసర ప్రాంతాల వారి వినోదాలైనతిరునాళ్ళు  కోడి పందాలు రికార్డ్ డాన్సులు పడవ పందాలు ఆద్యంతం వినోదం కలిగించాయి ,పాటలు  ఓ మోస్తరుగా వున్నాయి. వరదలో చిక్కుకుని నది నడి  బొడ్డులో గడ్డి వాము మీద సేద తీరుతు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు  తమ తమ గతం చెబుతూ మనకి సినిమా చూపిస్తారు ,ఎక్కడో ఒకటి రెండు  అభ్యంతరకర దృశ్యాలు తప్పించి సినిమాని బంధు మిత్ర సపరివారంగా చూడొచ్చు అనుకుంటాను :)  

6 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

thanks for giving review...sunday chudabotunnaanu.

మురళి చెప్పారు...

ఏదోలా చూసేయాలండీ... అసలే మా గోదారి సినిమా.. కొంచం జలస్ గా ఉంది మీ మీద :-)
బీవీఎస్ రామారావు గారి గోదావరి కథలు నుంచి కథ తీసుకున్నారు..
కానీ దివి సీమ ఉప్పెనకి గోదారి పొంగడం ఏమిటో మరి, సినిమా చూసి అర్ధం చేసుకోవాలి...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

థాంక్స్ ఫర్ ద రివ్యూ అండీ.. ఈ సినిమా బి.వి.ఎస్ రామారావు గోదారి కథల్లోని "గుండెల్లో గోదారి" కథేనండీ అఫిషియల్ గా రైట్స్ కొని చిత్రీకరించారు. ఈసినిమాపై కాస్త పాజిటివ్ రివ్యూ చదవడం సంతోషంగా ఉంది.

మంచు లక్ష్మి చాలా కష్టపడి నిర్మించింది ఈసినిమా ఆ గుడిసెలు వరదల్లో తీసిన సెట్స్ అన్నీ సాథారణంగా సినిమాకి వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కాకుండా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో నిర్మించారట.

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత
అయితే సినిమా చుసేసారన్నమాట!నాట్ బాడ్ కదండీ ?
@మురళి
మీరు ఫస్ట్ డే చూసేసి వుంటారు అనుకున్నాను .1986 ఆగస్ట్ 9వచ్చిన తుఫానులో పోలవరం ప్రక్క గ్రామాలు గోదారిలో పూర్తిగా మునిగిపోవడం తీసారు ,దివిసీమ ముంపు 1977 లో కదా!పట్టిసీమ తదితర పరిసరాలు చూపించారు ,బి.వి .ఎస్ రామారావు పుస్తకంమీలాంటి గోదారి అభిమాన మిత్రులు గిఫ్ట్ గా ఇస్తే చదివానండీ .ఆ కథ కూడా చాల బాగా రాసారు ,సినిమా కూడా బాగుంది
@.వేణు శ్రీకాంత్
సినిమాకి వెళ్దాము అనగానే మా అమ్మాయి చెల్లి వాళ్ళ అమ్మాయి రివ్యూ బాగాలేదు బోర్ గా ఉంటుందేమో అని డౌట్ ఎక్ష్ప్రెస్స్ చేసారు .కాని వాళ్ళు కూడా విసుగు లేకుండా లీనం అయ్యి చూసారు అయిదుకి మూడున్నర మార్కులు వేసేసారు :)
వరద దృశ్యాలు చాల బాగా తీసారు ,ఆ సమయం లో మనుషుల కోసమే కాకుండా మూగ జీవాల కోసం సహజంగా మనిషి పడే తపన చక్కగా చూపించారు .కొంచెం మంచు లక్ష్మి గొంతుకే గరగార లాడింది గులకరాళ్ళు డబ్బాలో పోసినట్లు :)అమ్మో అభిమానులు నా మీదికి యుద్దానికి వస్తారేమో :(ఈ మాట నాది కాదు నా మనస్సులోనిది .:)

జయ చెప్పారు...

చాలా చక్కటి రివ్యూ. మీరు ఏ విషయాన్ని వదలకుండా చెప్పారు. నాకు బాగా నచ్చిందండి.

నేను ఇవాళే ఈ సినిమా చూసొచ్చానండి. చాలామంది బాలేదన్నా నాకైతే బాగానే ఉంది. ఈ కథ ఒకప్పుడు చదివిందే. కాబట్టి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అందుకే చూడాలనే అనుకున్నాను. కడలి సినిమా లా సముద్రం పక్కన చూపిన అతి సహజత్వం ఇందులో కూడా నాకు కనిపించింది. మొదటి సగమంతా చేపలు...రెండో సగం కోళ్ళను భరించాల్సొచ్చింది. సెట్టింగులు, మేకప్, స్పెషల్ కాస్ట్యూంస్, పెద్ద పెట్టుబడి లేకుండా సహజత్వం లో తీసిన సినిమా ఇది.హీరో లిద్దరి పేర్లు నాకు తెలీదు.టైటిల్స్ లో ఆక్టర్స్ పేర్లు లేవు మరి:)వాళ్ళ మీద కూడా ఎక్కువఖర్చయి ఉండదు.ఆ హీరో నాకు నచ్చలేదు. తాప్సీ బాలేదు.

వరదలు, గడ్డివాము మీద గోదావరిలో వాళ్ళ ప్రయాసలు నాకు లైఫ్ ఆఫ్ పై సినిమాని గుర్తు చేసింది. కొన్ని సార్లైతే 3డి అద్దాలు పెట్టుకోటం మరిచిపోయానా అనిపించింది. ఈ చిత్రీకరణ అద్భుత:

కాపోతే తూర్పు, పశ్చిమ గోదారి అందాలు చూద్దామనుకున్న నాకు నిరాశే మిగిలింది.

1986 లో వచ్చిన వరదలు అని సినిమాలో క్లియర్ గా చెప్పారు, చూపించారు. కాబట్టి నో కంప్యూజన్...

ఓ చిన్న కొసమెరుపు: వరదల్లో ఓ బుజ్జి కుక్కపిల్లని రక్షిస్తారు చూడండి, అప్పుడు నాకు మీ బుజ్జులే గుర్తొచ్చింది. బుజ్జులు ఎలా ఉందండి. అడిగానని చెప్పండేం.

Hima bindu చెప్పారు...

@జయ
థాంక్సండీ :)
నాకు హీరోలు అంతగా నచ్చలేదు ,చూడగా చూడగా ఏదో ఆకర్షణ కనబడింది :)ఇక తాప్సి పాత్ర చూస్తె అమ్మో ఇలా కూడా అమ్మాయిలూ ఉంటారా అనిపించింది ! ." మొదటి సగమంతా చేపలు...రెండో సగం కోళ్ళను భరించాల్సొచ్చింది. సెట్టింగులు, మేకప్, స్పెషల్ కాస్ట్యూంస్, పెద్ద పెట్టుబడి లేకుండా సహజత్వం లో తీసిన సినిమా ఇది" నిజం అండీ .అందరికి ఎందుకు నచ్చలేదో !
బుజ్జి కుక్కపిల్ల ఆనందంగా ఇంటి పైకి ఎక్కడం ముద్దుగా అనిపించింది , మా అందరికి బుజ్జులే గుర్తొచ్చింది బుజ్జులు బాగుందండీ ,అల్లరి పెరిగిపోతుంది .