నేను బ్లాగు రాయడము 2009 ఫిబ్రవరి లో మొదలుపెట్టాను ,,,బ్లాగులు అస్సలు తెలియదు ఇలాంటివి వుంటాయని అప్పట్లో నాకు తెలియదు ... మిత్రుడు మురళి గారు (నెమలికన్ను )బ్లాగుకి నామకరణము చేసి నా మాటల్లో మొదటి పోస్ట్ రాశారు తెలుగులో ఎలా టైపు చెయ్యాలో కూడానా నేర్పారు . అది మొదలు ఎడాపెడా రోజుకి ఒక బ్లాగ్ రాసేదాన్ని ...కాదేది కవితకు అనర్హం అన్నట్లు బ్లాగటానికి అనిపించినా కనిపించిన వన్నీ నా బ్లాగులో ఒదిగిపోయాయి ...రాను రాను రాయడము తగ్గిపోయింది ..వర్క్ ప్రేస్సర్ ఒక కారణం అయితే కొత్తగా వచ్చిన బాధ్యతలు .... కాలం లో కలిసిపోయిన ఆప్తులు నన్ను బాగా కృంగదీసి ఒక రకంగా డిప్రెషన్ లోకి పోయి చాలా విషయాలకి దూరంగా వున్నాను ..బ్లాగాలని యెంత ప్రయత్నం చేసినా నిలకడగా అమలు చేయలేక పోయాను . ఎప్పుడైనా బ్లాగ్స్ చదవాలని తీసిన చాలా వెలితిగా ఉండేవి బ్లాగ్స్ .. ఒకప్పుడు యెంత ఉత్సాహంగా రాసిన వాళ్ళు కనబడటం మానేశారు .. బహుశ ఫెస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో బిజీ గా వుండి బ్లాగింగ్ తగ్గించేశారు అనుకుంటా ! ఆశ్చర్యంగా ఈ మధ్య తెలుగు బ్లాగ్స్ కళకళ లాడుతున్నాయి సంవత్సరకాలం ఆపేసిన వారు కూడా బ్లాగు వాకిళ్లు తెరిచారు ...పూర్వ వైభవము వచ్చినట్లే ... ఊహించని సెలవలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ... నా గార్డెనింగ్ కి బోల్డంత సమయము దొరికింది ... తీరికగా ఇన్నాళ్లు మిస్ అయినా బ్లాగ్ పోస్ట్‌లు చదుకోవాలి ...
29, మార్చి 2020, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్లు:
లాక్ డౌన్ వలన జరిగిన మంచి పనులలో ఇదొకటండీ.. బ్లాగులు మళ్ళీ కళకళలాడుతున్నాయి..
@VENU SRIKANTH TRUE andee
కామెంట్‌ను పోస్ట్ చేయండి