23, ఆగస్టు 2012, గురువారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి-2

పూల మాలలు అల్లుతూ 
గోరింతాకులు పెట్టించుకుంటూ పిన్ని ,మా మేనత్త అక్కలు చేల్లిల్లు మరదలు 
అమ్మలు అమ్మమ్మలు మా పిల్లలు  సంగీత్ ...సార్ వాస్తా ర్స్తార 
రెండో రోజు పూర్తిగా గోరింతాకులు పెట్టుకునే ముందు ఆడి పాడి 
                      ఇటురాయే  ఇటు రాయే నీ మీద మనసాయె  అంటూ పిల్లలు పెద్దలు                                      
 రెండో పూట ప్రక్క వీధిలో వున్నా మా అమ్మ వాళ్ళ ఇల్లు (మా అమ్మాయికి మేన మామల ఇల్లు )పెళ్లి కళ సంతరించుకుంది.అక్కడ కూడా ఇదే క్రమం లో పెళ్లి కూతుర్ని చేయడం విందు భోజనాలు ( పసుపువేసాక అమ్మాయి  ఊరి పొలిమేర దాటకుండా దగ్గరలో సంచరించ వచ్చట )మద్యాహ్నం మా ఇంట గోరింటాకు ఉత్సవం జరిపాము చుట్టాలు ఊర్లో వున్నా స్నేహితులు ఇరుగు పొరుగు వీధుల ఆడవారిని పేరంటం పిలిచాము .మధ్యాహ్నం మొదలయ్యి రాత్రి బోజనాల వేళకి పూర్తయ్యింది ,ఆ పూట పెళ్లి కూతుర్ని మా ఆడపడుచులు మరదళ్ళు చేసారు .....        

22, ఆగస్టు 2012, బుధవారం

అయిదు రోజుల పెళ్లి- అమ్మాయి పెళ్లి

అమ్మాయి పెళ్లి చేసి అప్పుడే ఆరు నెలలు పూర్తి కావొస్తుంది.సరదాగా నా బ్లాగులో నాటి  పెళ్లి వేడుకలు  షేర్ చేసుకోవాలనిపించి అలనాటి పెళ్లి సందడి పంచుకుంటున్నాను .
అసలు ఇంత త్వరగా వివాహం చేస్తాను అనుకోలేదు అప్పుడెప్పుడో మావారు హార్ట్ ప్రోబ్లం తో సిక్ కావడం తిరిగి కోలుకోవడం జరిగింది ఆరోగ్యంగా తిరుగుతున్నపుడే భాధ్యతలు  తీర్చుకోవాలని గట్టిగ నిర్ణయించుకుని  సంభంధం రావడం ఖాయం చేసుకోవడం జరిగింది లేకుంటే ఏదొక ఉద్యోగం లో స్థిరపడ్డాక చేయలనుకున్నాము.
మా అమ్మ,పిన్ని వాళ్ళంతా పూర్వంలా తొమ్మిది రోజులో లేక అయిదు రోజుల పెళ్లి చేద్దాము అని నిర్ణయించేశారు .ఇక చూడండీ మా ఇల్లంతా పెళ్ళికి పది రోజుల ముందునుండి సందడే సందడి .అయిదురోజుల పెళ్లి సందడికి ఏర్పాట్లు చేసాము.
తొమ్మిది పూట్ల పసుపు స్నానాలు అంటే పెళ్లి జరగబోయే రోజు ఉదయం తొమ్మిదో సారి పెళ్ళికూతుర్ని చేయడం అన్నమాట.
ఈ కార్యక్రమానికి ముందు వరుడి ఇంటికి పళ్ళు స్వీట్స్ కానుకలు  ఆహ్వాన పత్రిక తీసుకుని నేను మా శ్రీవారు మా మేనమామల తో కలిసి వెళ్లి ఆహ్వానించి వచ్చాము.
ఈ అయిదు రోజులు మా వారి తరుపు నా తరుపు  ఆత్మీయ బంధువు లంత కొలువులకు సెలవు పెట్టి మా సంతోషంలో భాధ్యతలను నెత్తిన పెట్టుకుని మాకు ఎటువంటి శ్రమ లేకుండా ఆద్యంతము పంచుకున్నారు .
వున్నా ఊర్లో చుట్టాలు దూరంగా వున్నా చుట్టాలు సహితం  ఇరవయి రెండు ఉదయానే వచ్చేసారు.మా పల్లె నుండి తాటి ఆకుల్ని పందిరి వేసే చుట్టాల్ని పిలిపించి పెద్ద పందిరి వేసి అందమైన ముగ్గులతో అలంకరించి   మా భంధువులు కాక ఇరుగు పొరుగుపెద్దలను ఆహ్వానించి గంధం పసుపు కుంకుమలతోమంగళ వాద్యాల తో పెళ్లి కూతుర్ని చేయడం జరిగింది.దాదాపు మూడు వందల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు ...మొదటిరోజు మా  కాబోయే అల్లుడు వారి భంధువులు కూడా ఈ వేడుకలో వున్నారు.
పసుపు కార్యక్రమం ఎలా చేశామంటే ..............
ముగ్గుల మద్య పసుపు పీటలు వేసి(ఒకటి తోడి పెళ్ళికూతురికి ) వధువుని కూర్చుండబెట్టి  .
పచ్చికొమ్ముల పసుపు పెసర సున్ని  కచ్చురాలు భావంచాలు మంచి గంధం సాన మీద తీసినది గిన్నెల నిండా  తీసుకుని పెద్ద ముత్తైదువలు అమ్మలు అమ్మమ్మలు తల పై నూనె అక్షతలు వుంచి వధువు కి నలుగు పెట్టి మేలమాడుతూ నలుగు పాటలు పాడారు..వారే ఇద్దరకి నలుగు స్నానాలు కుంకుడు శికాయలతో తలకిపోసి అక్కడ కూడా పాటలు పట్టు చీరతో వధువుని అలంకరించి మంగళ హారతులు పాడి వధువు చేత తాంబూలాలు ఇప్పించి   పెద్దలంత అక్షతలతో దేవెనలు ఇవ్వడం ఖరీదైన కానుకలు వస్త్రాలు వధువుకు ఇవ్వడం విందు భోజనాలుఏర్పాటు చేయడం జరిగింది . నాది  మావారిది పెద్ద పెద్ద కుటుంభాలు కావడం వలన తొమ్మిది పసుపు స్నానాలు పూట పూట కి పంచేసుకున్నారు .మేనత్తలంత ఒక పూట పిన్నులంతా ఒకపూట అలా పెళ్లి రోజు ఉదయం వరకు సాగింది .(తరువాత). 



  

,




13, జులై 2012, శుక్రవారం

సందడి

చినుకుల అలజడికి మెలకువ వచ్చి బయటికి వచ్చి చుస్తే అద్భుతమైన దృశ్యం ..మా ఇంటి ఆవరణలో మొక్కలన్నీసందడి చేస్తూ జలకాలడుతున్నాయి   

10, జులై 2012, మంగళవారం

జీవితం

భాల్యం లో జీవితం ప్రతి క్షణం మధురం... 
కళ్ళనిండా కలలు గుండె నిండా ఆశలు... 
బ్రతుకంత అలాగే వుండి పోకుడదా!
సుఖ దుఃఖల గారడీ ఎందుకవుతుందీ....
ఎండలో వాన కురిసినట్లు !
ఇంద్రధనస్సు వచ్చినా ......అది క్షణికమేకదా!  

1, జులై 2012, ఆదివారం

దూరం తగ్గినట్లే

నిన్న ఉదయం మూడున్నర గంటల్లో  విజయవాడ నుండి హైదరాబాద్  వెళ్ళగలిగాను సరిగ్గా నాలుగుగంటలు పని చూసుకుని  తిరిగి రాత్రి ఏడున్నరకి విజయవాడ లో వున్నాను.ఇంట్లోవాళ్ళు హాచ్చార్యపోయారు అసలు నేను మీటింగ్ కి వెళ్ళకుండానే తిరిగి వచ్చేసానేమోనని :)
మనం గన్నవరం వెళ్లి విమానం ఎక్కి వెళ్ళలేదు అలాగని ఏ సూపెర్ ఫాస్ట్  ట్రైను ఎక్కి వెళ్ళలేదు సాదాసీదాగా మనం ఎప్పుడు వెళ్లినట్టు నేషనల్ హై వే లోనే వెళ్లాను .ఈ హై వే కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం హై వే ఎప్పుడొస్తుందో ?,.హై వే వస్తుంది (విజయవాడ -హైదరాబాద్ )దాదాపు ఎనభయ్యి శాతం పూర్తయ్యినట్లు కనిపించింది ఎక్కడ ట్రాఫిక్ జామ్  లేదు లేట్ అంటూ జరిగితే సిటీలోనే మిగిలిన భాగం పూర్తయితే ప్రయాణం ఎంతో సులభం ముఖ్యంగా విజయవాడ హైదరాబాదు మద్య దూరం తగ్గినట్టే (సమయం)వెధవ ప్రమాదాలు చాలావరకు నియంత్రించినట్లే .

10, జూన్ 2012, ఆదివారం

ఇన్నాళ్ళకి వచ్చావా

ఇన్ని అందాలను ఆనందాలను ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మ !ఇప్పుడిప్పుడే మా ఊరు రావనుకున్నాము చెప్పాపెట్టకుండా మొన్న రాత్రి నీవు చూపిన దయతో మా ఊరంతా మురిసిపోయి తడిసి ముద్దయి పోయింది తెల్లారేసర్కి నీ జాడలు మాత్రం వదిలి వెళ్లి పోయావే !అప్పటినుంచి ఒళ్లంతా కళ్ళు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తున్నాను ఏమాత్రం అలికిడి అయిన  నువ్వోచ్చేసావు అనుకుంటు కిటికీ పరదాలు తీసి మన ఇంట వాకిట
ఆడుకుంటున్న  చిట్టి రెమ్మలని కొమ్మల్ని అడుగుతున్నాను . .
నీకు తెలుసా నీ కోసం మన ఇంట్లో ఎంతమంది ఎదురు చూస్తున్నారో !అదిగదిగో మనస్సున్న మరుమల్లి యెలా
వాడి పోయిందో నీవులేక ,వన్నెచిన్నెల విరజాజి పందిరిని చూసావా తన నేస్తం చంపకం చెప్పే కబుర్లు మీద దృష్టి నిలపక మొర ఎత్తి కరిమబ్బుల  లో నీ జాడలు వెదుకుతుంది చిట్టి చేమంతులు ముద్దు గులాబీలు మరువపు పొదలు
సైతం ఆత్రుతగా నీ చిరు సవ్వడి కోసం ఆలకిస్తున్నాయి .........
హమ్మయ్య ఇన్నాళ్ళకి మా పయి దయ కలిగిందా !చిరుగాలి తో మా ఊరు చూసి రమ్మని కబురు  పంపావా !నీకు స్వాగతం  పలకటానికి విరులన్నీ కొలువు తీరి ఉన్నాయమ్మావడిగా వచ్చి ఆనందపు జల్లుల్లో మమ్మల్ని ముంచెయ్యి !  

6, జూన్ 2012, బుధవారం

నాకెవ్వరు పోటీ

మామ్ ఒక్కసారి ప్లీజ్ పది నిమిషాల్లో ఇచ్చేస్తానుగా!
హ్మం !ఇప్పటి వరకు నీ దగ్గరే కదా ఎంత సేపు పేస్ బుక్ కాసేపు దానికి రెస్ట్ ఇవ్వు "నేను .
అబ్బ !నీవా బ్లాగ్స్ చూడటం మొదలెడితే ఇప్పట్లో ఇవ్వవు జల్లెడ అంటావు కాసేపు హారం కూడలి 
ఇవన్ని నీవు తిరిగి వచ్చేసర్కి నాకు నిద్ర ముంచుకు వస్తది ప్లీజ్ అమ్మా యిచ్చేస్తా "చిన్ని.
అయిన అంతసేపు లాప్టాప్లో వుంటే కళ్ళు స్ట్రెయిన్ అవ్వుతాయి "నేను. 
అబ్బా ఏమి కాదులే నీకు ఇష్టం అయిన పాట పెడతాను వింటూ వుండు ఈ లోపు ఇచ్చేస్తాను 
మొదలయ్యిందా గోల చిన్న పిల్లతో నీ పోటీ ఏంటి తోచకపోతే ఏదొకటి చదువుకోరాదు "శ్రీవారు .
మేము ఏదొకటి పడతాము నీకెందుకు "కసురుకుంటూ నేను ..
...మమ్మీ ఈ ఫోటో  చూడు ఈ పిచ్చుకలు ఎంత 
ముద్దుగా వున్నాయో "చిన్ని
అబ్బ ఎంత బాగున్నాయో ఎవరు పెట్టారు ఈ ఫొటోస్ "సంబరంగా నేను 
ఇప్పుడు ...................................................
నాకెవ్వరు జోడీ హ్మం !
ఇల్లంతా వెలితి !దుఖం గుండెల్లో నింపుకుని కన్నీరు దాచుకుంటున్న నాన్న 
అర్ధరాత్రిలో మెలకువ వచ్చి పక్కన తడిమితే నీవు లేవన్న పచ్చి నిజం గుండె 
పగిలిపోతుంది  గది గదిలో నీవున్నవనే ఆశ తో నీకోసం వెదుకుతున్న బుజ్జుల్ని 
చూస్తుంటే నా కళ్ళు నా మాట వినడం లేదు తల్లీ ....మా మూడు ప్రాణాలు నీకోసం తల్లడిల్లుతున్నాయి చిన్నీ !
ఇప్పుడు ఎవరు కన్నా నాతో పోటీ ?