23, జనవరి 2013, బుధవారం

పేరు చూసి మోసపోయన్రా బాబోయ్ !

   వెళ్ళక వెళ్ళక  చాలా కాలం తరువాత  సినిమాకి వెళ్లాను ఆ సినిమా టైటిల్  విన్నప్పుడే ఆ సినిమా మీద తెగ లవ్ పెంచేసుకున్నాను,పేరు చూసి ప్రేమించేస్తార అని సందేహం రావచ్చు పేరుకి తగ్గట్టు కథ వుంటుందా సినిమా ఉంటుందా అలాగే మనుష్యులు వుంటారా ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్య పొతే అది నా తప్పు కాదు అది నా మనస్సు తప్పు అల్లా ఊహించేసుకుంటాను :(
కనీసం సినిమాకి తగిన టైటిల్ పెట్టొచ్చుగా లేక ఆ టైటిల్ నచ్చేతే దానికి తగ్గ కథ అల్లవచ్చుకదా !కనీసం వెళ్ళేప్పుడు రివ్యు లు  చదవకపోవడం నా తప్పే ,అంతా అయ్యాక అవలోకన చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు మద్య రిలేషన్స్ ఎలా ఉంటాయో లేక పనిపాట లేక ఊరి మీద పడి  తిరిగిన ఆత్మాభిమానం కండబలం గుండె బలం వుంటే బ్రతికేయొచ్చు అనే సందేశం ,అందమైన అబ్బాయిలు కనబడితే అమ్మాయిలూవారి వెంటబడి  వాళ్ళ కోసం వెర్రెత్తి పోవడం అనక పెళ్ళి చేసుకోవడం ..హ్మ్మ్ ప్చ్
యెంత నిరాశ కలిగిందంటే చెప్పలేను ..      మరచిపోలేనంతగా ఒక శంకరాభరణం సాగర సంగమం సీతారామయ్యగారి మనవరాలు మున్నగు వాటి కోవలోకి వస్తుందని సినిమా పేరు చూసి బ్రమ పడ్డాను అసలు నాకు తెలియక అడుగుతున్నాను అసలు ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారు ? 

5, జనవరి 2013, శనివారం

తిరిగి వచ్చిన బాల్యం

బాల్యం  అన్నా వాటి తాలూక జ్ఞాపకలన్నా నాకు "ప్రాణం ".కాల చక్రం వెనక్కి తిరిగిపోయి తిరిగి మా అమ్మ నాన్న లతో అక్క చెల్లెళ్లు తమ్ముళ్ళ తో జీవితం మరల మొదలైతే ఎంత బాగుండును అనిపిస్తుంది ,పెద్దవాళ్ళం అవ్వకుండా అక్కడితోనే యెప్పటికి ఆగిపోతే ఎంత బాగుంటుందో అని ఎన్నో సార్లు మేమంతా అనుకుంటూవుంటాము ,ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ అని తెలుస్తుంది నాటి పాత మధురాలు ప్రతి ఒక్కరి హృదయంలో అపురూపంగా దాచబడి వుంటాయి  వాటిని వెలికి తీసే కొద్ది అపురూపమైన జ్ఞాపకాలు పొరలు పొరలుగా వస్తుంటాయి.జీవితం లో అత్యంత ఆనందముగా గడిపిన రోజులు తరచి చూసుకుంటే అమ్మమ్మ ,నానమ్మ ఊర్లలో  హద్దులు లేని అల్లరితో నేను గడిపిన జీవితం అపురూపం
.ఇంట్లో ఆరుగురు పిల్లల్లలో నేను  చాల అల్లరి చేసేదాన్ని .ఆటల్లో అలగడం తోండీ ఆటలు ఆడటం లో కూడా దిట్టనే నా వెనుక ఎప్పుడు పిల్ల గ్యాంగ్ ఉండవలసిందే ,నేనేమి నా కూడా రమ్మని చెప్పేదాన్ని కాదు అయిన నా వెనుక అనుసరించేవారు ఊరులోని చుట్టాలందరికి నేను పరిచయమే అంటే ప్రతి ఇల్లు సర్వే చేసి వచ్చేదాన్ని అన్నమాట .పిల్లలం పెద్ద క్లాసులకి వచ్చేసరికి రెండు ఊర్లు  తరచూ వెళ్ళడం అమ్మ తగ్గించేసింది,తరువాత  కాల చక్రంలో అమ్మమ్మ , నాయనమ్మ గతించేసరికి పూర్తిగా తగ్గించి అడపదడప ముఖ్యమైన పెళ్ళిళ్ళు కార్యక్రమాలకి వెళ్ళడానికి పరిమితం అయ్యాము
 .ఈ మధ్య అమ్మవాళ్ళ నాన్నగారికి(తాతయ్య ) వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుట్టిన రోజు పండుగ ఆయన సంతానం అంత అమ్మమ్మ ఊర్లో వేడుకగా జరిపాము ఆ రోజు ఆదివారం కావడం అంత  ఆటవిడుపుగా తిరిగి మా "బాల్యం  "లోకి మేము వెళ్ళిపోయాము మా పిల్లలకన్నా అనిమిక్కిలిగా అల్లరి చేసాము మధ్యాహ్నం భోజనం తరువాత ఇంటి వెనుకనే వున్నా మా పంట పొలాల్లోకి మా సైన్యాన్ని తీసుకుని వెళ్ళాము ,చిన్నప్పుడు మేము తిరిగిన పంట బోదెలు చెరువులు తిప్పి మా కథలన్నీ పిల్లలికి వర్ణించి వర్ణించి చెప్పాము , కోల్పోయిన బాల్యం  పోల్చి ఊరించి మరీ చెప్పాము గడ్డి వామీ లో మేము ఆడిన దాగుడుమూత ఆటలు చెప్పి అక్కడ పొలం లో వున్నా గడ్డి వామిలో ఉత్సాహంగా ఎక్కేసాము పిల్ల పెద్ద పాతిక  ముప్పయ్యి మందిమి  ఎక్కి తొక్కి కథలు కబుర్లు చెప్పుకుంటూ వుండగా దారిన పొయ్యేవారు మా వంక విచిత్రంగా చూసి వెళ్ళడం ఊర్లో  అందరికి ఉప్పు  అందిచ్చారు అనుకుంటాను మా పెద్ద మామయ్యా (అమ్మ తమ్ముడు )పొలం గట్టు మీదనుండే గట్టిగ ఒక కేక వేసాడు "రేయ్  దిగండ్రా ,లక్ష రూపాయల పంట తోక్కేసార్రా "అంటూ మామయ్యా అంటే అందరకి కొంచెం భయం లక్ష రూపాయలూ  అనేసర్కి తెల్లబోయాము ,విషయం ఏవిట అని చూస్తె మేము ఎక్కి తోక్కినది నూర్చడానికి పేర్చిన వరికుప్ప అట చిన్న చినుకు పడిన ధాన్యం మొత్తం నాశనం అంట ,మాకేం తెలుసు చిన్నప్పుడు ఆడుకున్న వరిగడ్డి వాము అనుకున్నాము అని ఎదురు ధభాయించాము ,ఆనక నలుగురైదుగురు కలిసి గడ్డి తెచ్చుకుని సరిచేసుకున్నారు యధాప్రకారం ఇంటికి వెళ్ళాక పిన్నమ్మలు భంధువులు పరిహాసాలునా తుంటరి పని చిన్నప్పటి తుంటరి పనులు మానలేదా అని తామరాకులో ఆమ్లెట్.ఇన్ని రోజుల్లో సంవత్సరాల్లో అన్ని మరచి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపినది డిసెంబర్ ముప్పయ్యవ తారీఖునే .....జీవితం          .    

24, నవంబర్ 2012, శనివారం

అభిమాన బ్లాగర్

అభిమాన రచయితలూ అభిమాన కథానాయకుల లానే మనకి నచ్చే బ్లాగర్ కూడా సహజంగానే వుంటారు వాళ్ళు ఏది రాసిన సమయం వున్నా లేకపోయినా వెసులుబాటు చేసుకుని చదవవలసిందే,.బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొత్తలో దాదాపు అన్ని బ్లాగులు చదివేదాన్నికొంతమంది రచనలు మరపురాని విధంగా హార్ట్ టచింగ్ గా వుంటాయి అటువంటి కొందరు బ్లాగర్స్ ని  క్రమం తప్పక అనుసరించేదాన్ని వారిలో ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా అయ్యారు ...అసలింతకి చెప్పొచ్చేది ఏమంటే మూడు సంవత్సరాల పరిచయం తరువాతభూగోళం కి ఆవల ఉంటున్న నేను అభిమానించే బ్లాగు మిత్రుడిని కలిసాను తనకున్న టైట్ షెడ్యుల్లోవెసులుబాటు చేసుకుని మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి కొంత సమయం మాతో స్పెండ్ చేసి వెళ్ళారు మాకుబోల్డన్ని గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళారు థాంక్స్ టూ బ్లాగు లోకం బంగారులోకం :-)..ఇంతకి నా అభిమాన బ్లాగర్ ఎవరంటారా !అది సస్పెన్స్:-)    

2, నవంబర్ 2012, శుక్రవారం

బ్లాగ్ vs ఫేస్ బుక్

బ్లాగు ల అబ్సేస్స్షన్ దాదాపు పోయినట్లే !ఒకప్పుడు బ్లాగుల్లో పడి బోల్డంత సమయం వృధా చేస్తున్ననని తెగ ఫీల్ అయ్యిన  నేను మొత్తానికి బయటికి రాగలిగాను కుదిరినప్పుడు ఏదైనా తప్పనిసరిగా జ్ఞాపకంగా రాసుకోవాల్సి వచ్చినపుడు మాత్రమే బ్లాగు రాయటం జరుగుతుంది ఆసక్తిగా వున్నాబ్లాగ్స్ చదువుతున్న కాని ఇదివరకటంత ఉధృతి మాత్రం తగ్గిందిఅలా అని చెప్పి నెట్ కి ఏమైనా దూరం వున్నన అనుకుంటే వుహు అదేమీ లేదు ఈ వెలితి కాస్త ముఖ పుస్తకం పై పడింది .వీలైనపుడు కాస్త రిలాక్స్ అవ్వలనిపిస్తే పేస్ బుక్ ఓపెన్ చేస్తున్నాను దీనికి మాత్రం అడిక్ట్ కాలేదు మనస్సు మీద నియంత్రణ బానే వుంది ,నా సమయం మాత్రం వృధా కాలేదు.బ్లాగు లవలన మంచి స్నేహితులు కలిసారు ముఖ్యంగా సాహిత్యం పట్ల అభిమానం అవగాహన వున్నా వారు బ్లాగు లోకంలో తారసపడతారు మంచి రచయిత రచయిత్రుల కధనాలను చదవవచ్చుమనం నచ్చినట్లు రాసుకోవచ్చు:) అలానే తోటి బ్లాగర్లని అవకాశం వచ్చినపుడు కించ పరిచే వారు అధికంగానే వుంటారు ఆ చిన్న ప్రపంచం లో వారికీ వారే గొప్పగా ఫీల్ అవ్వుతుంటారు అజ్నతంగానో పరోక్షంగానో ప్రక్క వారిని భాధించాలని చూస్తారు ఇవన్ని చూసి చూడనట్లు పొతే తప్పించి పట్టించు కుంటే అక్కడ మనుగడ ఉండదు .కాని పేస్ బుక్ లో ఇటువంటి సందర్భాలు ఎదురవ్వవు బహుశ ఇక్కడ ఎవరెవరో తెలుసుకుని ఆడ్ చేసుకోవడమో కొంత సభ్యత కలిగే వుంటారు .ఈ రెండిటిలో ఏది బెటర్ అని ఆలోచిస్తే పేస్ బుక్ కే నా వోట్ అనుకుంటాను ..నాకు ఇప్పటికి  అర్ధం కానిది బ్లాగులు అలా పిచ్చిగా ఎందుకు చదివానా అదొక బంగారు లోకం అని ఎందుకు ఫీల్ అయ్యానో !    
       

14, అక్టోబర్ 2012, ఆదివారం

బుజ్జులు తప్పిపోయింది .

బుజ్జులు తప్పిపోయింది .ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టదు కానీ ఎలా వెళ్లిందో మిస్టరీగా వుంది .బుజ్జులుకి పాలు పోసి కాసిని పెడిగ్రిలు వాటిలో పోసి "బుజ్జులమ్మ  బువ్వ తిందువు గాని రామ్మా "అంటూ ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు మంచాల క్రింద  వంగి చూసి పిలిచినా జాడ కనబడలేదు ఇక శోకాలు పెట్టుకుంటూ గది గది లోను బాత్ రూం లో ఇంటి వెనుక మెట్ల క్రింద వెదికిన బుజ్జులు కనబడలేదు  మేడ పైకి పరుగులు తీసి రెండంతస్తుల ఇళ్లన్నీ గాలించాను .కాళ్ళ కి చెప్పులు కూడా లేకుండా పిచ్చిదానిలా వీధి లోని ప్రతి గడప తలుపు తట్టాను నా ఏడుపుకి కోరస్ నా చెల్లి కూతురు తోడయింది మరిది చెల్లి ఇంట్లో అద్దెకి వున్నా వాళ్ళు ఎదురు పిల్లడు ప్రక్క వీధిలో కాపురం వుండే పనమ్మాయి వాళ్ళ పిల్లలు మూడు కిలో మీటర్లు దూరం లో వున్నా మా భావగారి అబ్బాయి ,మావారు సిక్కుల కాలనీ ఫన్ టైమ్స్ భారతినగర్ బ్యాంకు కొలని బాబా గుడి రోడ్ ఆటో నగర్ స్టెల్ల వెనుక రోడ్స్ ఎనిమిదింటి నుండి పదకొండు వరకు చీకట్లో 'బుజ్జులు ' బుజ్జులు 'బంగారు తల్లి ఎక్కడ ఎక్కడమ్మా అంటూ తిరిగాము చైతన్య హాస్టల్ వాచ్ మన్లకి ,కాలనీల వాచ్ మన్లకి జాడ తెలిస్తే చెప్పమన్నాము బహుమతులు ఇస్తామని చెప్పాము ...అలిసి వరండ మెట్ల మీద కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చాము ..నా కూతుర్కి నేనేమని సమాధానం చెప్పాలి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చాను నుదురు కొట్టుకుంటూ ఏడుస్తున్న మావార్ని చూస్తె ఎలా సముదాయించాలో తెలియక నేను చైతు భోరుమన్నాము .....తిరిగి ఆశ చావక వెదికిన వీదులే తలొక ప్రక్క పోయాము బాబా గుడి ముందు ఆగిన నేను బుజ్జులు ఇంటికి వస్తే నిన్ను చూస్తాను లేకుంటే జన్మలో నిన్ను చూడ అనుకుంటూ వెనక్కి తిరిగిన నాకు ఫోన్ రింగ్ వచ్చింది ...ఇంటికి వచ్చేయ్  బుజ్జు వచ్చింది  అని .......కాలనీ మూడో రోడ్ లో బుజ్జు మెడ బెల్ట్ పుచ్చుకుని ఎవరో ఇద్దరు పైకి లేపుతుంటే అదేమో కుయ్ కుయ్ అని అరిసిందట అది మా వారి కంటబడి  పరుగున అక్కడ చుస్తే బుజ్జమ్మ డాడి మీదికి దూకిందట .......అల కథ సుఖాంతం ..ఇంటికి వచ్చి పండగల స్వీట్స్  పంచుకున్నాము ...బుజ్జమ్మ పాలు త్రాగి అలసి పడుకుంది ....చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవే  అంటుంటే మమ్మల్ని చుసిన ఆనందం తో గంతులు వేస్తుంది ....బుజ్జులు తిరిగి రాకపోతే మా చిన్ని కి ఇద్దరం ఏం సమాధానం చెప్పేవాలమో అసలు అది తట్టుకోగలిగేద ...అసలు ఊహే భయంకరంగా వుంది ...బాబా మాపై దయ చూపాడు . http://himabinduvulu.blogspot.in/2010/11/blog-post_13.html
http://himabinduvulu.blogspot.in/2012/04/blog-post_30.html

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఇదీ జీవితం

 చూడవద్దు అనుకుంటూనే కళ్ళప్పగించి టివి చూస్తుండిపోయాను .ఆ పెద్దాయనకి ఈ వయస్సులో ఎంత కష్టం వచ్చింది !సర్వం కోల్పోయి పాలుగారేవయస్సున్నమనవడి భుజంపైన కుండ ఆని ఆన్చకుండా తన హస్తాలలో ఇముడ్చుకుని    హాలాహలం లాంటి నిజాన్ని దిగమింగుతూ తన కొడుకు పార్థివదేహం చుట్టూ తిరుగుతుంటే  ఇక చూడలేక టివి ఆఫ్ చేసేసాను న్యూస్ కోసం తప్పించి నాకు టివి చూసే అలవాటు లేదు .వాళ్ళు వీళ్ళు టివి సీరియల్స్ చూస్తుంటే ఒక లుక్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్పించి పూర్తిగా చూసింది ఎప్పుడు లేదు .సుమన్ గురించి విన్నాను ,చదివాను బహుశ వాళ్ళ స్వగ్రామం మా స్వగ్రామం ప్రక్క ప్రక్కనే వుండటం ఒకే మండలం కావడం వలన ఒకింత ఆసక్తి .గత రెండు సంవత్సరాలుగా అతని ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలా ఆశ్చర్యపోయేదాన్నిఆ మహమ్మారి ఎప్పటికైనా తనని కబళిస్తుంది అని తెలిసిన మామూలు వ్యక్తిలా తను గడిపిన జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం .తెలుగు పట్ల ఆ  కుటుంబం తీసుకున్న శ్రద్ద అబినందనీయం ,నిజానికి  ఈ మధ్యనే నేను ఆ పెద్దాయన నుంచి అందుకున్న" తెలుగు వెలుగు"
గురించి రాయాలనుకున్నకాని విధివశాత్తు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ప్రస్తావించాల్సి వచ్చింది.
బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు ,భర్తను కోల్పోయిన భార్య ,తండ్రిని కోల్పోయిన పిల్లలు ,సోదరుని కోల్పోయిన సహోదరుడు ఈ తీరని దుఖం నుండి తీరుకోవాలని సుమన్ ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. 

6, సెప్టెంబర్ 2012, గురువారం

నాన్న

నాన్నని రేపు  డిస్చార్జ్ చేయొచ్చు అన్న మాట చెవుల్లో అమృతం పోసినట్లుంది .పోయిన గురువారం ఇదేరోజు హైదరాబాదు కిమ్స్ లో నాన్న ఆరుగురు పిల్లలం అల్లుళ్ళు కోడళ్ళుఅమ్మ మనవళ్ళు ఆందోళనలో నాన్న చుట్టూ ఉన్నాము మరునాడు నాన్న కి జరగబోయే పిట్యుటరి గ్లాండ్ సర్జరీ గురించి ధైర్యం చెబుతూ(..రిస్క్ సర్జరీ అని అంత భయపెట్టారు )..శుక్రవారం సర్జరీ పూర్తయ్యి శనివారం స్పృహ లోకి వచ్చేవరకు అక్కడక్కడే తిరిగాము నాన్న అందర్నీ గుర్తుపట్టే వరకు ఒకింత ఆందోళన .దేవుని దయవలన (మానస్ పాణి గ్రహీ )నాన్న సర్జరీ తరువాత పూర్వపు స్థితికి వచ్చారు .మా అందరి జీవితాల్లో తిరిగి వెలుగు వచ్చింది ముఖ్యంగా అమ్మ జీవితంలో...........