ముసుగెందుకు ? చాలారోజుల నుండి నన్ను వేధిస్తున్న ప్రశ్న ...ఎందుకని ఈ అమ్మాయిలూ ముఖానికి ముసుగు వేస్తున్నారు కళ్ళు మాత్రమె కనబడేలా ఉంచుకుని రకరకాల స్కార్ఫ్స్ తో ముసుగులతో వెళ్తున్నారు బండి నడిపే వాళ్ళు నడపని వాళ్ళు ఇదే పద్దతుల్లో కనబడుతున్నారు సిటీ లోనే కాకుండా మండల కేంద్రాల్లో ఇలాటి అమ్మాయిలను తరుచు చూస్తున్నాము .... ఎండబారినుండి పిగ్మేంటేషన్ నుండి తప్పుకోవడానికా అనుకుంటే నిజం కాదనిపిస్తుంది బహుశా క్రూర మృగాళ్ళ నుండి రక్షణ కోసం అనుకుంటా !
20, జులై 2014, ఆదివారం
8, ఫిబ్రవరి 2014, శనివారం
17, నవంబర్ 2013, ఆదివారం
యేం రాయమంటవే చిన్నారి

యేం రాయమంటవే చిన్ని-ఓ నా చిన్నారి
ఎప్పుడు అమ్మ నాన్న అంటు లేదంటే అక్కచేల్లి ,తమ్ముళ్ళు గతంతోనే గచ్చకాయలు ఆడుతున్నా నంటావా
నా స్నేహితులు ,స్నేహితులంటో ఇంట్లోవున్న నెచ్చెలి మానసపుత్రిక చిన్నారి ని నిర్లక్ష్యం చేస్తున్ననంటావా
నీ గురించి రాయమంటావా ?ఏమని రాయమంటవే చిన్నారి .......
ఆరుగురి తరువాత మాతో ఆడుకోవడానికి మా ఇంటికొచ్చిన అందాల బొమ్మవని చెప్పాలా?
ఆరిందాలా అమ్మమ్మ వెంట నట్టింట తిరుగుతూ నడయాడిన బుట్టబోమ్మవని చెప్పాలా?
అమ్మ ఎప్పుడు చదువుకోవాలంటూ పుస్తకాలు తెచ్చి నా ఒడిలో పడేసిన చిన్నారి చిన్నివని చెప్పాలా ?
నిత్యం నన్నావరించిన మలయమారుతం నీవేనని చెప్పాలా ?
చిన్ని చిన్ని అడుగులతో కూచిపూడి ని ఔపోసన పట్టిన
చిన్నారి నాట్యమయూరి సుధవని చెప్పమంటావా?
కమ్మని గాత్రంతో పరిసరలను సైతం ముగ్ధుల్ని చేసే
ఈ ఇంటి కొమ్మ వనమాలినివని చెప్పమంటావా ?
అమ్మ చదివి చదివి అలసిపోతే ,పదేళ్ళకే పెద్దపెద్ద పుస్తకాలు నాన్న కు పోటీగా చదివి విన్పించిన వైనం చెప్పమంటావా
అమ్మ నాన్నకే అమ్మల కోసరికోసారితినిపించే అన్నపూర్ణవని చెప్పమంటావా ...
అమ్మ దుఖపడుతుంటే కొండంత అండ నేనున్నానని తనువెల్ల పెనవేసుకునే ఆశవాహినివని చెప్పమంటావా ..
నీ స్నేహంతో నన్ను నీ వయస్సుకు దించిన నీ గడుసుదనం గురించి చెప్పాలా
నీవు అమ్మకి చెల్లి వి అని తెలీని జనం అంటుంటే చిందులేసిన వైనం చెప్పాలా
నీ ఆటపాటలకు సైతం నాకు చోటిచ్చిన నేచ్చేలివని చెప్పాలా
నీవేమి దాచవమ్మ మనిద్దరి మద్య ,నేనేం దాచకుడద కలనయిన !
అమ్మకిచ్చిన మాట చెప్పమంటావా
అమ్మ సాధించనిది సాధించి చూపుతనంటావా
అమ్మ కల ల హరివిల్లు అమృత దర్శిని
యేం చెప్పాలే చిన్నారి ..ఈ ప్రియదర్శిని గురించి ఇంకేం చెప్పాలే .....
(మా అమ్మాయి అలిగితే మురిపించడానికి రాసాను ....) అప్పుడెప్పుడో ..
కలనయినా ఊహించలేదమ్మ భూగోళానికి నువ్వావల నేనివల ఉంటామని .... నువ్వెక్కడ వున్నా నేనెక్కడ వున్నా అమ్మ ప్రేమ దీవేనలు పున్నమి వెన్నెల లా నిరంతరము వర్షిస్తూనే ఉంటాయమ్మా చిన్ని నా చిన్నారి
కార్తిక పౌర్ణమి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నితల్లికి కిజన్మదిన శుభాకాంక్షలు ... ప్రేమతో అమ్మ
కలనయినా ఊహించలేదమ్మ భూగోళానికి నువ్వావల నేనివల ఉంటామని .... నువ్వెక్కడ వున్నా నేనెక్కడ వున్నా అమ్మ ప్రేమ దీవేనలు పున్నమి వెన్నెల లా నిరంతరము వర్షిస్తూనే ఉంటాయమ్మా చిన్ని నా చిన్నారి
కార్తిక పౌర్ణమి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నితల్లికి కిజన్మదిన శుభాకాంక్షలు ... ప్రేమతో అమ్మ
25, అక్టోబర్ 2013, శుక్రవారం
8, అక్టోబర్ 2013, మంగళవారం
అదే నా మొదటి ప్రేమలేఖ
రాసాడు చెప్పలేక :)
ప్రేమా ప్రేమ ప్రేమా!
అసలు ప్రేమకు సరైన భాష్యం తెలియని వయస్సులో అందుకున్నాను
కనీసం నవలలో చదివినట్టు స్కూలు ఫైనలు కాదు తొమ్మిదో తరగతి మద్యలో వున్నాను
అసలు విషయంలోకి వెళ్తే డబల్ రూళ్ళ పేపరు మీద ఇలా రాసాడు
''ప్రియానిన్నుచూడని జీవితం జీవితం కాదు''
రోజు సాయంత్రం నీకోసమే సినిమా హాల్ గేటు దగ్గర నిలబడుతున్నాను
వచ్చే జన్మ లో కూడా నీ ప్రేమను కోరే ప్రేమికుడు ,రిప్లై సూన్ ,టా టా
రాళ్ళపల్లి శేఖర్
మొత్తం చదివాకా అప్పుడు అడిగాను నాకు ఈ ఉత్తరం తెచ్చి ఇచ్చిన మా ఇంటిగల వాళ్ళబ్బాయి ప్రసాదును . ''ఇదేవరికోసం ప్రసాదు రాసిన వాడేవడు "అని .నీకొసమె అని టక్కున సమాధానం చెప్పాడు మరి నాపేరు లేదుగా ఉత్తరంలో అన్నాను ఇంకాస్త కన్ఫర్మ్ చేసుకోవడానికి అది మా అక్క కోసమో లేక మా పెద్ద చెల్లి కోసమో అని నా అనుమానం .ఇప్పడు ఈ ఉత్తరం ఇచ్చినవాడు ఎక్కడ వున్నాడు అని అడిగాను చూడాలనే ఒకింత కుతూహలంతో మా ఇంటి వెనుకనే సినిమా హాల్ వుండేది ప్రసాద్ నన్ను వీధి వైపు మేడ మీదకి తీసికెళ్ళి సదరు శేఖర్ని చూపించాడు ,థూ వీడా! అసలు బుద్దుందా(అదే ఆరడుగుల హీరోల వుంటే అనేదాన్ని కాదేమోఅప్పట్లో సినిమా హీరోలే మన కళ్ళకి మనుషులుగా ఆనేవారు ) వాడు ఇవ్వగానే నువ్వు నాకు తెచ్చివడమేనా అని గట్టిగ కోప్పడి పిల్లలందరూ కూర్చున్న చోటికి వచ్చి ఆ ఉత్తరాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాను వాళ్ళలో ప్రసాద్ వాళ్ళ కజిన్ స్పీడ్ గా లేచి ధియేటర్ దగ్గర ఇంకా నిలబడే వున్నా సదరు వ్యక్తిని కాలరు పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి వచ్చి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ కి రెండు తగిలించాడు మా గుసగుసలు గోల చూసి వచ్చి అడిగిన పెద్దొళ్ళకి విషయం తెలియనీయలేదు
.ఈ సంఘటన మేము హాస్టల్ నుండి దసరా సెలవలకి ఇంటికి వచ్చినపుడు జరిగింది సదరు ప్రేమికుడు నా ఇంటర్ వరకు నా నీడ లానే కదిలేవాడు కాని ఆఖరికి ఊరు మారిన కొత్త కాలేజి గేటుబయట కనబడి ఉలిక్కిపడేలా చేసాడు ..ఆ తరువాతెప్పుడో కాలేజికి వెళ్ళే దారిలో ..... అప్పటినుండి ఇప్పటివరకు మరి కనబడలేదు రెండేళ్ళ క్రితం రెండేళ్ళు అక్కడ పనిచేసినపుడు మా పాత ఇంటి వైపు వెళ్లినపుడల్లా చిన్ననాటి సంఘటన గుర్తోచేది .... నా రెండో లేఖ ముక్కుమొహం తెలియని కలం స్నేహితుడి నుండి ...(తరువాతి భాగం )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

