26, మార్చి 2009, గురువారం

మా అమ్మ చుట్టాలు -2

అక్క వాళ్ల డ్రైవర్ కి చెప్పింది ,కాలనీ లో వున్నాఆంధ్ర బ్యాంకు కి తెసుకొని వెళ్ళమని . మాతో పాటు మా పాప కూడా వుంది అదేమో ఏదో అద్బుతం చూడబోతున్నట్లువుంది .{మేము కథలు కథలు గ చెప్పే కబుర్ల వల్ల } నాకు గుర్తున్నంత వరకు నాలుగు రోడ్ల కూడలి లో బ్యాంకు ఉంటుంది అన్నాను .నిజంగానే నాలుగు రోడ్ల కూడలిలో బ్యాంకు ముందు ఆపాడు.అక్కడినుండి మేము కార్ దిగి మారిపోయిన కాలనీ ,బహుళ అంతస్తుల ఇళ్ళుచూసి పద్మ వ్యూహం లో చిక్కుకున్నట్లు వుక్కిరిబిక్కిరి అయ్యాము .ఇంటి నంబెర్ కూడా మాకు తెలిదు .
ఒకప్పుడు విశాలమైన రోడ్లతో చక్కటి డాబా ఇళ్ళు కూలిపోయి వాటి స్థానంలో అగ్గిపెట్టేలాంటి పొడవైన బిల్డింగ్లు ,traffic ranagonalu .ఒకప్పుడు మేము aadukunna చక్కటి కమ్యూనిటి హాల్ ,పార్క్ ,మేము రోజు సాయంత్రం బ్యాంకు పక్క నుండి నడుచుకుంటూ పోయే పాండురంగారావు సార్ ట్యుషన్ఎక్కడో గుర్తు పట్టలేక పోయాం .మేము నడుచుకుంటూ కార్ ని వెనుకనే రమ్మని ఒక్క నిమషం నేను కళ్లు మూసుకుని నేను ఇంటి నుండి బ్యాంకు కి వచ్చిన దారి తలుచుకుని కళ్లు మూసుకునే కొంత దూరం వెళ్ళాను {నిజంగా కళ్లు మూసుకునే} తిన్నగా మా ఇంటి ముందాగాము.ఇదే అక్క మన ఇల్లు అన్నా నా మాట నమ్మలేకపోయింది . {నేను కూడా }అస్సలికి కాదు మన ఇంటి వెనుక వీధి లో రావూరి భరద్వాజ వుండే వాళ్లు vaallaku ,మనకు పెరటి గోడ అడ్దటఅని మళ్ళిచెప్పింది ,అయన అక్కడే వుండి వుంటారని నమ్మకం ఏమిటి అన్నా నా మాటలకి అడ్డమొచ్చి ,లేదు ఆయనది సొంత ఇల్లు ,ఇదే కాలనీ లో వున్నట్లు విన్నానంది .ఇక మేము మళ్ళి కార్ డ్రైవర్ ని ఒక వైపు పంపి మేము అక్కడక్కడ ఆయన గారి ఇంటి కోసం వాకబు చేస్తుంటే ఇంతలో డ్రైవర్ అడ్రెస్స్ దొరికిందమ్మా ,కార్ ఎక్కండి అని పక్క వీధి వైపు కార్ పోనిచ్చి అయన ఇంటి ముందు ఆపాడు .మేము దిగి ఆయన పక్క ఇల్లు దాటి వెనుక వీధి కి వస్తే ఏముంది .మేము మొదట ఆగిన ఇల్లే .మాకైతే ఒకటే ఆచ్చార్యం ఇంత రూపు రేఖలు మారిపోయాయ అని ,మా అక్కకి ఇంక జీర్ణించుకోలేక పోయింది .మా అమ్మాయి మా వంక నిరసనగా చుసిన చూపు మర్చిపోలేదు .
విశాలమైన ఆవరణలో చక్కటి డాబా ఏది ,?ఇంటి గేటు ముందు వచ్చిన వారికి వొయ్యారంగా స్వాగతం చెప్పే జాజి పూల పందిరి ఏది?ఇంటికి ఎడమ బాగం లో సాయమ్త్ర్మవ్వగానే కమ్మని వాసనలతో కళ్లు చెదిరే రంగులతో నునుసిగ్గుతో విచ్చుకునే చద్రకాంత లేవి? పక్కింటి వాళ్ల ఇంట్లోకి భారంగా వొరిగి పోయిన తియ్యని ఎర్ర జామి చేట్టేది ? ఇల్లునంత దాచేస్తూ ,నా నీడ లో నీకేమి భయం లేదు అంటు అభయ హస్తం ఇస్తున్నట్లు పెద్ద దిక్కుగా పెరటిలో వున్నా మామిడి చేట్టేది? మామిడి నీడలో పెరుగుతున్న మల్లె ,సన్నజాజి కనకాంబరాలు ...అయ్యో ఇది మేము వున్నా ఇల్లేనా ..ఇంక పచిగా ,నిన్న మొన్న జరిగినట్లున్న భాల్యపు జ్ఞాపకాలూ ,అద్దాలమందిరం పగిలి బీటలు వారిందే మా ఇద్దరికీ గొంతులు పోయాయి .
ఆ ఇల్లు రూపురేఖలు ఇసుమంతలేవు ,ఆవరణ అంత పిచుక గూడుల్ల అడ్డ దిడ్డంగా ఇల్లు ,గదులు ,ముక్కలు చెక్కలు బహుశా పంపకాల్లో ఏమిటో . నిలబడ లేక పక్కకి కదిలాము . అమ్మ నాన్న లకు ఆప్తులైన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఇంటికి కుడి చేతి వైపు చివర్లో వుండేవాళ్ళు . చాలాకాలం వుత్తరాలు రాసుకుని ఇప్పుడు ఎవ్వరేక్కడో తెలీని పరిస్థితి.వాళ్ల ఇల్లు నేను గుర్తు పట్టగాలనని నడుచుకుంటూ ,ఆ ఆంటీ పేరు సావిత్రి అని మా అమ్మాయికి చెప్తూ పార్క్ దాటి సరిగ్గా ఆ ఇంటి ముందాగి ఇదే ఇల్లు అని నేను అనడం నేమ్ బోర్డ్ లో సావిత్రి అని అమ్మాయి చదవడం జరిగిందీ . మా అక్క ఏకంగా చిన్నప్పట్ల ఆంటీ అంటు లోపలికి సరాసరి వెళ్ళడం , ఆవిడనే సావిత్రి ఆంటీ ఏరి అని మేము ఫలాని ఫలానా అనగానే ఒక్కసారే తెల్లబోయి ,తబ్బిబ్బు అయ్యి ,yemtho aanandhapaddaru అమ్మకి ఫోన్ చేసి ఎవరు మాట్లాడతారో విను అని మా అమ్మ కి షాక్ ఇవ్వడం వారితో ,ఆవిడ కోడలు ,పిల్లలతో గడిపి , రాత్రికి సంతోషంగా ఇల్లు చేరాము ,వచ్చే దారిలో ఇంటి వైపు చూడకుండా వచ్చేసాముకనీసం మా అమ్మ వొదిన గార్ని కలిసోచ్చం అన్నా తృప్తి తో .

3 కామెంట్‌లు:

ఉమాశంకర్ చెప్పారు...

మొత్తానికి నిరాశ పడ్డారన్నమాట.

Hima bindu చెప్పారు...

@ఉమా గారు నిరాశకన్నా భాద పడ్డాము ,పోనిలే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలిపాయు అన్న ఆనందం మిగిలింది .

మురళి చెప్పారు...

పోనీ లెండి.. ఇల్లు దొరక్క పోయినా (మీరు ఊహించుకున్న ఇల్లు) స్నేహితులు కలిశారు..