నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్లి వచ్చాను .అది అర్ధరాత్రి ముహూర్తం వధువరులిద్దరు చక్కగా పక్కపక్కనే కూర్చొని ,విందుభోజనం ఆరగించి వచ్చిన ,భందుమిత్రులనుండి ఆశిస్సులు తీసుకుంటూ పెళ్లి ముహూర్తం కోసం ఎదురు చూస్తూ కనబడ్డారు .అస్సలు ముహూర్తం వదిలేసి భందుమిత్రులు వెళ్ళిపోతారు ,పెళ్లిముహూర్తం వరకు వుండలేరని ఇలాంటి ఏర్పాట్లు మన అవసరానికి అనుగుణం గా చేసుకుంటూ పోతున్నాం .నిజంగా పరికించి చూస్తుంటే ఎన్ని మార్పులు వస్తున్నాయి .మన బ్లాగ్ మిత్రుడు "నెమలికన్ను"చాల చక్కగా విశ్లేషణ చేసారు వాళ్ళభామ్మ పెళ్లి మొదలుకుని సమకాలిన అంశాలను స్పృశించారు .
ఏదైనా వ్యవస్థ లో మార్పు అనివార్యమని తెలియచెప్పారు .ఖదీర్ వాళ్ళ జరీనాఆంటీపెళ్లి తో మారిన సాంప్రదాయం తన రచనల ద్వారా ముస్లిం కుటుంబం లోని మార్పు చెప్పారు.
ఇవన్ని చర్చిస్తుంటే నా జ్ఞాపకాల పోదిలోని కబుర్లు తళుక్కు మంటున్నాయి . సరదాగా మీతో చెప్పాలనుకుంటున్నాను .
మా అక్క కి నాకు ఒక గంట తేడాతో ఒక్కరోజే పెళ్ళయింది . అక్క ,నేను ఇద్దరం డిగ్రీ లో వున్నాం .మంచి సంభంధం అని అక్కకి కుదిరాక ,పనిలోపనిగా సంభంధం రావడం తడవు నాక్కూడా సెట్టిల్ చేసేసారు .మా భందువులని
మంచివాళ్ళని మన ప్రమేయం లేకుండానే కుదిర్చేసారు .
ఒక రోజు మేము కాలేజి నుండి వచ్చేసరికి ఇంట్లో చుట్టాలు వచ్చి వున్నారు .మా అమ్మ రొటీన్ గ ఇది పెద్దమ్మాయి ,ఇది రెండో అమ్మాయి అంటు పరిచయం చేసింది.మేము మర్యాదగా ఒక నమస్కారం పడేసి గది లోకి వెళ్ళాము .వాళ్లు వెళ్ళాక తెలిసింది వాళ్ళలో నాకు చేయబోయే అతను వున్నారని .నేను తనని సరిగ్గా చూసింది లేదు .అప్పట్లో మా ఇల్లు నేటి సినిమా "భొమ్మరిల్లు" .మా నాన్న హిట్లర్ .చదువులు కూడా మా ఇష్టం కాదు ,నేనే సాహసం చేసి మెడిసిన్ కాదని ఆయనికి ఇష్టం లేకుండా ఆర్ట్స్ లో చేరాను ,దానికి గాంధీ మార్గంఅనుసరించి సాధించుకున్నలెండి .నాకు కుదిర్చినది అయిన సంభందమయిన మా పిల్లలేవర్కి ఎవ్వరు తెలియరు . మా నాన్న గారు మమ్మల్ని ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క ఊర్లో చదివించారు .మేమేమో "పిల్లి పిల్లల్లా "ఊరూరు తిరిగాము మా నాన్న ట్రాన్స్ ఫర్ వలన .
ఆ విధంగా పెళ్లిచూపులు వగైరా లేకుండానే , షరతుల తో {చదువు ఆపమనకూడదు ,వాళ్ళింటికి పంపకుడదు } అమ్మ దగ్గర వాగ్ధానం తీసుకుని ఒప్పుకున్నాను .శ్రావణం లో నిశ్చితార్ధం ,కార్తికంలో పెళ్లి పెట్టుకున్నారు .మా ఇంట్లో జరుగుతున్నా మొదటి ఫంక్షన్ ,ఇద్దరిది అయ్యేసరికి నిశ్చితార్దం చాల గ్రాండ్‌గా పెట్టుకున్నారు.
ఆరోజు వుదయం పది గంటల ప్రాంతంలో తాంబూలాలు ,మొదట అక్క వాళ్ళది , వచ్చిన స్నేహితులు పక్కింటి వాళ్లు హాల్ లో కూర్చుని వున్నా పెళ్లికొడుకులను చూసి వచ్చి మాకు లైవ్ ఇవ్వడం చేసారు. రెండో అల్లుడు ఆరడుగుల అందగాడు చాల బాగున్నాడు అని అందరు అంటుంటే ,మనం కిటికీ నుండి పెళ్లి వాళ్ళు కూర్చొన్న దిక్కు నా ఫ్రెండ్స్ ,మా ఇంటి పైన అద్దెకు వున్నా రాధ గారు ప్రోద్బలంతో చూసానండి .అతను "బ్లూ షర్టు "లో మెరిసిపోతున్నాడు .చిరునవ్వులు చిందిస్తూ వచ్చే పోయే వాళ్ళను చూస్తున్నాడు .అతని ప్రక్కన స్నేహితుడు ముభావంగా కూర్చున్నాడు .ఆ ప్రక్కన మా కాబోయే భావ గారు ,భంధువులు వున్నారు.
మా అక్క వాళ్ల తరువాత మాది మొదలయింది .మా అత్తా గారు వాళ్ళు ,అమ్మ వాళ్లు అంత కూర్చున్నాక ,పంతులుగారు ఆయన్ని వచ్చి అక్కడ కూర్చోమనగానే బ్లూ షర్టు అబ్బాయి కాకుండా పక్కనున్న అతని స్నేహితుడు వచ్చి పూజ లో కూర్చున్నాడు .అంతే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళం చూసుకుని {పైన ఇంటి రాధ ,నా ఫ్రెండ్స్ ]ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం . అలా జరిగిందండి మా పెళ్లి .నిశ్చితార్ధం అయ్యాక కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్ లోనైనా .కొంత మంది ఎందుకు చేసుకుంటారో అర్ధం కాదన్నట్లు ,నిజమే నాకు తెలిదు ,అమ్మ వాళ్ల మాట వినాలి కాబట్టి చేసుకున్నానేమో .నేను పెట్టిన షరతుల ప్రకారం పిజి కూడా చేశాను , ..మా చివరి చెల్లి పెళ్లి మాత్రం నచ్చనివి పక్కన పెట్టి కావలసినవాళ్ళను ఎంపిక చేసుకుంది . మా ఇంట్లోనే ఎంత మార్పో ! అప్పుడు ఇప్పుడు కేవలం కొన్ని సంవతరాల్లో తేడ ,
a {సరదాగా }పెళ్ళికాని అబ్బాయిలు మీ పెళ్ళిచూపులకు కాని ,పెళ్ళికి కాని ఎవర్ని వెంట తీసుకెళ్ళ వద్దు .. అన్నట్లు మా వారి ఫ్రెండ్ బ్లూ షర్టు పేరు సతీష్ ,రాజమండ్రి లో తను పని చేసే ఆఫీసు లో ఫ్రెండ్ అట .ఇప్పుడు గుర్తోచినప్పుడల్లా మా హస్బెండ్ ని ఆట పట్టిస్తుంటాను.
]
]
12, మార్చి 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 కామెంట్లు:
బాగున్నాయండి....మీ నిశ్చితార్థం ముచ్చట్లు.
:-)
మీ బ్లాగులో ఫాంట్ కనులకు ఇంపుగా లేదండీ.
మీరూ పెట్టారుగా రెండు షరతులు.. సొ, మీరూ విన్నరే..
భలే ట్విస్ట్ ఇచ్చారే.. బాగా నవ్వుకున్నా..
గమ్మత్తైన విషయం :)
అమ్మ చిన్ని గారూ ! భలేవారే ....ఇంకా ఎదురు ఆటపట్టిస్తున్నారా ?
ఏదేమైనా మనకున్న ధైర్యం వాళ్లకుండదండీ ......ఇదే సిట్యువేషన్ వాళ్లకు ఎదురైతే మనతో చెప్పటానిక్కూడా ధైర్యం చేయరేమో.....పాపం ......
బావుందండీ
ఇంతకీ నీలం షర్ట్ అబ్బాయి రాజమండ్రి లో ఎక్కడ వుంటాడో చెపుతారా
( వూరికే జోక్ చేసానండీ బాబూ . నిజంగా ఎడ్రస్స్ ఇచ్చేస్తారేమో )
@పద్మర్పిత, అశోక్ ,నాగన్న,మురళి ధన్యవాదాలు .
@శరత్ మార్చడానికి ప్రయత్నిస్తాను .
@ఉమా ,ఆ రెండే కాదు జీవితంలో నేను అనుకున్నది చాల చేయగలిగాను
@పరిమళం నిజమే ,మనకున్న ధైర్యం ఈ మగవాళ్ళ కు వుండదు .
@లలితగారు అడ్రెస్స్ నిజంగా ఇస్తాను ,మా హస్బెండ్ ఆఫీసు లోనే ,లేకపోతె మీ రాజమండ్రి.లోనే వున్నాడు.[సరదాకి}
కామెంట్‌ను పోస్ట్ చేయండి