16, మార్చి 2009, సోమవారం

కొత్త అలవాటు

రెండు రోజులనుండి ఏం తోచడం లేదు రెండో శనివారం కావడం తో ఆఫీస కి వరుసగా సెలవలు వచ్చాయి .చేయడానికి చాల పనులున్నాయి ,కాని వాటి మీద మనసుపెడ్తేకదా ,చదవాల్సిన నవలలు ,వారపత్రికలు నాకోసం ఎదురు చూస్తున్నాయి .నేను పెంచే గారలపట్టిలు{మొక్కలు}నా మీద కినుక వహించాయని తెలుసు ,కాస్త వేసులబటుదోరికితేవాటికి స్నానం చేయిస్తూ కొత్త చిగుర్లు ,కొత్త మొగ్గలు తొడిగాయోమోనని వెదుక్కునే దాన్ని ,ఇప్పుడు వాటి పోషణ పనమ్మాయి కి పురమాయిస్తూ వెళ్ళేప్పుడు వచేప్పుడు వాటిని వాకిటనే పరామర్శిస్తూ వున్నాను ,ఎక్కడో ఓ మూలా సన్నగా వినిపించే పాటలు కూడా మ్రోగడం లేదు .
నాలో ఏదో మార్పు నా దినచర్యలో కూడా మార్పు ,నన్ను అంతగా ఆకర్షించి భంగం కలిగించేదేవిటి అని ఆలోచిస్తే నేను కొత్తగా అడుగు పెట్టిన బ్లాగ్ ప్రపంచం .ఖాళి దొరికితే "జల్లెడ",కూడలి" కొందరి మిత్రుల బ్లాగ్ లు చూడడం . ఇదొక వ్యసనం గ మారే ప్రమాదం కనిపిస్తుంది. ఆఫీసు లో కూడా ఏదో సమయం లో బ్లాగ్ లోకి వెళ్తున్నాను .
నేను ఇంత బుద్దిగాఆలోచిస్తానికి కారణం మన లాప్ టాప్ లో ప్రాబ్లం వచ్చి నన్ను నేను తరచి చుసుకునేట్లు చేసింది . సమ న్యాయం పాటించాలని తీర్మానం చేసుకున్న. ఈ కొత్త ప్రపంచం నన్ను వేటికి దూరం చేయకూడదని కోరుకుంటున్నాను .
మన సిస్టం బాగు అయ్యింది . నా మానసిక సంఘర్షణ నా మొదటి టపా అయ్యింది.



.

8 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

ఆశ్చర్యం ఏమిటంటే నేనూ ఈమధ్య ఇదే విషయం ఆలోచిస్తున్నానండి. మీరు టపా రాశారు. నిజమే.. సమంగా న్యాయం చెయ్యాలి..

పరిమళం చెప్పారు...

చిన్ని గారు , మా అంతరంగం లోకి తొంగిచూశారా ఏం ?

ఉమాశంకర్ చెప్పారు...

నేను గత రెండు నెలలుగా కాస్త సంయమనం పాటిస్తున్నాను(అనుకుంటున్నాను). అంతకుముందు నాదీ అదే పరిస్థితి. :-(

Hima bindu చెప్పారు...

@మురళి ,పరిమళం ,ఉమా మీ మాటలు నన్ను స్వాంతన పరిచాయి. హమ్మయ్య నేను ఒక్కదాన్నే కాదన్నమాట!

Padmarpita చెప్పారు...

ఏవండీ! నన్ను కూడా చేర్చుకోండి ఆ లిస్ట్ లోకి...

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత నిజంగా మనం అంతా ఒక్కటి కాబట్టే ఇలా కలుస్తున్నామని నమ్ముతున్నాను.

చైతన్య చెప్పారు...

నాకు కూడా ఈ మధ్య ఈ బ్లాగింగు ఒక వ్యసనంలా తయారయింది... జాగ్రత్తగా ఉండాలి....

Hima bindu చెప్పారు...

@చైతన్య నేను జగ్రత్తపడలనే ప్రయత్నంలోనే ,కాని ఉమా లాంటివాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు రాయమని::)