మా అక్క చెల్లి తమ్ముళ్ళు అంతాకలిస్తే మా బాల్యం లోకి వెళ్ళిపోతాంఅంటే నెమరు వేసుకోవడం అన్నమాట .ఇప్పుడు ఆరుగురం వుద్యోగ రీత్యా కాని ,వివాహ రీత్యా కాని దేశ రాజధాని ,ఆంద్ర రాజధాని రకరకాల ప్రదేశాలలో వుంటున్నాము .మేము చిన్నతనం లో చాల ఊర్లలో చదివాము .ఒక్కొక్క ఊర్లో సంవతరం లేక రెండు సంవత్చారాలే వుండేవాళ్ళం .కొత్త ప్రదేశంలో సెట్టల్అయ్యే లోపే మరో ఊర్లో కొత్తగఅడుగుపెట్టల్సి వచ్చేది .అయిన వెళ్ళిన చోటల్లామంచి స్నేహితులు ఎర్పడేవాళ్ళుముఖ్యమ్గా మా అమ్మ కి ,చుట్టూ పక్కల వాళ్ల తో మంచి రిలేషన్స్ ఏర్పడి అక్కడి వాళ్ళని వదిలి రావడానికి భాద పడేది ,తరుచు ట్రాన్స్ఫర్ అయ్యే మా నాన్న వుద్యోగాన్ని తిట్టుకునేది .నాకు ఊహ రాక ముందు జహీరాబాద్ ,అక్కడినుండి తిరుపతి, హైదరాబాద్,కొత్తగూడెం,చిత్తూర్ కొవ్వూరు రాజమండ్రి ఏలూరు మచిలీపట్టణం నెల్లూరు విజయవాడ ఇలా తిరిగి బోల్డంతమంది చుట్టాలు ఏర్పడే వాళ్లు {మా అమ్మకే పిన్నిగారు ,బాబాయి గారు , అక్కయ్యగారు }:) అమ్మ అని కాదు కాని మంచి స్నేహితురాలని చెప్పవచ్చు .
మేము ఎవరమైన వుద్యోగ రీత్యా మేము చిన్నతనం లో గడిపిన ఊరు వెళ్ళడం తటస్థిస్తే తప్పకుండ మేము అద్దె కున్న ఇంటికెళ్ళి చూసోస్తాము .అక్కడి వారిని కలిసి ఫలానా వాళ్ళెక్కడ వున్నారు అని తెలుసుకుని వాళ్ళ ఇళ్ళకు వెళ్లి వాళ్ల కు అమ్మ కబుర్లు చెప్పి ,వాళ్ల కబుర్లు అమ్మ కి మూట కట్టుకేల్తాము. అమ్మ ఎంత ఆనంద పడ్తుందో వర్ణించలేము . రెండేళ్ళ క్రితం అక్క చిత్తూర్ వెళ్లి గ్రీమ్స్ పేట లో వున్నా మా ఇంటిని చూసి , అక్కడ వున్నా అమ్మ చుట్టాలతో ఒక పూట గడిపి వాళ్ల కబుర్లు ఫోన్ నంబర్ తో వచ్చి మా అమ్మ కు సర్ప్రిసే ఇచ్చింది .అలానే విసాధము మోసుకోచింది మా ఇంటి పక్కనే వున్నా గణపతి వాళ్ల అమ్మ వాళ్ల నాన్న పెట్టె భాదలకి భావి లో దూకి చనిపోయారని ,అప్పుడు అమ్మ చాల ఏడ్చింది .అల అప్పుడప్పుడు మా తమ్ముళ్ళ సహా మా జ్ఞాపకాలు తవ్వుకోడానికి అప్పటి త్రుల్లిన్తలు ఏరుకోవడానికి వేల్తోంటాము .
ఆరు నెలల క్రితం మా అక్క నేను హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ లోని మా ఇంటిని {సొంతం కాదు ,అద్దె }చూద్దామని అక్క ఆఫీసు అయ్యాక ప్లాన్ చేసుకుని వెదకటానికి వెళ్ళాము ,అక్క కార్ డ్రైవర్ కి ఆ ఏరియా మొత్తం తెలుసని చెప్పాడు .మేము అక్కడ ఒకటి రెండు తరగతులు చదివాము .అక్క నేను ఎలా కనుక్కోవాలో గుర్తులు ఊహిస్తూ , మా ఇంటి వెనుక రేడియో లో పని చేసే రావూరి భరద్వాజ ఇల్లు వుండేదని ,అమ్మ ,నాన్న తరుచు అనడం తెలుసని "అక్క చెప్పింది . నేను " ఆంద్ర బ్యాంకు కి వెళ్తే కళ్లు మూసుకుని మనమున్న ఇంటి దగ్గర ఆగుతా అని "అన్నాను. {నిద్ర వస్తోంది మిగతాది వీలైనపుడు}
4 కామెంట్‌లు:
ఇంతకీ ఆ (మీ) ఇల్లు అక్కడ ఉందా లేక ఈ రియల్ ఎస్టేట్ ప్రభంజనంలో అక్కడొక బ్రహ్మాండమైన బిల్డింగు లేచిందా అనేది తెలియాలంటే మీరు చెప్పేదాకా ఆగాలంటారు అంతేకదా..?
మొత్తం రాసేదాన్నే నిద్ర తో అచ్చు తప్పులు ఎక్కువ పడితే మళ్ళి అందరు క్లాసు తీసుకుంటారు ,ఈసారి మళ్ళి నేను కొత్త తప్పులు దిద్దుకుంటాను అని తప్పించుకోలేనుగా ::)
ma chinappudu memu kuda andhrabank daggaralone 48/3rt anna intlo addekunde vallam. akkade sai mithayi bhandar vundedy oka rupayiki padi bajjilu vedi vedi ga vesi icchevaru.kompatisi miru ma pakkinti varu kadu kada ?
అవునా మిగతాది కూడా చదివితే మీకు అవునో కాదో తెలుస్తాది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి