6, ఆగస్టు 2009, గురువారం

కార్ డ్రైవర్ కథ -2

అనుకోని పరిస్థితిల్లో చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చిందన్నాడు .పని వుంటే ముందు రోజు చెప్పమని కొంచెం గట్టిగానే హెచ్చరించాను.ఇలా ప్రతివారం లో నో పదిహేను రోజులకో హటాత్తుగా రేపు రానండి ,సెలవు కావాలనేవాడు .ఒకరోజు విసుగొచ్చి అడిగాను ,'నీకు యేం బాద్యతలు వున్నాయి బాబు అస్తమాను ఇలా సెలవలు పెడుతుంటావు 'అని .విచారించగా తేలినది ఏమంటే అతను కోర్ట్ కి అటెండ్ కావాలట ,ఎందుకంటె వాళ్ళ నాన్న స్థలం తాలుక ఆస్తి తగాదాల్లో వాళ్ళ నాన్న కి ఓపిక లేదని అతను హాజరు కావలసి వస్తుందన్నాడు .ఒక ఐదు ఆరు నెలల లో అయిపోతాదని చెప్పాడు .అతను మానేసిన రోజు ఒకసారి మా ఎదురింటి డ్రైవర్ ని అడిగాను,ఈ అబ్బాయి సంగతేంటని ,అతను పొంతన లేని సమాదానం చెప్పాడు .కోర్ట్ కి వెళ్ళాలని చెప్పాడు నాతో అనేసరికి,చెప్పాడామీకు అని అతను బోల్డంత ఆశ్చర్యపోయాడు .తనకి సరిగ్గా తెలీదని దాటవేశాడు.
ఆ అబ్బాయి నెమ్మది నెమ్మదిగా చేసినంత వరకు పద్దతిగా చేస్తూవుండటం తో ,అతను సెలవు పెట్టిన పెద్దగ పట్టించుకునేవాళ్ళం కాదు .ప్రక్క వీధిలో వున్నా మా అమ్మ వాలింటికి పనుల మీద పంపడం ,చెల్లి ,తమ్ముడు పిల్లలోచ్చిన ఒక్కరినే అతని తో పంపడం చేసేదాన్ని .ఒకరోజు చిన్న చెల్లి నాకు వార్నింగ్ ఇచ్చింది ,మరీ నమ్మేసి పిల్ల లిని అలా అతని కూడా పంపించోద్దని. ఆమె అన్నప్పటి నుండి నేను అతన్ని గమనించడం మొదలెట్టాను.ఎప్పుడు కార్ ఎక్కబోతున్న సన్నగా పాటలు వినిపిస్తుండేవి..ఆలకించగా అభినందన లోని 'మాటరాని మౌనమిది' అసలు ఎప్పుడు చుసిన అదే పాట ఎంతిష్టం ఐతే మాత్రం అస్తమానం ఇదే వినాలా అని ,అది అవ్వగానే ఆఫ్ చేసేసేవాడు .నాకు వుండే కొద్ది అర్ధం అయ్యింది ,నేను ఎక్కే ముందే అది ఆన్ లో పెట్టి అయ్యాక ఆపుతున్నాడని ,ఇక ఇంట్లో చర్చ పెట్టాను వీడు ఇదే పాట కావాలనే పెడుతున్నాడని ...ఉహు ...ఇంట్లో మావారు ,పాప ఒప్పుకోరు ,పాపం వాడికి పాటల పిచ్చితో ఇష్టమై అదే వింటున్నాడు అనేవాళ్ళు.వాళ్లంతా వున్నప్పుడు ఎఫ్.యేం పెట్టేవోడు .ఒకరోజు నేను ఒక షాప్ లో వుండగా దగ్గరలో పార్కింగ్ లోనుండి గట్టిగట్టిగా "నిన్నేనిన్నే దిల్సే ....వాయే వాయే "వస్తుంది,ఇంతకీ అది మా కార్ నుండే,నేను దగ్గరికి వచ్చాక బాగా తగ్గించేసాడు ,నేను కొంచెం కటువుగానే "ఏంటయ్యా ఈ పాటలు,ఎక్కడినుండి పట్టుకోచ్చావు నాయన "అన్నాను .కొత్తవండి 'దేశముదురు 'లోవి మేడం చాల బాగున్నాయండి అని,వాడి సమాదానం.వాడు అభినందన మార్చి వినవె వినవె మొదలెట్టాడు .అతని ప్రతి కదలిక నాకు విపరీతంగా గోచరించడం నాకు నేను సర్దిచేప్పుకోవడం అనవసరంగా వాడిని అనుమానిస్తున్నానేమోనని .
నేను కొంచెం దూరం వెళ్ళేప్పుడు పుస్తకాలు నా కూడా వుంటాయి ,అదే నాకు తీరిక టైం కూడా .ఒకరోజు చదువుతూ ఎందుకో హటాత్తుగా తలెత్తి చుస్తే కార్ వ్యూ మిర్రొర్ లోనుండి ఆ వెధవ నన్నే చూస్తున్నాడు కంగారుపడి చూపులు తిప్పేసుకున్నాడు .నేను గమనించనట్లు ఊరుకుండిపోయాను.తరువాత అదే పరిస్థితి రోడ్ వెనుక వచ్చే వాహనాలకు వుండాల్సిన పోసిషన్ వెనుక సీట్కిపరిమితం అయ్యింది .డౌట్ లేదు వీడో క్రిమినల్ అని నాకు అర్ధం అయ్యి ,ఇక ఈ డ్రైవర్ మనకి వద్దు అని జరుగుతున్నది చెబుతుంటే మా వారు సంశయం లో పడ్డారు,నేను ఊరకనే అనుమానిస్తున్నానని.వాడు యధాప్రకారం మరునాడేదో కోర్ట్ అన్నాడు, సరే ప్రస్తుతం అవసరం లేదు కబురు చేస్తాం అన్నాను వాడు నా మొహం లోకి సిరియస్ గా చూస్తూ పోయాడు ,మరునాడు నేను ఇంట్లో లేని టైములో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసిఫోన్ లిఫ్ట్ చేసిన మా అమ్మాయి తో అమ్మకివ్వు అని కాస్త తేడాగా మాట్లాడడు,మమ్మీ ఆఫీసు లో వుంటారుగా అక్కడికే మాట్లాడమని పాప చెప్పడం తో నా ఆఫీసు కి ఫోన్ చేసి చెత్త చెత్త వాగుడు బాగా తాగేసి వున్నట్లున్నాడు వినకుండా పెట్టేసాను .మరునాడు వాళ్ళ నాన్న,అక్కల్ని తీసుకొచ్చి పనిలో పెట్టుకోమని ఒకటే బ్రతిమాలడం .వాళ్ళేమో అమాయకంగా వీడు చాల మారాడు బుద్ధిగావుంటున్నాడు అని,అవసరం అయినపుడు పిలుస్తానులే అని చెప్పి పంపించేసాను.అతన్ని పెట్టిన ఎదురింటి డ్రైవర్ రవి ని గట్టిగ నిలదీసాను ,ఎందుకు అలాంటివాడిని పెట్టావని,వాల్లిన్ట్లోవాళ్ళు చాల మంచోళ్ళు వాళ్ళు చెప్పడం వల్లపెట్టాను మారాతాడనుకున్నమమ్మఅని క్షమార్పణలు చెప్పాడు .ఇంతకి మొత్తం ఆర తీస్తే ఇతను ఏదో గ్యాంగ్ కేసులో ఉండి బెయిల్ మీద బయట వుండి చెడు సావాసాలు వదలలేకో ,పుట్టుకతో వచ్చిన గుణం ఏదైనా వుంటే వదల్లెకో తన 'బుద్ది'చూపించుకుంటున్నాడు..........ఇంకో డ్రైవర్ కథ త్వరలో .

9 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

బాగుందండి.. పెద్ద పాఠమే నేర్చుకున్నారన్న మాట..

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మీ డ్రైవర్ గురించి చదువుతున్నంతసేపు రాంగోపాల్ వర్మ సినిమాలోని కారెక్టర్ లా అనిపించాడు. మొత్తానికి తొందరగానే వదిలించుకుని బయటపడ్డారన్నమాట.

ఉమాశంకర్ చెప్పారు...

మురళీగారి వ్యాఖ్యే నాదికూడా..చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో ఈ డ్రైవర్ల విషయం ఒకటి..

చిన్నా చెప్పారు...

ఈ డ్రైవర్లతో కష్టమే....! ఈ మధ్య తిరుగుబోతులు ఎక్కువయ్యారు. ఎవడు జులాయో, ఎవడు మంచోడో చెప్పడం కష్టం. జాగ్రత్తండీ :)

Hima bindu చెప్పారు...

@మురళి
@శేఖర్ పెద్దగోపు
@ఉమా
@చిన్న
నిజానికి నేను ఎదుర్కొన్న పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే రాయటం జరిగిందీ.ఏ పని లేనివాడికి డ్రైవింగ్ మంచి అవకాశంఅయ్యింది .ముఖ్యంగా ఆటో డ్రైవెర్లలో క్రిమినల్స్ ఎక్కువగా వుండటం వలన కూడా నేరాలు ఎక్కువ శాతం వారివే అయ్యుంటున్నాయి.అందరికి దన్యవాదములు .

మరువం ఉష చెప్పారు...

అయ్యో పాపం. జాగ్రత్త సుమీ, డ్రైవరిణి కావాలంటే నాకు కబురు పెట్టండి మేడం. నాకు అలవాట్ళేవీ లేవు పాటలు పెద్దగా వినటం తప్పా... ;) lesson learnt అన్న మాట. మా డ్రైవరు అలాగే తమ్ముడు మాదిరి ఆఖరుకి చెల్లి చనిపోయిన సమయంలో కూడా ఇంటి వారికన్నా తాపత్రయపడ్డాడు తన వంతుగా ఏదో చెయ్యాలని, "ఒక్క మాట చెప్పక్కా, నూతిలోకి దింపి నిజం కక్కిస్తా, పోలిస్ వద్దు, ఎవడూ వద్దు, నేను చాలు నీకు" అని అన్న ఆ మాటలింకా గుర్తే. అలాగే వాళ్ళింట్లో భోజనాలకి రానన్నానని బ్రతిమాలి, తీసుకెళ్ళి విడిగా వండించిన చిన్న గిన్నెల్లో తెప్పించి "అక్కా ఇది నీకనే వండించినా అల్లం, ఎల్పాయ కూడా వేయలా" అన్నపుడు మాత్రం అభిమానం వెదుక్కోకూడదు మననే వెదుక్కుని వస్తుందని అనిపించింది. ఇపుడు నాకు నేనే అన్నీ - రాజు రాణి మంత్రి డ్రైవరూ...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మీరిలా చెప్పా పెట్టకుండా రెండో పార్ట్ వ్రాస్తే మేము కామెంట్లు ఎట్టా రాయాలి?
అవునండీ, ఇంట్లో పని వాళ్ళని, డ్రైవర్ ని కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి.

మధురవాణి చెప్పారు...

మీ అనుభవం మాకు చెప్పి మంచి పని చేశారండీ. డ్రైవర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇవ్వాళ నేనో కొత్త విషయం నేర్చుకున్నాను :)

Hima bindu చెప్పారు...

@ఉష
నేరాల్లో ఆడవాళ్ళు తక్కువేం తినలేదు మేడం :) ఒక్కొక్కరిది ఒక్కో ఇంట్రెస్ట్ కాని చాల జాగ్రత్తగా వుండాలని అర్ధం అయ్యింది .
@బాస్కర రామిరెడ్డి
మీరు భలే చెప్తారు :) స్వాతి పత్రికవాడు కనుక నేలరోజులముందే ప్రముఖ రచయితా సీరియల్ త్వరలో అన్నట్లు ...చిన్ని త్వరలో ....అని అనాలన్న మాట:) సరదాకి .
@మధురవాణి
నిజంగా నిజం డ్రైవెర్ విషయం లో జాగ్రత్తగా వుండాలండీ