ఎదురు చూసినంత సేపు పట్టలేదు నీ నిష్క్రమణం .మరల అవే చూపులు ...అవే తలపులు మన పునస్సమగం కోసం .
నా నుంచి నీవు ఎప్పటికి వేరుకావని ఒకప్పుడు బ్రమపడ్డాను...మన యెడబాటుతాత్కాలికం అనుకున్నా ...కాని అదే మన ఇద్దరి మద్య దూరానికి నాంది అని తెలుసుకున్నా...
మొదటిసారి నన్ను వీడివెళ్ళినప్పుడు నీ బేల చూపులు నా మనో ఫలకం ముద్రితమై అనుక్షణం తడిమి తడిమి చూసుకుంటుంది నా చిన్ని హృదయం ...ఇప్పుడు అవే ...ఆ అందమయిన కళ్ళలో యెన్నిమూగ భావాలో ....బంగారం ...యేమి చెప్పాలనుకున్నావురా ?...నను వదిలి వెళ్ళడం భాధగా వుందనా?....నేను వుండలేక పోతున్నాను అనా!అంత పాషాణంలా తయారయ్యేనాని కినుకా ! నీ చూపుకు అర్ధం యేమని వెదుక్కొనురా కన్నా ...?పెదవి ధాటి పలుకలేని నీ మౌనం నా మదిని ఎప్పుడో తట్టిలేపిందిరా చిన్నా ...నీకు తెలుసు ..........
,నిన్ను తలచినంతనే నేనొక పులుగై నిన్ను వీక్షించగాలనని .
నిన్ను గాంచినంతనే నా మనస్సోక నాట్య మయురమవునని
నిను తాకినంతనే నా తనువెల్ల కడలి తరంగమని
నీ యెడబాటు నా మనస్సుకు తడబాటేనని............అయిన నా మనస్సు తలుపులు మూసివేసి మన కలయిక కోసం ఎదురుచూస్తుంటాను ....ప్రియా
.!
23, ఆగస్టు 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్లు:
బాగుందండీ... చక్కని ఫ్లో తో రాశారు. ఇలాగే కొనసాగించండి...
చిన్నిగారు,
చాలా బాగా రాసి మా మనస్సులో ఆర్ధ్రత నింపేశారు.
చక్కని పదాలు వాడి భాచోద్వేగానికి నిండుదనం తెచ్చారు.
ఎదురుచూపులనేవి నిజంగా ఎవరి మనసునైనా తెగ భాదిస్తాయండీ. నా అంచనా నిజమైతే మీ చిన్నారి వినాయక చవితి సెలవులకి వచ్చి, తిరిగి వెళుతున్నప్పుడు మీ ఎదురుచూపులు కదా ఇవి.
ఎందుకో అలా అనిపించిందండీ.
@sekar
-:) "s"
చాలా బావుందండీ ...మీ టపాల్లో ఇంత భావావేశం మొదటిసారనుకుంటా?
@మురళి
@శేఖర్
పిచ్చి ఆవేదనతో రాసేసిన పిచ్చి రాతల్ని అభినందించినందుకు ధన్యవాదములు .
@పరిమళం
మనలో భావావేశాలు లాటి కళలు మెండుగానే వుంటాయ్...ఇక్కడ బ్లాగ్ లో వ్యక్తపరిచే బదులు వ్యక్తపరచాల్సిన వారి దగ్గరే వ్యక్తపరిస్తేనే మంచిదేమోనని నా ఆలోచన ....పరిహాసానికి గురికాకుండా వుంటాయేమో -:).....నా ఆవేదన నచ్చినందుకు ధన్యవాదాలండి.
Eduru cUpulEla O manasaa, manasulOne vunTinE O mamataa..
తను మళ్ళా వచ్చేది ఎప్పుడో అని కేలండర్ లో డేట్ చూసుకున్నారు, కదా?
@భా.రా.రె
అలానే మనసులోనే వుంచుకుంటాను ...ఎదురుసూడ...మీరు సెలవిచ్చినట్టు .
@ఉమా
లేదండీ కాలేన్దర్ చూడను ....అస్సలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి