4, డిసెంబర్ 2009, శుక్రవారం

వన్నె తగ్గిన"వంశి" కథలు

'పసలపూడి కథలు'నాకు చాల ఇష్టం .చాలావరకు వంశి కథలు మిస్ కాను .చదువుతున్నంతసేపు అక్కడ విహరింప చేసేట్లుంటాయి అతని కథలు .వంశి కథలు యెంతఇష్టం అంటే రావులపాలెం మీదనుండి కాకినాడ వెళ్తుంటే 'పసలపూడి 'దగ్గర కార్ ఆపేసి వంశి రాసినవన్నీ తలుచుకుంటూ ...ఈ వంతెన మీద కాలక్షేపం చేసుంటారు ,ఇక్కడ హోటల్లో పుల్లట్లు తిని ఉంటాడు అని సరదాగా ,ఒకింత అభిమానం తో తలుచుకునే దాన్ని..
ఇటీవల వంశి కి ఏమైందో అర్ధం కావడం లేదు తన రాతల్లో చాల మార్పు వచ్చింది ..స్వాతిలో తన కథలు 'మాదిగువ గోదావరి కథలు ' పేరిట వస్తున్నాయి ..చాలవరకి నాణ్యత లోపించి ఉంటున్నాయి.ఈరోజు స్వాతి లో తను రాసిన కథ చదివితే నిజంగా వంశి రాసిందేనా అన్న సందేహం వచ్చింది.తన భాష ప్రయోగం ప్చ్...పోయిన వారం నా మిత్రునితో ఇదే విషయం చర్చకి వచ్చినపుడు తను కూడా విచారం వ్యక్తం చేసాడు ..దిగువ గోదావరి కథలు చదవడమే మానేసానని చెప్పాడు ...'ఇప్పుడే వస్తానందిశకుంతల'రచయితా స్వానుభవం , ఇదే ఒకప్పుడైతే చాల చక్కగా అల్లి మనల్ని అక్కడికి తీసుకెళ్ళి పోయేవారు ..కాని ఇప్పుడు ?బహుశ మనస్సు పెట్టి రాయడం లేదో లేక తన పేరుతో వేరెవరైనా రాస్తున్నారా అన్న సందేహం పొడసూపక మానదు ..ఏమైనా వంశి ఆలోచించాల్సిన విషయమే .

14 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

కథల సంగతేమో కానీ (ఆయన కథలు నేనెప్పుడూ చదవలేదు) సినిమాల విషయంలో మాత్రం వంశీకి లేనిపోని హైప్ ఇచ్చి ఆకాశానికెత్తేశారని అనిపిస్తుంది. అతను బాగా తీసినవి నాలుగైదు సినిమాలు మాత్రమే. మిగతావన్నీ సోది. లేడీస్ టైలర్ ఏ ముహూర్తాన హిట్టయిందో కానీ, అప్పట్నుండీ ఓ కథంటూ లేకుండా పాతికో పరకో కుళ్లు జోకుల్తో సినిమాని లాగించేసే ప్రయత్నాలే ఇప్పటికీ. అక్రమ సంబంధాల గురించిన చీప్ కామెడీ ట్రాకుల్తో సినిమాని నింపేసేవాడికి భావుకుడనే బిరుదొకటి!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నిగారు ఈ మధ్యనే కవ(రచ)యిత్రి అవతారమెత్తారంట కదా అందుకని, యువతకు పగ్గాలిచ్చేసి అలా వ్రాసుకుంటున్నారంట :)

Hima bindu చెప్పారు...

@అబ్రకదబ్ర
నాకు సినిమాల గురించి తక్కువ తెలుసండీ,కథల్లో కూడా అదే సబ్జెక్ట్ వుంటుంది కాని చదవదగ్గట్లు ఉంటాయి,దాదాపుతనచుట్టు వున్నా ప్రపంచాన్నే కథ వస్తువుగా వాడుకుంటారు.ఈ మద్య కాలం లో రాస్తున్నవిఅశ్లీల సాహిత్య జాబితాల్లో చేరే స్థాయికి దిగాజారుతున్దేమోనని ఆలోచన వస్తుంది .వంశి 'భావుకుడే '...గోదారి అందాలు అతని రచనల్లో చూడొచ్చు .
@భా.రా.రె
హు ...యువత కి పగ్గాల ?అసలే మనం తెలుగులో వీకు సంధులు ,సమాసాలే రావాయే ....ఇక రచయిత్రి అవతారమే తక్కువ ...ఏదో సర్కారోల్లకి కూలి చేసుకుంటూ ఇలా బ్లాగులు చూసుకుంటూ బ్రతుకుతున్నాం -:(

Sandeep P చెప్పారు...

నేను పసలపూడి కథల్లో చాలావరకు చదివాను. నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. ఈ "మా దిగువ గోదారి కథల" సంగతి నాకు తెలియదు. ఐతే వంశీ చిత్రాలలో మాత్రం ఆ ఒరిజినాలిటీ ఎప్పుడో కనబడటం మానేసింది. కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్, సితార, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, జోకర్ లాంటి సినిమాలు రావడంలేదు అసలు. ప్చ్...

రఘు చెప్పారు...

అబ్రకదబ్ర గారు వంశీ గారి కథలు ఒకసారి చదివి అప్పుడు మి అభిప్రాయం చెప్పండి. చిన్నికృష్టుడు బుల్లినోరు తెరిచి యశోదమ్మకి విశ్వాన్నంత చూపించినట్టు, వంశీ గారు చిన్ని చిన్ని కథల్లోనే మానవ నైజాల్ని అలవోకగా చూపించేస్తారు. వందలాది స్త్రీపురుషుల మద్య సాదారణ జనం మద్య పుణ్యపురుషుల్ని మహమానవుల్ని అన్వేషిస్తూ వారిని నిలువెత్తు చిత్రపటాలతో ప్రతిష్టించాడు కథల్లో. కొన్ని వందల గొప్ప కథల్లొ కొన్ని మనక
నచ్చకపోవచ్చు.గొప్ప కళాఖండాలలోను లోపాలు ఉండవచ్చు ఇదికూడా అంతే.

శిశిర చెప్పారు...

"గోపీ...గోపీకా...గోదావరి" సినిమా చూసిన తరువాత వంశీ మీద ఇంకా ఏ మూలనోవున్న అభిమానం కాస్తా తుడిచిపెట్టుకుపోయిందండి. మీరు చెప్పినట్టు ఆ కధలు వంశీ రాస్తున్నవేనా అన్న సందేహం నాకూ ఉంది.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

వంశీ మీద భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే...నేను ఆయన రాసిన కధలు చదవలేదుగానీ ఆయన సినిమాలు మాత్రం(కొన్ని తప్పించి)అంత క్వాలిటీతో కనపడవు. ఒకవేళ మీరన్నట్టు ఆయన చుట్టు ప్రక్కల ప్రపంచాన్నే కధా వస్తువుగా తీసుకుంటాడన్నా అందులో ఈ అక్రమ సంభందాల వైపు ఎందుకు హాస్యాన్ని అల్లుకుంటాడో అర్ధంకాని విషయం. ఇంచుమించు ప్రతీ సినిమాలో ఈ కాన్సెప్ట్ మీద కొన్ని కామెడీ ట్రాక్స్ ఉంటాయి. అయితే గోదావరి అందాలు,ఆ చుట్టు ప్రక్కల మనుషుల స్వభావాలు, మేనరిజమ్స్ వంశీ పట్టుక్కున్నంత ఒడుపుగా మిగిలినవారు చేయలేరనే చెప్పొచ్చు.

మురళి చెప్పారు...

వంశీ గురించి ఇలా చదవాల్సి రావడం బాధగా ఉంది.. ఒక మంచి సినిమా తీసిన తర్వాత వరుసగా నాలుగైదు చెత్త సినిమాలు తీసినట్టే, కొన్ని మంచి కథల తర్వాత ఇప్పుడు చెత్త కథల వంతేమో.. 'మా పసలపూడి కథలు' లో కూడా తన అనుభవాలు కొన్నింటిని కథలుగా మలచాడు.. మీరు చెప్పినట్టుగా అవి కొంతమేరకు హద్దులలోనే ఉన్నాయి.. 'పసలపూడి' కన్నా 'ఆనాటి వానచినుకులు' లో రాసిన కథలు చక్కగా, చిక్కగా ఉంటాయి. ఏదేమైనా వంశీ కొన్నాళ్ళ పాటు తన కలానికి విరామం ప్రకటిస్తే మంచిదేమో అనిపిస్తోంది, ఇప్పుడు వస్తున్న కథలు చదువుతుంటే.. వంశీ కి టాలెంట్ ఉంది..లేకపోతె పాతికేళ్ళ వయసులో 'సితార' లాంటి సినిమా తీయగలిగి ఉండేవాడు కాదు.. కానీ ఆ టాలెంట్ ని తను సరిగ్గా ఉపయోగించుకోడం లేదు.. ఒక విజయం రాగానే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఆలోచించడం తనకి మొదటినుంచీ అలవాటే..

అజ్ఞాత చెప్పారు...

వంశీ మొదట్లో సితార, అన్వేషణ, మంచుపల్లకి లాంటి మంచి సినిమాలే తీసాడు. ఎంతైనా విశ్వనాథ్ దగ్గర పనిచేసినవాడు కదా.
లేడీస్ టైలర్ హిట్టవ్వడంతో ట్రెండ్ మార్చాడు. తరువాత కనకమహాలక్ష్మి, ఏప్రిల్ ఒకటి విడుదల లాంటి మొరటు హాస్యం సినిమాలే వచ్చాయి.
వీటిలో కొంత సహజత్వం ఉన్నా కొంత అసభ్యత కూడా ఉంది.
లేడీస్ టైలర్ హిందీలో రాజ్ పాల్ యాదవ్ తో తీస్తే ఫ్లాప్ అయ్యింది. అక్కడ వాళ్ళు దాన్ని బి గ్రేడ్ సినిమాగానే చూసారు.
అంతకుముందు మరాఠీలో కూడా తీసారు. హిట్టయిందో లేదో నాకు తెలీదు.
ఇప్పటి ట్రెండుకి తగ్గ సినిమాలు ఆయన తీయలేకపోవచ్చు.

మరువం ఉష చెప్పారు...

ఏమిటో చిన్ని, ఎవరికైనా ఈ దిశ తప్పదేమో - ఒకసారి నిండు పున్నమిబోలిన కళా కౌశలత. తిరిగి తిరోగమనం. ఇప్పుడే సి.నా.రె. గారిని కూడా విమర్శించిన ఒక బ్లాగు చూసి వస్తున్నాను. ఆర్థ్రత, అనుభూతి కూడా మరణిస్తాయా? అభిరుచి కూడా సెలవంటుందా... ప్చ్.. నా భావి నాకు తెలుసుకోవాలని లేదు.

Hima bindu చెప్పారు...

@సందీప్
మీరు స్వాతి వారపత్రిక కి రెగ్యులర్ రీడర్ అయితే కనుక 'దిగువ గోదావరి కథలు 'మిస్ కారు .చదివేట్లు వుండటం లేదు ,అల అని అన్ని కథలు ఇంతే అనడం లేదు.
@రఘు
మీరన్నట్లు గొప్ప కళాఖండాలకి లోపాలు వుండోచ్చు,ఇది ఒక్క కథకే పరిమితం కావడం లేదు స్థాయి దిగజారుతుందని ఆవేదన .
@శిశిర
నాకు గోపి గోపిక గోదావరి నచ్చలేదు హాస్యం చెత్తగా వున్నట్లు గుర్తు ...పాటలు ఒకటి రెండు పర్లేదు
@శేఖర్
వంశి చిన్నతనం నుండి అలాటి సంభందాలున్న వాతావరణం లో పెరిగాడు ....నాకేల తెలుసు అంటారా -:) పసలపూడి కథలు చెప్పాయి ...కుమారి మా ఊరొచ్చింది కథలో మనకి కొంచెం అర్ధం అవుతుంది :)ఏమైనా మంచి రచయిత...ఒప్పుకోవాల్సిందే .

Hima bindu చెప్పారు...

@మురళి
అదేకదండీ నా భాద.నాటి పసలపుడికి ,ఆనాటి వాన చినుకులకి ....ఇప్పటి దిగువ గోదావరికి చాల వ్యత్యాసం వుందండీ ...తన కథలన్నీ భిగువుగా మొదలెట్టి చివరికొచ్చేసరికి గబగబా తేల్చేస్తాడు అదొక్కటి తప్పించి ఎలాటిది అయిన చదివేట్టు రాయడం తన కళ-:)
@బోనగిరి
ధన్యవాదాలు
@ఉష
ఆర్ద్రత,అనుభూతి మరణించక పోవచ్చుకాని ప్రాదాన్యతలు తగ్గోచ్చేమో (పూర్తిగా పెద్దోల్లం అయ్యాక )....అభిరుచికి ఓపిక తగ్గుతుందేమో -:)

సుజాత వేల్పూరి చెప్పారు...

వంశీ "ఆనాటి వాన చినుకులు" కథలో ఒక డైరెక్టర్ పాత్ర ఉంటుంది. అది అచ్చం వంశీలాగే ఉంటుంది. వంశీ లాంటి భావుకులు(ఇది సరైన పదమో కాదో)మూడ్ ని బట్టి Over confidence తో సినిమాలు తీయడం, అవి పేలిపోవడం మామూలే! అందుకే వంశీ అన్ని సినిమాలూ బాగోవు. ఇదే మాట వంశీ తన కథలోని పాత్ర బాచి చేత కూడా ఒక కథలో చెప్పిస్తాడు.

పసలపూడి కథలు, ఆనాటి వానచినుకులు అల్టిమేట్ గా ఉంటాయి. రవ్వలకొండ వగైరాలు కొన్ని బాగోవు.

చిన్ని గారు చెప్పినట్లు దిగువ గోదావరి కథల స్థాయి అంతగా బాలేదనే నాకూ అనిపించింది.

పైగా వంశీ గోదావరి, గోదావరి జిల్లాల మనుషులు (కంప్లెయింట్ కాదు..)లేకుండా కథలు సృష్టించలేకుండా ఉన్నాడు ఈ మధ్య! అందువల్ల మరీ మొనాటనీ ఎక్కువైపోయినట్లనిపిస్తోంది.

Hima bindu చెప్పారు...

@సుజాత
నిజమే ఎటు చూసిన గోదారే...నాకైతే భలే జలసీగా వుంటాది,మనుష్యులను చూసి కాదు ఆ ప్రాంతాన్ని చూసి,అందుకేనేమో విసుగనిపించదు