6, డిసెంబర్ 2009, ఆదివారం

కొత్తపాళీ పుస్తకావిష్కరణ "రంగుటద్దాల కిటికీ " ఎలా జరిగిందంటే .....

బ్లాగ్ లో కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ ఆహ్వానం చూసి వెళ్లాలని ముచ్చటపడ్డాను,అనుకున్నాను అంటే కచ్చితంగా అయ్యి తీరాల్సిందే .నా మిత్రుల్ని అడిగాను వస్తారేమోనని కాని తనకి వీలుపడలేదు .సరే ఒక్కదాన్నే వెళ్ళటమా అని ఆలోచించే లోపు మా పాప ,చెల్లి పాప నాతో దగ్గరలో వున్నా లేపాక్షి ఎక్సిబిషన్ చూస్తానంటూ నా వెనుక పిల్లి పిల్లల్లా వచ్చారు.మొత్తానికి వెదుక్కుంటూ స్వాతంత్ర సమరయోధుల భవనం పట్టుకున్నాం కచ్చితంగా ఐదు గంటల పది నిమిషాలకి అక్కడ చేరాను అక్కడే నాకో మిత్రురాలు కలిసారు పైన సభా కార్యక్రమాలు మొదలు కాలేదని చెప్పారు ,క్రింద సమరయోధులు శ్రీ వామనరావు,పట్టాభి పిచ్చాపాటి కబుర్లలో వున్నారు ,వాళ్ళ కబుర్లు వింటూ మేము కాసేపు గడిపాక కార్యక్రమం మొదలవ్వబోతుంది అని కబురోచ్చాక పైకి వెళ్ళగానే మెట్ల మీదే గుమ్మా సాంబ శివరావు గారు ,ఆచార్య సిమ్మన్న గారు ,పూర్ణచంద్ గారు ఇంకొంత మంది రచయితలూ కనబడిపలకరింపులు నవ్వులు పువ్వులు తో కొంతసేపు కబుర్లతో గడిపాము , కొత్తపాళీ గారు బిజీగా పుస్తకాలు సర్దుకుంటున్నారు ఆయనను నెట్ లో చూడటం వలన గుర్తుపట్టాను.మొత్తానికి అనుకున్న సమయంకంటే ఒకింత ఆలస్యంగా ప్రారంభం అయ్యింది .
మొదట పుస్తకావిష్కరణ జరిపాక అతిధులు పుస్తకం గురించి పరిచయం చేసారు ,వంశి కృష్ణ గారు చాలా వివరంగా క్లుప్తంగా చాల చక్కగా చెప్పారు ,సత్యవతిగారు చేసిన పరిచయం ఆకట్టుకోలేదు .స్పెషల్ గ్రేడ్ డిప్యుటీకలెక్టర్ ముఖ్య అతిధిగా వచ్చిన చెప్పిన రెండు ముక్కలు వినదగినట్లే వున్నాయి గంట పైన సాగిన ఈ కార్యక్రమానికి చాల మంది రచయితలూ పత్రికాధిపతులు వచ్చారు ,సాధారణంగా ఇటువంటి సమావేశాలకు తక్కువమంది వస్తుంటారు ,అదే సమయంలో తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఘంటసాల విగ్రహావిష్కరణ వున్నా ఇక్కడ చూసుకుని అటు వెళ్ళిన వారు వున్నారు..సభ నిండుగానే వుందని చెప్పొచ్చు .
చివరిగా కొత్తపాళిగారు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేసారు .ఒకరు చెన్నై నుండి వచ్చిన భైరవబట్ల కామేశ్వర రావు గారు,ఇంకొకరుఎస్ .అర్ర్ .రావు గారు,విజయవాడ...అంత దూరం నుండి వచ్చిన కామేశ్వరరావు గార్ని చూస్తె ముచ్చట అన్పించింది .
కొత్తపాళిగారు తన సంతకం తో కూడిన పుస్తకం విచ్చేసిన అతిదులందరికి బహుకరించారు ,పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ వందన సమర్పణ చేసారు,తరువాత ఇష్టాగోష్టి అన్నారు కాని నాకూడా పిల్లిపిల్లలు క్రింద ఎదురుచూస్తూ ఫోన్స్ మీద ఫోన్ చేయడం వలన నేను చివరివరకు ఉండలేకపోయాను...కొత్తపాళీ గారి దగ్గరికి వెళ్లి పుస్తకం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పి నాఅసలు పేరు తో పరిచయం చేసుకున్నాను.అన్నట్లు ఎక్కడో మూల నవ్వులాట శ్రీకాంత్ గార్ని చూసాను.....ఇంతకి కొత్తపాళీ గారికి నేనెవరో చెప్పలేదు .-:)

20 కామెంట్‌లు:

teresa చెప్పారు...

haaaa!! nEnoo vacchaagaa!!

మరువం ఉష చెప్పారు...

చిన్ని, మనమెలా మిస్సయ్యాము. ఆ తొక్కిసలాటలో తోపిడిలో నా పిలుపు నీకు వినపడలేదు. బాడ్ గాల్.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మరి అయితే ఆలస్యం చెయ్యకుండా ఒక్కొక్క కధనూ చదివి మాకూ పరిచయం చేయండి...

sunita చెప్పారు...

teresa ma'am, maaku telusu meeru akkaDa unTaarani.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీనా మజాకా నా... ఏమి ట్విస్ట్ ఇచ్చారండీ. ఇంతకీ మీ అసలు పేరు చెప్పిన తరువాత కొత్తపాళీ గారికి కనీసం అనుమానమైనా రాలేదా? :-)

నిషిగంధ చెప్పారు...

చిన్ని గారు, పుస్తకావిష్కరణ విశేషాలు బాగా చెప్పారండి.. అయితే మీదీ అదే ఊరన్నమాట! ఈసారి అటేపొచ్చినప్పుడు తప్పక కలవాలి మిమ్మల్ని.. నా బదులు నా ప్రతినిధి ఒకరు హాజరయ్యారు ఆ సభకి :-)

కొత్త పాళీ చెప్పారు...

పర్లేదులేండి, మా దగ్గర ఫొటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది :)
వచ్చినందుకు చాలా చాలా సంతోషం.
ఇంతకీ లేపాక్షి షోలో ఏం కొన్నారు?

cbrao చెప్పారు...

"రంగుటద్దాల కిటికీ " లోంచి చూస్తుంటే ప్రపంచం ఎలా కనిపించింది? కొత్తపాళీ కధలు ఎలా ఉన్నాయి? హైదరాబాదులో ఎక్కడ లభ్యమవుతుంది? ఇక్కడ చాలా ఆందోళనకర పరిస్థితులలో ఉన్న సమయంలో,ఈ పుస్తకావిష్కరణ జరిగింది. నేను విజయవాడ వచ్చుంటే వెనక్కు మాఊరు వెళ్లటం దుర్లభమయిన విచిత్ర పరిస్థితి. బస్సులన్నీ రద్దయ్యాయి, తెలంగాణా ఉద్యమం వలన.

తృష్ణ చెప్పారు...

కుదరక రాలేదు కానీ వచ్చి ఉంటే మిమ్మల్ని కలిసేదాన్నన్నమాట...just miss..:)

జయ చెప్పారు...

చిన్ని గారు అభినందనలు. "నా కనులు నీవిగా చేసికొని చూడు" అని, అన్ని వివరాలు చెప్పారు. థాంక్స్.

జ్యోతి చెప్పారు...

హిమబిందుగారు,
నేను కూడా వచ్చాను. అప్పుడే మీరు వెళ్లిపోతున్నారు.నేను చూసానులెండి..

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

మేము రాలేక పోయాము. :(

ఆ కథలెలా ఉన్నాయొ కాస్త పరిచయం చేయండి.

Hima bindu చెప్పారు...

@తెరెసా
కొత్తపాళీ గారి కలం లో సిరా ,ధమనుల్లో రక్తం ,వారి గుండె చప్పుడు మీరైనందుకు అభినందనలు అందుకోండి.
మీరు వస్తారని తెలీదండీ ,తెలిసినట్లయితే మీకోసం వెదుక్కునేదాన్ని-:(
@ఉష
అయ్యో ఆ తొక్కిసలాటలో ఇరుక్కుపోయింది మీరేనా ...ప్చ్ కేకలు వినిపించాయి కాని మనల్ని కాదులే అని వచ్చేసా -:)
@శేఖర్
మొదలుపెట్టాను కాని వాటిని పరిచయం చేసేంత టాలెంట్ మన దగ్గర లేదేమో .
@సునీత
దన్యవాదములు మాకు తెలీని విషయం చెప్పినందుకు

Hima bindu చెప్పారు...

@భా .రా.రె
హబ్బే ఆయన కొంచెం ఉద్వేగంతో వున్నారు(వక్తల ప్రసంగాలు అక్కడ హడావిడి వలన ) ,నేనేం మాట్లాడానో ఆయనకీ అర్ధం కూడా అయ్యుండదు -:)
@నిషిగంధ
ధన్యవాదాలండీ ..అదేమీ సొంతూరు కాదండీ -:) నేను పని చేసే పరిధిలోకి ఈ జిల్లా కూడా వస్తుంది ..అదీ చుట్టరికం ...ఎనీ హౌ మీరు ఇండియా వచ్చినపుడు ఇటు వస్తే తప్పకుండ కలుద్దామండీ
@కొత్తపాళీ
హుమ్మ్ !..లేపాక్షి లో జూట్ బాగ్స్ తీసుకున్నారండి
@సి.బి.రావు
రంగుటద్దాల కిటికీ లోనుండి చుస్తే ప్రపంచం థ్రిల్లింగ్ గా వుందండీ .:) ఇప్పుడిప్పుడే మొదలెట్టాను చదవడం ,హైదరాబాద్ లో ఎక్కడో తెలీదండీ కనుక్కుంటాను ...నిజమే మీరు వచ్చి వుంటే ఇబ్బంది పడేవారు .
@తృష్ణ
మీరు వచ్చి ఉంటారని ఎందుకో నాకు అనిపించిన్దండీ ..రాలేదా ,వచ్చిన గుర్తుపట్టేవారు కాదు నన్ను
@జయ
దన్యవాదములు :)
@జ్యోతి
హ హ ...మీరేమి రాలేదు వస్తే కొత్తపాళీ గారు మిమ్మల్ని పరిచయం చేయకుండా వుండరు ..
@విశ్వప్రేమికుడు
ఈ తెలంగాణా విషయం లేకపోతె చాలామంది వచ్చేవారేమో ,తప్పకుండ ట్రై చేస్తానండి..నాకంటే ముందే ఎవరొకరు చేస్తారేమో కూడా . .

అజ్ఞాత చెప్పారు...

చిన్ని గారు ఓ మంచి కార్యక్రమానికి హాజరయ్యరన్న మాట :)
నేనెప్పుడు ఇలా పుస్తక ఆవిష్కరణలకి వెళ్తానో ఏంటో ఆ అదృష్టం కలుగుతుందో లేదో :(...
ఈ పాడు చదువులు ఎప్పుడై పోతాయో ఏంటో :(

cartheek చెప్పారు...

చిన్ని గారు ఓ మంచి కార్యక్రమానికి హాజరయ్యరన్న మాట :)
నేనెప్పుడు ఇలా పుస్తక ఆవిష్కరణలకి వెళ్తానో ఏంటో ఆ అదృష్టం కలుగుతుందో లేదో :(...
ఈ పాడు చదువులు ఎప్పుడై పోతాయో ఏంటో :(

Hima bindu చెప్పారు...

@కార్తిక్
నిజానికి చదుకునేప్పుడే వెసులుబాటు అనుకుంటాను (స్వానుభవం )ఉద్యోగాల్లో వున్నప్పుడు సమయం మన చేతిలో వుండటం తక్కువ .మరి త్వరగా చదివేసి సెటిల్ అయిపోండి:)

మాలా కుమార్ చెప్పారు...

మంచి ప్రోగ్రాం చూసారన్నమాట . అభినందనలు .
ఆ పుస్తకము నాకు దొరికి , నేను చదువుతే సరే , లేకపో మీ కాపీ తీసేసుకుంటాను . తొందర గా చదివేయండి మరి .

SRRao చెప్పారు...

చిన్ని గారూ !
చాలా ఆలస్యంగా మీ టపా చూసాను. సమయాభావం వలన కుదరలేదు. జయ గారి టపా ద్వారా తెలిసి చూసాను. సమీక్ష బాగా రాసారు. మీరు రాసారని తెలియక నేను అనవసరంగా కష్టపడ్డాను. కానీ మాకు మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వకపోవడం చాలా అన్యాయం. అయినా ఈ ఊరే అని తెలిసిందిగా ! ఎప్పుడో కలవకపోంలెండి.

Hima bindu చెప్పారు...

@మాలాకుమార్
దన్యవాదములు ,నేను చదవగానే పోస్ట్ చేసేదా ?మరి అడ్రెస్స్ ఇచ్చేయండీ -:)
@ఎస్స్ .ఆర్.రావు
కొత్తపాళీ గారు పరిచయం చేయక ముందే మిమ్మల్ని ,శ్రీకాంత్ గార్ని గుర్తుపట్టాను ,ఫొటోస్ చూడటం వలన .
మీరు రాసింది విపులంగా వుందండీ ,వారి తల్లిగారి స్నేహితురాలు స్పీచ్ మున్నగునవి ..నన్ను చూడకుండా వుండివుండరు :)