10, డిసెంబర్ 2009, గురువారం

"మేము ఎవ్వరికీ వద్దంటా"

అటేమో తెలంగాణాహైదరాబాద్ తో సహా అధిష్టానం ఇచ్చేస్తుంటే 'రాయలసీమోళ్ళు'నెల్లూరు ప్రకాశం కలిపి ప్రత్యేకం కావాలట ,మరిటేమోఉత్తరాంద్ర వాళ్లకు ఉభయగోదావరి జిల్లాలతో ప్రత్యేకం రాష్ట్రం కావాలట ,మరి మిగిలిపోయింది కృష్ణా గుంటూర్ వాళ్ళే .మేము ఎవరికి అక్కర్లేదంట-:)ఎట్టగబ్బ!

27 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

after getting separation from all guntur & vijawada will become one state.

I too from guntur and liked this concept

lakshmana చెప్పారు...

after getting seperate all the districts gutur & vijawada will be form as twin cities.

I am from bapatla and like this concept

Anil Dasari చెప్పారు...

ఈ రెండిట్నీ రెండు సెపరేట్ స్టేట్స్ చేస్తే పోద్ది.

అజ్ఞాత చెప్పారు...

ఎక్కడున్నా మనమే కనుక

అజ్ఞాత చెప్పారు...

జై గుంటూరు,జై క్రిష్ణ అని నిరాహార దీక్ష మీరూ చేయండి.నేను రంగు నీళ్ళు పట్టుకొస్తా

సిరిసిరిమువ్వ చెప్పారు...

:))

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

కృష్ణ-గుంటూరు జిల్లాలని కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తే సరి. ప్రత్యేక తెలంగాణా వల్ల మనకేమీ నష్టం లేదులెండి. మనలో ఎంత మంది హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించారు? హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన కొద్ది మంది భూస్వాముల కోసం మనం ప్రత్యేక తెలంగాణాని కాదనాలా?

సమైక్యవాది చెప్పారు...

@అబ్రకదబ్ర
ఊరికే ఎలా ఇచ్చేస్తామండీ! మన హైకమాండ్ నినాదం
ఎంటంటే
"నిరాహార దీక్ష చేసుకో ప్రత్యేక రాష్ట్రం పట్టుకుపో"
కాబట్టి ప్రత్యేక రాష్ట్రమంటే ఖచ్చితంగా నిరాహార దీక్ష చెయ్యాలి కానీ అందుకు ఆ ప్రజల మనోభావాలు వారికి అక్కర్లేదు.

జయ చెప్పారు...

చిన్ని గారు, అసలెందుకండి ఈ విభజనలు...సమైక్యతాంధ్రా...భిన్నత్వంలో ఏకత్వం...ఈ పదాలు ఎంత అందమైనవి...ఇవన్నీ ఇంక ఊహాలోకల్లోనేనా!

మాలా కుమార్ చెప్పారు...

పాపం గుంటూరు , కృష్ణ .
నేను పుట్టింది గుంటూరు లో . చదివింది వరంగల్ , నాగార్జునసాగర్ లో , పెళ్ళైనాక తిరిగింది , దేశమంతా , ప్రస్తుతము వుంది హైదరాబాద్ లో , నేనే రాస్ట్రానికి చెందుతాను చెప్మా ?

శరత్ కాలమ్ చెప్పారు...

మీ ప్రాంతాల తరఫున నేను నిరాహార దీక్ష చేస్తాలెండి.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

మీకు రెండు రాష్ట్రాలు, మాకు రెండు బాషలు. మాది ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ లో ఉన్న శ్రీకాకుళం జిల్లా. మా బంధువులలో కొంత మంది ఆంధ్రాలో, కొంత మంది ఒరిస్సాలో ఉన్నారు. నాకు తెలుగు వచ్చు, ఒరియా రాదు. మా అన్నయ్యకి తెలుగు, ఒరియా రెండూ వచ్చు. మా వదినకి ఒరియా వచ్చు, తెలుగు రాదు. తెలుగు రాష్ట్రం విడిపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదులెండి. నేనూ, మా బంధువులూ వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు బాషలు మాట్లాడుతూ ఉంటున్నాం కదా.

రాధిక(నాని ) చెప్పారు...

కంగారుపడకండి,ఉత్తరాంద్రాకాదు వస్తే కోస్తాంద్రా వస్తుంది.అప్పుడు మీ విజయవాడకాని, గుంటూరుకాని కేపిటలవుతుంది

rajan చెప్పారు...

ఏమోనండి....మన వాళ్ళు ప్రాంతాల కోసం మతాల కోసం కొట్టుకుంటున్నారు గాని...ముంచుకొస్తున్న గ్లోబల్ వార్మింగ్ గురించి కొంచెమైనా ఆలోచించడం లేదు

ఉమాశంకర్ చెప్పారు...

మన జోలికి ఎవరూ రాకపోతేనే ప్రశాంతంగా మన బతుకు మనం బతకొచ్చేమో , ఆ యాంగిల్ లో ఆలోచించండి మరి :)

Hima bindu చెప్పారు...

@అజ్ఞాత
@లక్ష్మణ
బాగుందండీ ఈ ఆలోచన
@అబ్రకదబ్ర
సేపరటేగా కంటే కనీసం కృష్ణా నీళ్ళు కలిసి తాగుతున్నందుకైన కలిసి వుంటే బాగుంటదేమో
@అజ్ఞాత
నీరహదీక్ష మాకు అవసరం లేదేమో ....మీ రంగు నీళ్ళు మాకొద్దు ,మా నల్ల నీళ్ళు చాలు
@సిరిసిరిమువ్వ
అభయం తో కూడిన నవ్వా,మీరు గుంటూరు కదూ ..
@ప్రవీణ్
ఆడ (ఐదరబాదు ) నాకో కేకుముక్క వుంది బాబయ్య ..దాన్ని అమ్మేసుకోమంతరేటి...ఆనక కొన్న రేటు కూడా రాదేమో .
@సమైక్యవాది
బాగుంది సలహా .
@మాలాకుమార్
ఫార్ములా ప్రకారం మన పదవ తరగతి చదివిన జిల్లా నిర్ణయిస్తారు ,ఎనిమిది ,తొమ్మిది ,పది లెక్కలోకి తీసుకుంటారు ,ఆ ప్రకారం సర్కారి కొలువులో వున్నోరికి నాలుగేళ్ల క్రితమే తీసేసుకున్నారు ,మనకి అ ఆ లు నేర్పింది
తెలంగాణానే పద్యాలూ నేర్పింది రాయలసీమ వెరసి పది రాసింది ప.గో.జి :):)

Hima bindu చెప్పారు...

@శరత్ కాలం
ఎందుకు మమ్మల్ని మీ సీమ లో కలుపుకోవడనికే(సీమేనా ?) హమ్మో మాకొద్దు :)
@ప్రవీణ్
ఎక్కడో చదివాను మీ అన్నగారు మీకు మీ వదిన గారికి దుభాషిగా వ్యవహరిస్తున్నారని .
@రాధిక
హబ్బే అంత అత్యాశ లేదండీ :)
@రాజన్
ఈ గ్లోబల్ వార్మింగ్ గట్ర బాగా అభివృద్ధి చెందిన దేశాలే ఆలోచిన్చాలనుకుంట ,ఇది అంతర్జాతీయ సమస్య కదూ ..పర్యావరణం నాశనం లో మన ఆంద్ర పాత్ర ఎక్కువంటార?
@ఉమా
నిజమేనండి .

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ మీరు మావాళ్ళండీ.;) వేరే ఎందుకు మాతో కలిసి వచ్చేయండి. ఏంచక్కా హాయిగా మనం మనం కలిసుండొచ్చు.

Hima bindu చెప్పారు...

@బా.రా.రె
-:) తెహి తంబె కాదుగా ..

@చెత్త రాసిన వ్యక్తికి
నీ కామెంటు పబ్లిష్ చేయడం లేదు .
చూడు నీ పేరు ఉచ్చరించడానికి కూడా మనస్కరించడం లేదు ,నీవు రాసిన మాటలన్నీ మీ ప్రదేశం లోని ఆడవారికే చెందుతాయి,ప్రతి అక్షరం మీవాళ్ళ ప్రతిబింబం ....మా క్రమశిక్షణ ,కష్టపడి పనిచేసే తత్వం ఉన్నత లక్ష్యం చాలు మా ప్రాంత అభివృద్దికి..నాగరికతకి మా ప్రాంతమే పుట్టినిల్లు .మా ప్రగతికి ఆకాశమే హద్దు ఎక్కడన్నా వెదుక్కో మా ప్రాంతం వాళ్ళే కనబడతారు.

cartheek చెప్పారు...

chinni akka

manaku prethyeka guntur kaavali...
ne mukya manthri meeru upa mukya manthri.. padandi munduku ..udyamam cheddam :) :)

పరిమళం చెప్పారు...

:( :(

Hima bindu చెప్పారు...

@కార్తిక్
తమ్ముడు ..చస్తే.నేను ఒప్పుకోను ...నేనే ముఖ్య మంత్రి నీవు ఉపముఖ్య మంత్రివి ..అయిన గుంటూరు ఒక్కటే యేంటి కోస్తా అంతా మనం చూసుకున్టేపోలా:) అన్నట్టు నీవు "తొలిఅడుగు బ్లాగ్ "కార్తీకేన ,ఇదేదో కొత్తగా
వుంది మీ బ్లాగ్ బదులు బైబిలు వాక్యాలు కనబడుతున్నాయి .-:)
@పరిమళం
ఏదో ఆవేశం లో భాదపడ్డాం :( ఇప్పుడు మా అన్నాయ్ నిరహారదీక్షకి కూర్చోబోతున్నాడు .. కథ ఎలా వుంటాదోచూడాలి .

మరువం ఉష చెప్పారు...

వద్దమ్మ వద్దు ఓ విజ్జీవాడ పిల్లో ఈ గోలలొద్దు
ముద్దమ్మ ముద్దు ఓ గుంటూర్ గువ్వా నీ పలుకులే ముద్దు :)

అవన్నీ వదిలేయ్ చిన్నీ, కాసేపు నాతో కలిసి నవ్వుకో మున్నీ!

జస్ట్ సరదాకే. ఈ బాధాకరమైన పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని కోరుకందాం.

Hima bindu చెప్పారు...

@ఉష
ఇది అంతం కాదు ఆరంభం లా వుంది కదా ,వద్దనుకున్న గొడవల్లోకి వురకాలనిపిస్తుంది :)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

రండి బాబూ రండి. రండి అమ్మలూ రండి. రండి అక్కలూ రండి. రండి అదేదో రండి. ఆలసించిన ఆశా భంగం. వచ్చి ఐక్యతా రాగాన్ని పాడండి. మా మార్తాండడు ఎక్కడున్నాడో వెతకండి.ఒక్క మార్తాండడు వుంటే చాలు ముద్దు, మీరెవ్వరూ వద్దు.;)

Hima bindu చెప్పారు...

భా.రా.రె
రండి బాబు రండి అమెరికాను వదిలిరండి
వదలండి బాబు వదలండి డబ్బాలను (మీ హోం మినిస్టర్ భాషలో ఇంకేదో అనుకుంటాను :))
పాడండి బాబు పాడండి సమైక్య గీతం ...మీవంతుగా ఉద్యమంలో సమిదికండి (కవిత్వం బాగుందా )

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

బ్రహ్మాండంగా వుంది కవిత్వం. ఒకమంచి కవిత వ్రాసేద్దురూ సమైక్య ఆంధ్రావని మీద.