10, మార్చి 2010, బుధవారం

యెదలో గానం ..



యెదలో గానం ..
..పెదవే మౌనం ...
సెలవన్నాయి కలలు.
..సెలయేరైన కనులలో
మెరిసేనిలా శ్రీరంగ కావేరి
సారంగా వర్ణాలలో...అలజడిలో
యెదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన
కనులలో మెరిసేనిలా శ్రీరంగ కావేరి
సారంగా వర్ణాలలో అలజడిలో .....

కట్టుకధ లాయే మమత కలవరింత
కాలమొకటే కలలకయినా పులకరింత
శిలకూడా చిగురించే విధి రామాయణం
విధికయినా విధి మార్చే కధప్రేమాయణం

మరువకుమా ..వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనస్సు కధ....
మరువకుమా ...వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనస్సు కధ .................

12 కామెంట్‌లు:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

కట్టుకధ లాయే మమత కలవరింత

ఈ వాక్యం నన్ను కట్టి పడేసింది. మీ కవితలు బాగున్నాయి.

Padmarpita చెప్పారు...

మీ కవితాగానామృతం బహుబాగు!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్నీ గారు, ఇది మీదేనా లేక మీ డైరీలో పాటా :)

Hima bindu చెప్పారు...

@కే క్యూబ్ వర్మ
అయ్యో ఇది 'ఆనంద్' సినిమా లో పాటండి .ధన్యవదాలు .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నాకు ఈ పాటంటే చాలా ఇస్టం...సినిమాలో సందర్భానికి తగ్గట్టు ఎమోషన్ని ఎలివేట్ చేయటంలో తన వంతు పాత్ర ఈ పాట సమర్దవంతంగా పోషిస్తుంది. హేట్సాఫ్ టు వేటూరి సర్...
మంచి పాటని గుర్తుచేసారండి...

సృజన చెప్పారు...

మంచి పాటను గుర్తుచేసారు.

మురళి చెప్పారు...

నాకు ఈ పాటలో 'శ్రీ గౌరీ చిగురించే సిగ్గులన్నీ..' లైన్స్ చాలా ఇష్టం అండీ.. గానం, చిత్రీకరణ రెండూ బాగుంటాయి.. అవి కూడా రాయాల్సింది కదా..

Hima bindu చెప్పారు...

@పద్మర్పిత
షుక్రియ -:):)
@భా.రా.రె
ఇది డైరీలో అచ్చంగా నిన్నటి నా పేజి .
@శేఖర్
అవునండీ .
నాకు చాల చాల ఇష్టం తరచూ వినే పాటల్లో ఇదొక్కటి .
@సృజన
థాంక్యూ -:)
@మురళి
అంతవరకే చాలు అన్పించిందండీ..సరే మీ కోరిక ఎందుకు కాదనాలి పాడుకోండి -:)
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులు ఎగసిన ఊసులు
మూగే మనసులో అవి మూగవై
తడి తడి వయ్యరలయ్యి
ప్రియ ప్రియ ..అన్నవి ..-:):):)......చివరి లైన్ సరిగ్గా రాదు ....

కొత్త పాళీ చెప్పారు...

మంచి పాట. సాహిత్యమూ, సంగీతమూ పరస్పరం చక్కగా అమరినాయి. ఆ పాడినవాడీ గొంతు తప్ప :)

Hima bindu చెప్పారు...

@కొత్తపాళీ
అవునా !మరి నాకు బానే వుంటుందండీ,చాల ఇష్టమైన పాట:)

పరిమళం చెప్పారు...

మంచిపాట.... అందమైన చిత్రీకరణ కూడా

స్రవంతి చెప్పారు...

నాకు చాలా ఇష్టం ఆనంద్ లో పాటలన్నీ, ఆ ఒక్క సినిమా తోనే శేఖర్ కమ్ముల నా అభిమాన దర్శకుడు అయిపోయారు.