ఎప్పుడోగాని మేము అంతా కలవడం ఒక్కసారె కలవడం అవ్వదు అదేమిటో ప్రతీసారి ఒక్కరు మిస్ అవుతారు ఈసారి చిన్న చెల్లి మిస్సింగ్ .నాలుగు రోజులనుంచి అంతా కలిసి అమ్మ దగ్గర చిన్నపిల్లలం అయ్యాం.చిన్నతనం లో మేము ఆరుగురం అమ్మ ఎక్కడ వుంటే అక్కడ చేరేవాళ్ళం,అమ్మ ఒడిలో ఒకరు వీపు మీద ఒకరు చాపిన కాళ్ళ మీద తలోకరం పడుకుని అమ్మ చెప్పే కథలు కల్పనలు వూ కొడుతూ ఊహల్లో ఊహించుకుంటూ వినేవాళ్ళం .కొంచెం పెద్దయ్యాక వంట గదిలో వుంటే తన వెనుకే చేరి వింతలో విశేషాలో స్కూలు కబుర్లో చెప్పేవాళ్ళం,అమ్మ పెరట్లో మొక్కలతో వుంటే ఆ వెనుకే గడ్డిపీకుతోనో ,గొప్పులు త్రవ్వుతునో అమ్మ ఆనందం లో పాలుపంచుకునేవాళ్ళం.రాత్రి పూట మా అందరకి అన్నం కలిపి తినిపించి వరండాలో నాన్న కోసం ఎదురుచూస్తున్న అమ్మ చుట్టూ చేరి అమ్మ చిన్నతనం ముచ్చట్లు అమ్మమ్మ వాళ్ళ విశేషాలు అడిగి అడిగి చెప్పించుకుని వినేవాళ్ళం.పెద్ద అయ్యాక ఏమైనా మారామాఅంటే ఉహు ..ఇప్పటికి అదే సీను కాకపొతే మా ఆరుగురికి తోడు మా జూనియర్లు తోడయ్యారు.ప్రపంచంలోని వింతలు విశేషాలుగురించి అమ్మ చుట్టూ చేరి చెబుతాము..మా కథలు వ్యధలు కంటే అమ్మ "ఆనంద పడే "కథలు గుర్తు చేసుకుని మరీ చెబుతాం..ఇంత పెద్దవాళ్ళం అయిన అంతా ఇరుక్కుని ఇరుక్కుని ఒక చోట చేరి ముచ్చట్లుచెప్పుకోవాల్సిందే ...
దేవుడు ప్రత్యక్షం అయ్యి మీకేం వరం కావాలి అని అడిగితె మా అందరిది ఒకటే సమాధానం మా భాల్యం మాకు తిరిగి ఇచ్చేయమని మా అందర్నీ చిన్నపిల్లల్ని చేసేసి మా అమ్మానాన్నలతో మేమంతా కలిసి ఉండేట్లు చేయమని కోరుకుంటాము.......ఇలా వుంటుంది అందరం కలిస్తే .........
7 కామెంట్‌లు:
చాల బాగున్నాయి మీ జ్ఞాపకాలు మీ కోరిక
ఎంత ఎదిగినా అమ్మ వడి ని మించి ఇంకేమీ లేదేమో ! బాగున్నాయి మీ కబుర్లు .
@భాను
ధన్యవాదాలు అండీ .ఇప్పుడే మీ బ్లాగ్ చూసి వచ్చాను .బాగుంది
@మాలా కుమార్
థాంక్యూ :-)
thnaks for visiting my blag cinni garu
దేవుడిలాంటి అమ్మే ఉండగా...ఇంకా దేవుడి వరమేంటి. హాయిగా, ఎప్పుడూ ఎందరూ కలిసి ఇలాగే మజా చేసుకోండి. మీ అమ్మగారికి నా నమస్కారాలు అందజేయండి.
very nice. True.
@జయ
ధన్యవాదాలండీ ,తప్పకుండ అందచేస్తాను.
@కొత్తపాళీ
థాంక్సండీ .
కామెంట్‌ను పోస్ట్ చేయండి