21, జనవరి 2011, శుక్రవారం

నాగమల్లి పూలు


నా పని అలసటని ప్రయాణం లో ఇలా ప్రకృతి అందాలని వీక్షిస్తూ మురిసిపోతూ మరచిపోతుంటాను ......నా ఫ్రెండ్ నాగు తమ్ముడు గిరి ఈ మద్య ఇండియా వచ్చినపుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు వాళ్ళఊరు భలే నచ్చింది .వాళ్ళ పోలాలలోనే చెరుకు ఆడటం ,బెల్లం తయారు చేయడం ఇలాటి దృశ్యాలు అబ్బురపరిచాయి .సంక్రాంతి కి ఇక్కడినుండి తీసుకుని వెళ్ళిన బెల్లం తోనే అరిసెలు చేసారు మా ఇంట్లో .అతిధి మర్యాదలలో ఈ జిల్లాల వాళ్ళని మించినవారు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదేమో .ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి .ఈ పూలు వాళ్ళ ఇంటి ముందున్న చెట్టువి.నాగమల్లి పూలు అంటాము .పాము పడగ శివలింగము కలిగిన వీటిని శివాలయాల్లో పూజకి పెడ్తుంటారు ,వీటి పరిమళం అద్భుతం .మా లొయోల కాలేజిలో ఆఫీసు రూం కి దగ్గరలో రెండు చెట్లు వుంటాయి అక్కడ మాలిని బ్రతిమాలో కళ్ళుకప్పోవాటిని కైవసం చేసుకునేదాన్ని.ఇప్పుడు ఎప్పుడైనా వాకింగ్కి కాలేజిలోకి వెళ్తే మాఇంట్లో రోజల్లానాగమల్లి సువాసనలు వేదజల్లాల్సిందే :-)


5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నాగు గారి వూరిలో నాగ మల్లి పూలు.. ముగ్ధ మనోహరం గ ఉన్నాయండి
రామకృష్ణ

Hima bindu చెప్పారు...

@రామకృష్ణ
థాంక్యూ,ఆ ఊరు అక్కడి సన్నిహితులు నాగామల్లెల కంటే మనోహరంగా వున్నాయండి :-);)

kavitha చెప్పారు...

I saw these flowers very long back,,,you remind me those days..very cool pics

జయ చెప్పారు...

చాలా బాగున్నాయి పూలు. మొగ్గలు ఉమ్మెత్త మొగ్గల్ని గుర్తు తెస్తున్నాయి.

Hima bindu చెప్పారు...

@కవిత
@జయ
ధన్యవాదాలండీ