మా ఇంట్లో ముగ్గురికి 'బుజ్జులుగాడ్ని'చూడకుండా వుండనిదే తోచడం లేదు .ఇదివరకు అటుఇటు తిరిగి వచ్చిన తొట్టెలో చేపపిల్లలు ఏమి చేస్తున్నాయో వాటికి ఫుడ్ వేశార లేదా అని అరా తీసి వేయకపోతే వేసి కాసేపు వాటితో కబుర్లు చెప్పేదాన్ని .ఇప్పుడు బుజ్జులు మా జీవితం లో అడుగు పెట్టాక బంగారు చేపల్ని నిర్లక్ష్యం చేసాము వాటిని శ్రద్ద తీసుకోవడం తగ్గిపోయి నిన్న గాక మొన్న వచ్చిన ఈ బోడి బుజ్జులు ఆక్రమించింది .ఈ బుజ్జులు ఏమి చేసిన మాకు అధ్బుతమే ఇది చాలా తెలివైనది అదేకాక చాలా క్రమశిక్షణ తో ప్రవర్తిస్తుంది ఒక్క విషయం లో తప్పించి .అదేమిటంటే కొత్తవాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళను నిలవనీయకుండా ఆనందం తో ఒక్క వుదుటున వాళ్ళ ఒడిలో చేరి గారాలు పోతుందీ మేం ఎంత చెప్పిన అస్సలు లెక్క చేయదు పైగా మీతో నాకేమి పని అన్నట్లు ఒక లుక్ వేసి వచ్చిన వాళ్ళ బుజాల మీదో చేతి మీదో తల వాల్చేసి వాలుగా మా వైపు చూస్తాది.వచ్చిన వాళ్ళు కుక్కలంటే భయం లేని వాళ్ళయితే పర్లేదు ఇబ్బంది పడేవాళ్ళతోటే మాకు ఇబ్బంది అప్పుడు వీడ్నికంట్రోల్ చేయడానికి బోల్డు కష్టపడాలి ..కట్టేసామా ఇక మమ్మల్ని మాట్లాడనీయకుండా గోల గోల దాని బాషలో గొణుగుతూ వుంటాది ఇవన్ని పడేకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు సహనం తో కాసేపు బుజ్జులు ని వాళ్ళ ఒడిలో కూర్చోబెట్టుకుంటే బాగుండును అనిపిస్తుంది .పగలంతా మా పాపకి ఎదురుగా కూర్చుని చదివిస్తూ మద్య మద్యలో దానికి బోర్ కొట్టినపుడు మేడపైకి లేక ఇంటి చుట్టూషికారుకి తీసుకుని వెళ్తే సంతృప్తి పడుతూ రాత్రయ్యేసరికి సింహద్వారం ఎదురుగా కూర్చుని మారాక కోసం పడిగాపులు పడ్తువుంటుంది మాఇద్దరిలో ఎవరు ముందు వచ్చిన రెండు నిమిషాలు ఆడిరెండోవారు వచ్చే వరకు గుమ్మం వద్దనే ఎదురుచూస్తుంటది వచ్చాక ఇక ఆటలు మొదలుపెడ్తది.బుజ్జులుకి నిద్ర వచ్చిన నిద్రపోకుండా ఎవరు మెలకువగావుంటారోవాళ్ళ ప్రక్కనే కునికిపాట్లు పడుతూ చివరి లైటుతీసేవరకు వుండి ఆనక నిద్రపోతుంది .
ఉదయాన్నే మాకంటే ముందు లేచిన అల్లరి చేయకుండా మేము లేచాక ఒక్కొక్కర్నీ పలకరించి వెళ్తుంది ..బుజ్జులుకి ఆరుబయట షికార్లంటే ప్రాణం ప్రకృతిని పరవశంగా ఆరాధిస్తుంది. గాలి వీచే దిశగా ముఖం పైకెత్తి కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తుంది చెట్టుకొమ్మలు గాలికి కదులుతుంటే చెవులు రిక్కించి వింటూ మనకి ఏదో చెప్పాలని తాపత్రయపడ్తుంటది .చెట్టు మీద చిన్ని చిన్ని పిట్టల్నిఅటు ఇటు పరుగులు తీసే ఉడుతల్నిపూలపై వాలుతున్న తెనేటిగలను మురిపెంగా కళ్ళు ఇంతేసుకుని చూస్తాది.కాకుల్ని మాత్రం అస్సలు సహించదు అవి వెళ్ళేవరకు విసిగిస్తూనే వుంటది.బుజ్జు చీకట్లో దోమల్ని అతి సునాయాసంగా పట్టేస్తుందిపట్టినవి పట్టినట్లు గుటుక్కుమని మింగేస్తుంది.ఆల్ అవుట్ ఎందుకు దండగ బుజ్జులు చెంత వుండగా అని మా అమ్మాయి గర్వంగా అందరికి చెబుతాది.
బుజ్జు నాకు మరీ మరీ ఎందుకు ఇష్టం అంటే శ్రీవారిని అస్సలు టి.వి చూడనీయదు తను తీరికగా టివి ముందు కనిపిస్తే చాలు పద బయటికి షికారు పోదాం అంటూ సతాయిన్చేస్తాది ,బుజ్జులు కోరిక ఈయన అస్సలు కాదనరు స్పోర్ట్స్ చానల్ కట్టేసి మరీ అమ్మగారు ఎటు తీసుకుపోమ్మంటే అటు తీసుకొని వెళ్తారు ఆ రకంగా మా ఇంట్లో వెధవక్రికెట్ గోల కొంత తగ్గింది .బుజ్జులు అలిగిందంటే మాత్రం చచ్చామే ఎంత బ్రతిమాలిన దిగి రాదూ తినదు తాగదూ.చిన్న చిన్న విషయాలకే అలుగుతాది..కొంచెం పని ఒత్తిడిలో వుండి పలకరించకపోయిన సోఫా క్రిందో మంచం క్రిందో దూరి ఎంత బ్రతిమాలిన రాదూ అది తిరిగి మామూలు అయ్యే దాక దిగులు ...అసలు ఇంత అనుబంధం పెంచుకోవద్దు ఏ కారణం అయిన దూరం అయితే తట్టుకోలెం అని అనుకున్న అనుకునే కొద్ది మరింత దగ్గర అయిపోతుంది హ్మం ..
4 కామెంట్‌లు:
చాలా బాగున్నాయండీ మీ బుజ్జులు కబుర్లు. కానీ బయటకు అంటే వేరే ఊరికి వెళ్ళాలంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు. వెంట తీసుకెళుతున్నారా. ఒక పప్పీని పెంచుకోవాలని మా అమ్మాయి తెగ గొడవ చేస్తోంది...కానీ బయటకు వెళితే ఇబ్బందని భావిస్తున్నాము. దానికి తోడు ఇవి(పెట్స్) మనం లేకపోతే దిగులుపడతాయి కూడా కదా.
@తేజస్వి
ధన్యవాదాలు .ఒక్కోసారి షార్ట్ ట్రిప్ అయినపుడు సరదాగా వెంట తీసుకుని వెళ్తాము .సాధారణంగా దానికి ఫుడ్ ,వాటర్ అది ఆడుకునే బాల్ నాలుగు పనికి రానిపుస్తకాలు దాని బెడ్ ప్రక్కన పడేసి లాక్ చేసి వెళ్తాము .వచ్చేవరకు ఆడుకుంటూ వుంటది దానికోసం టాయిలెట్ రూం కూడా ఓపెన్ చేసి ఉంచుతాము ఎందుకైనా మంచిదని .నిజమే అవి దిగులుపెట్టుకుంటాయి అందుకనే ఇంట్లో అందరి దగ్గర అలవాటయితే ఒకరు లేకపోయినా వేరొకరి దగ్గర అడ్జస్ట్ అవ్వుతాయి .పిల్లలు కచ్చితంగా ఆక్టివ్ అవుతారు పెంపుడు జంతువులు వుండటం వలన అలానే పెద్దవాళ్ళం రిలాక్స్ అవుతాము వాటితో స్పెండ్ చేస్తే .
హమ్మో చాలా పెద్దగయిపోయింది బుజ్జులు. ఎంతముద్దుగుందో. కబుర్లు కూడా చాలానే ఉన్నాయి. దాని ప్రేమ చూస్తే ముచ్చటనిపిస్తుంది.
http://www.thecolorsmagazine.com/wp-content/uploads/2009/10/chocolates.jpg
idigo meeku boledu chocolates ee blog lo :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి