14, ఫిబ్రవరి 2011, సోమవారం

అమ్మమ్మ ఊర్లో వాలంటైన్స్ డే సెలెబ్రేషన్స్



ఈ రోజు ''ప్రేమికులరోజు "అందరము అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరుపుకోవాలని అంతా నిశ్చయించుకున్నాము:-) .మా ఊరు చాల అందంగా వుంటుంది ఇల్లు ని ఆనుకుని పొలము తోటలు వుంటాయి.అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తాతయ్య పెద్దమామయ్య ఫ్యామిలీ వుంటారు. అమ్మమ్మ కొంతకాలం క్రితం గతించాక అక్కడికి వెళ్ళడం తగ్గిపోయింది .మా అమ్మావాళ్ళు మొత్తం ఆరుగురు వాళ్ళపిల్లలం అలానే మా పిల్లలు ఇంకా మా తాతగారి తమ్ముళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తానికి కలిపి ఒక వెయ్యిమందిమి ఉదయం ఎనిమిదికల్లా చేరిపోయాము.
అంతా ప్రేమికులరోజు శుభాకాంక్షలు ఒకరికొకరం తెలుపుకున్నాం (ఫలహారాలు ఆరగిస్తూ ).పదకొండు గంటల సమయంలో మాపెద్దమామయ్యా కొడుకు కి తను మూడు సంవత్సరముల నుంచి ఇష్టపడుతున్న అమ్మాయికి మా తాతయ్య అద్వర్యంలో వివాహం జరిపించారు.వైవిధ్యంగా చేయాలనీ ప్రేమికులరోజుని నిర్ణయించారు
ఆ అమ్మాయి వాళ్ళ తరుపు కొంతమంది (ఫ్యామిలీ )మాత్రమె వచ్చారు .తాతయ్య మనవాడి మనస్సు అర్ధం చేసుకుని అన్నీ తానయి నిర్వహించారు.చాలా కాలం తరువాత అమ్మమ్మ ఊర్లో చిన్నపిల్లలం అయిపోయాం .మా భాల్యమిత్రులు కూడా చాలామందిని కలిసే అవకాశం కలిగింది .థాంక్స్ టూ98 years తాతయ్య.
రోజులు ఎలా మారిపోయ్యాయో ...హ్మం .

2 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

బాగుందండీ.. మొత్తానికి మనవలంతా కలిసి తాతయ్యని మార్చేశారన్న మాట :-) :-)

Hima bindu చెప్పారు...

@మురళి
అయ్యో!తాతయ్య ఎప్పుడు ఇంతేనండీ అయన ముందు తరాలలో పుట్టవలసిన వ్యక్తి .ఆయనే మమ్మల్ని మారుస్తున్నారు :-)