19, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రవాహంలోప్రయాణం

ప్రవాహంలో లో నా ప్రయాణం నిన్నటినుండి మొదలయ్యింది .చాలాకాలం తరువాత తీరికగా ధియేటర్ కి వెళ్లి "అప్పల్రాజు"సినిమా చూసివచ్చాను.ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్లాను కాబట్టి నాకు చాల నచ్చింది .సినిమా కామెడి కాదని ప్రారంభంలోనే ప్రేక్షకులకి తెలియజేసినప్పటికి సినిమా సగం నుంచి వేణుమాధవ్ బృందం హాస్యం పండించింది.సినిమాయలోకం,ఔత్సాహిక కళాకారుల కష్టాలు ఇలా తెరమరుగున వుండే విషయాలు విశేషాలతో ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది.సరదాగా చూడతగిన సినిమా .

2 కామెంట్‌లు:

జయ చెప్పారు...

నిజంగానా...నేను కూడా చూద్దామనుకుంటున్నాను. గగనం సినిమా చూసాను. తెలుగులో ఇలాంటి సినిమాలుండవుగా.

Hima bindu చెప్పారు...

@జయ
ఇప్పటికి చూసే వుంటారు .బానే వుందికదూ.రివ్యూలు చదివితే అస్సలు బాలేదు అనుకుంటాము :-)