12, మార్చి 2011, శనివారం

తమరి రాక మాకెంతో సంతోషం

కొన్ని స్నేహాలు ఎలా మొదలవుతాయో అర్ధం కాదు చాల మాములుగా అయిన పరిచయాలు మంచి స్నేహితులుగా మారవచ్చు .బ్లాగు ద్వారా నాకు ముగ్గురు మిత్రులు ఏర్పడ్డారు .మొట్టమొదట నాకునేను పరిచయం చేసుకుని చాట్ ఆ తరువాత ఫోన్ లో మాట్లాడుతున్న మిత్రులొకరు మిగిలిన ఇద్దరు కామెంట్స్ ద్వారా ఆ తరువాత చాట్ లో మాట్లాడతూ పరిచయం అయినవారు ,వీరెవ్వర్ని ఇంతవరకి ముఖాముఖి చూడలేదు కలవలేదు ...కాని ఈ రోజు బ్లాగ్ ద్వారా ఇటీవల పరిచయం (స్నేహం )అయిన మిత్రుడు మా ఇంటికి రావడం జరిగింది మా పొరుగు జిల్లాలో ఆఫీసు పనిమీద వచ్చి ప్రత్యేకంగా ఈ రోజు సమయం కేటాయించుకుని మా ఫ్యామిలీ అందరితో మద్యాహ్నం వరకు గడిపి వెళ్ళారుచాలా సంతోషంగా అనిపించింది .బ్లాగులు మంచి స్నేహితుల్ని ఇస్తాయి :-)

10 కామెంట్‌లు:

గిరీష్ చెప్పారు...

cool..

జయ చెప్పారు...

all the best for a good friendship. వారెవరెవరో చెప్తే మేము కూడా హ్యాపీ కదా.

జయ చెప్పారు...

all the best for a good friendship. వారెవరెవరో చెప్తే మేము కూడా హ్యాపీ కదా.

durgeswara చెప్పారు...

నాకు కూడా ఎంతో మంది సన్నిహితులయ్యారు బ్లాగులద్వారా .

Hima bindu చెప్పారు...

@గిరీష్
:-):)
@జయ
కొంచెం గెస్స్ చేయండి మేడం మీకే తెలిసిపోతుంది :-)
@దుర్గేశ్వర
ధన్యవాదాలు

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

Happy birthday bindu;)

Unknown చెప్పారు...

సరిగా అర్ధం చేసుకోక పొతే శత్రువుల్ని కూడా యిస్తాయేమో చిన్ని గారు ?

Hima bindu చెప్పారు...

@భారారె
థాంక్యూ :-):)
@రవిగారు
నిజమేనండీ

జయ చెప్పారు...

నా శుభాకాంక్షలు కూడా అందుకోండి మరి. ఈ రోజు పుట్టిన చిన్ని పాపాయికి బుజ్జులు లాంటి బుజ్జి బుజ్జి
అభినందనలు. మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పకపోతే పర్లేదు కాని, నాకు స్వీట్స్ కావాలి.

Hima bindu చెప్పారు...

@జయ
థాంక్యూ ....మీరు నాకు ఫ్రెండ్ కాదా !తరుచు కామెంట్స్ ఇచ్చిపుచ్చుకునేవారే :-) స్వీట్స్ మీ ఊరు వచ్చేప్పుడు తెస్తాను .