18, మార్చి 2011, శుక్రవారం

అయ్యవార్ని చేయబోతే కోతి అయ్యిందట

అయ్యవార్ని చేయబోతే కోతి అయ్యిన చందాన ఏదో కాస్త తిన్నది తగ్గించి కాస్త అందం గా తయారవ్వుదామని(నా కూతురికి తోడు ) నెల రోజులనుండి జిమ్ కి వెళ్లి రెండుగంటలు గడిపి వస్తుంటే రెండు చేతులు కాస్త ఉక్కు కడ్డీల్ల తయారయ్యాయి :-(
పది రోజుల క్రిందట బ్లౌజ్ లో తేడా అనిపించి కోచ్ ని అడిగాను ..."యెం నాయన నీవు చెప్పేవి చేస్తే నీలా తయారయ్యేట్లున్నాను ఇవి చేయొచ్చా నాకెందుకో అనుమానంగా వుంది" అని .అస్సలుకి ప్రాబ్లం లేదు మాం నిక్షేపంగా చేయొచ్చు మీ చేతులు వారం లో తగ్గిపోతాయి నేను చెబుతున్నాగా అని మరిన్నివర్కవుట్స్ చేయించాడు..నేనేమో కార్డియో ఓ గంట చేసి రావచ్చు అనుకుంటే వాటికంటే వీటిమీదే దృష్టి పెట్టించాడు ఎంత చిన్న పిల్లాడయిన మాకు పెర్సనల్ కోచ్ కదా వినక తప్పుతుందా !సరిగ్గా నిన్నటికి నెల మనం బుద్ధిగా ఉదయాన్నే అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టి ..వెయిట్ చూసుకుంటే ఎక్కడవేసిన గొంగళి అక్కడే ..హ్మం .కొరకొర చూస్తున్న నా చూపుల్ని తప్పించుకుంటూ "మీరు సరిగ్గా డైట్ ఫాల్లో కావడం లేదనుకుంటా" అని డిఫెన్స్ లో పడ్డాడు..
వెయిట్ తగ్గకపోయినా నా భుజాలు వెయిట్ లిఫ్టర్ లా తయారయినేం నా కూతుర్ని మాత్రం డేసిప్లిన్ లో పెట్టగలిగాను చీకటితో లేచి చకచక తయారయ్యి జిమ్మ్కి వస్తుంది తనలో మాత్రం చాల మార్పు వచ్చింది అన్ని రకాలుగా ..నా కోచ్ కంటే తన కోచ్ బెటర్ గా గైడ్ చేస్తున్నాడు ..నా చేతులు తగ్గించు కోవటానికైన రెండు గంటలు కేటాయించక తప్పదు ..కోచ్ ని మార్చేసాను:)

2 కామెంట్‌లు:

జయ చెప్పారు...

ఇలాగే జిమ్మిక్కులు చేస్తూ పోతే ఇంకెన్ని రకాల కష్టాలొస్తాయో:) ఎందుకొచ్చిన గొడవ గాని, ఇంచక్కా నా లాగా రోజూ ఓ అరగంట వాకింగ్ చేయండి. అది సర్వరోగ నివారిణి.

Hima bindu చెప్పారు...

@జయ
ఈ వాకింగు తో లాభం లేదనే ఈ మార్గం ఎంచుకున్నాను ఇంకా కొంత సమయం చూద్దాము అని ఆలోచన...