నీకోసం పార్సిల్ వచ్చింది అంటున్న శ్రీవారి మాట పూర్తికాకుండానే వంటగదిలో నుండి ఒక లాంగ్ జంప్ చేసి తడి చేతుల్ని చీరకు తుడిచేస్తూఎవరు పంపారా అని ఆత్రంగా ఫ్రం అడ్రెస్స్ చూసి నవ్వుకున్నాను పంపిన వస్తువేమిటోఊహించేసాను .
ఫటాఫట ఓపెన్ చేస్తూ నాచేతికి పిన్ను కూడా గుచ్చించేసుకున్నాను.నొప్పిని కూడా లెక్కచేయకుండా ఆ వస్తువుని తీస్తే అందమైన
బాపు బొమ్మలతో 'వంశీ 'గారి "మా దిగువగోదారి కథలు"పుస్తకం దర్శనం ఇచ్చింది .
పుస్తకం లో పేజి తెరవగానే అందంగా తన చేత్తో రంగులద్దిన లతలురాసిన అయిదు పంక్తులైన ఆత్మీయత కలబోసి ...'పుస్తకమేమో దాచుకోవల్సినదీ .....
కథలేమో మళ్ళి మళ్ళి చదివించేవి ..అంటూ .ఎన్ని ఈ మెయిల్స్ రాసుకున్న ఇంత ఆనందం వుండదేమో ..ఇలా ఉత్తరాలు అందుకోవడం పుస్తకాలు
గిఫ్ట్లుగా పొందడం లో వున్నా ఆనందమే వేరు .
హ్మం ఈ గోదారి వాళ్లకి గోదారి అంటే ఎంత ప్రేమో !
ఏవిటో మా కృష్ణా నదీ అందమైనదే శైవ క్షేత్రాలతో ,బౌద్దారమాలతో త్రుళ్ళి పడుతున్న దానితో ఎవ్వరు ప్రేమలో పడరు.గోదారోల్లు
మాత్రం అప్పుడే కళ్ళు తెరిచినా బుడతడు నుంచి తొంబయ్యి ఏళ్ళ కురు వృద్దుడి తో సహా గోదారి అందాల వెంటపడే వారే .అందులోనే
అమ్మని ,ఆడపడుచుని నేస్తాన్ని ప్రియురాల్నిచూస్తారట ..బహుశా ఆ నీటి మహత్యం కావొచ్చు.సంవత్సరం పైనుండి గోదారి ప్రజలతో
కూడి పనిచేస్తున్న వీళ్ళకి జీవితాన్ని ఆస్వాదించడం తెలిసినట్లో మరొకరికి తెలియదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది .ప్రతిపనిలోను
నవ్యత్వం కనిపిస్తుంది.. ఇలా ఊహించని రీతిలో బహుమతులు పంపేస్తారు :-)
14, జులై 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
బాగుందండీ మా గోదారి వాళ్ళని మెచ్చుకోవడం.. అన్నట్టు నేను మొన్ననే చదవడం పూర్తి చేశాను ఈ పుస్తకం.. ఎలాగూ బాగుందనే అంటాను :))
చదివాక మీకేమనిపించిందో రాయండి.. ఆ మధ్యనెప్పుడో వంశీ కథలు వన్నె తగ్గుతున్నాయని ఓ టపా రాశారు కదూ...
అభినందనలండి :)
@మురళి
పుస్తకం వచ్చిన ఆనందంలో జ్ఞాపకాన్నిమరచిపోకుండా పదిలంగా బద్రపరుచుకోవడానికి బ్లాగ్ లో దాచాను.పోస్ట్ రాసాక చూసాను "మీ దిగువ గోదావరి కథలు ."ఏమైనా గోదావరి పక్షపాతి కాబట్టి మీకు అన్నీ నచ్చవచ్చు.నిజమేనండీ కొన్ని కథలు పేలవంగా కొంత అశ్లీలంగా కూడా ఉంటున్నాయి .కథ ని త్వరగా ముగించేట్లు అతికించినట్లు కూడా వున్నాయి .ఈ పుస్తకం పూర్తయ్యాక తప్పక ఉదాహరణల తో సహా రాస్తాను :-)
@వేణు శ్రీకాంత్
మీ వ్యాఖ్య సహితం ఊహించనిదే :-) థాంక్యూ.మేము పుస్తకాలేప్పుడు కొనుక్కోము ఇలాటి ధర్మాత్మస్నేహితులు కొనిపెడతారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి