బుజ్జులు ఆడుకునే పోజ్ ....మామిడి కనబడితే ఆటలు వదిలి ఇలా........
మామిడి పళ్ళు తినాలి అంటే రహస్యంగా తినాల్సి వస్తుంది రహస్యం ఎందుకు డయాబిటిక్ గాని ఉందేమోనని డౌట్ పడగలరు .. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు మా ఇంట్లో వున్నా వారందరిది.చిన్నరసాలు సీజన్ ఉన్నంత కాలం మన ఇంట్లో ఉండాల్సిందే వచ్చిన బంధువులకి తినిపించడమే కాకుండా పాక్ చేసి వాళ్ళ కూడా పంపిస్తాము
.అసలు విషయానికి వస్తే మాతో తినడానికి పోటీగా బుజ్జులు కూడా తయారయ్యింది దానికి పళ్ళంటే చాలా ఇష్టం మరి మామిడి పళ్ళంటే మహా ప్రాణం తియ్యగా వుంటాయి కాబట్టి వాటికి పెట్టొద్దు అని తెలిసిన ఇరుగమ్మ పోరుగమ్మ చెబితే బుజ్జులుకి మామిడి పళ్ళు ఇవ్వడం మానేశాము .అసలే అంతంత మాత్రం జుట్టు తీపి తింటే వున్నది ఊడిపోతుంది అనేసర్కి బుజ్జులు అందం తగ్గుతుందేమోననే భయం తో పూర్తిగా పెట్టడం మానేశాము .దాని ముందు పండు తినాలి అంటే దాని చూపుల్ని తట్టుకోలేము అదేదో సినిమాలో బ్రహ్మానందం చూసినట్లు చూడటమే కాకుండా పిచ్చి తిట్లు దాని చేతులు పెట్టి అందినంతవరకు మమ్మల్ని కొట్టడం చేస్తుంది ,అందుకే బుజ్జులు ముందు సాధ్యం అయినంత వరకి తినడం తగ్గించాము తినాలి అంటే బుజ్జులు మేడ పైకి షికారుకి వెళ్ళే సమయం చూసుకోవాల్సిందే .మా అమ్మాయి జాలి పడి రసం మొత్తం తీసేసిన టెంకె ఇచ్చి దానిని బుజ్జగిస్తుంటది .బుజ్జులు నిద్రపోయేప్పుడు తింటున్న వాసనలు పసిగట్టి వచ్చి గోలగోల చేసేస్తుంది .ఈ మామిడి పళ్ళ పిచ్చిలో పడి పాలు అన్నం తినడం మానేసి స్లిమ్ గా తయారయ్యింది .అమ్మ వాళ్ళింటికి తీసుకెళ్ళిన పైన చెల్లి వాళ్ళింటికి వెళ్ళిన ఫ్రిజ్ డైనింగ్ టేబుల్ చుట్టూనే తిరుగుతుంది అక్కడ మామిడి పళ్ళ వాసన లు పసిగట్టి ..పండు పట్టుకుంటే తెల్లగా పీల్చి పిప్పి చేసి మరి తింటుంది .ఏమైనా ఇలా రహస్యంగా తినే బదులు అసలు తినకపోవడమే బెటర్ అనిపించేలా చేస్తుంది ఈ బుజ్జులు.ఇంతక్రితమే మా అమ్మాయి రసం తీసేసి ఇచ్చిన పండు ఎంత పరవశం తో తింటుందో చూడండీ ..
8 కామెంట్‌లు:
:))manaki oka nyaayam ! bujjuluki oka nyaayamaa!? iccheyandi.. chinni gaaru.
అవునండి పాపం బుజ్జులిని ఏడిపించకండి . ఇచ్చేయండి . ఏమీకాదు :)
అబ్బా! ఎన్నాళ్ళకి చూపించారండి బుజ్జులు ని మళ్ళీ. బాగానే పెద్దదయిందే. నా ఓటు కూడా బుజ్జులు మామిడి పండుకే:) మామిడి పండ్లు తింటే, బంగారు జలతారులాంటి జుట్టుతో ఇంకా చాలా అందంగా తయారవుతుంది. ఈ ఒట్టు కనిపెట్టిన వారెవరో గాని వాళ్ళమీద ఒట్టు. నా మాట నమ్మండి....
@వనజ వనమాలీ
అదికాదండీ బుజ్జులు జుట్టు రాలిపోతుందని భయం తో తీపి పదార్ధాలు దూరం పెడతాము.ధన్యవాదాలు .
@మాలాకుమార్
సరేనండీ మీ మాట ప్రకారం ఫుల్ మామిడి పండు ఒక్కసారికి ఇచ్చేస్తాను :-)
@జయ
ఈ పోస్ట్ రాస్తూ మిమ్మల్ని శేఖర్ పెద్దగోపు ని తల్చుకున్నాను (బుజ్జులు అభిమానులాయే ). బుజులుకి బంగారం లాంటి మెరిసే జుట్టు వస్తుందంటే అది తిన్నన్ని పళ్ళు పెడ్తామండీ:-)
@NarayanaswamyS.
thanq:)
:) :)
@పరిమళం
హమ్మో !ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ......thankyou.
కామెంట్‌ను పోస్ట్ చేయండి