7, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఏడేళ్ళ ప్రాయం

ఈ రోజు ఎంత టైం అయినా సరే నా బ్లాగులో నాలుగు లైన్ లు ఆయినా రాయాలనే గాట్టి సంకల్పం చేసుకుని తీరుబాటుగా ఇలా మొదలెట్టాను .యేమంత విశేషాలు రాయబోతున్నాను అనుకుంటే గొప్ప శేషమే ఈ బ్లాగు ప్రపంచంలోకి వచ్చి ఈ రోజుకి ఏడు సంవత్సరాలు  నిండాయి ... గడచిన సంవత్సరాలు తరచి చూస్తే మనం పేద్దగా సాధించిందేమి లేదు (బ్లాగు ల వరకే సుమా ) ఆంధ్రులు ఆరంభ శూరులు  అన్నట్లు  నా బ్లాగు చూసినోళ్లకి  చదివినాళ్ళకి  ఇట్టే  అర్ధం అవ్వుద్ది .బ్లాగు మొదలెట్టిన కొత్తలో ఎంత పనులున్న ప్రక్కన పడేసి కళ్ళు మొహం వాచేట్టు నిద్దరాపుకుని కంప్యూటర్ లో ముఖం  పెట్టుకుని కూర్చునే దాన్ని  కొన్నిసార్లయితే నా ఎడిక్షన్ ఎలా ఒదుల్చుకోవాల  అని భాదపడిన రోజులున్నాయి   http://himabinduvulu.blogspot.in/2010/01/blog-post_18.html    ప్రతి సంవత్సరం గడిచేసరికి పోస్ట్లు పలుచన అయ్యాయి వీటికి వివిధ కారణాలు ...బ్లాగుల పట్ల కొంత వ్యామోహం బలవంతాన తగ్గించుకోవడం కాస్త దారి తప్పి ముఖపుస్తక వ్యామోహం లో పడటం  ఇప్పుడు అదీ తగ్గిందిలేండి  కొత్త ఒక వింత పాత ఒక రోత  అన్న చందాన వాట్సప్  మాయ  లో పడిపోయాం ఇప్పుడేమో టెలిగ్రాం ... సమాచారం సెకన్స్ లో పైగా చూడకపోతే మనం ఎన్నో మిస్ అవ్వుతాము  సో ఇలా కొట్టుకుంటూ ప్రవాహం లో పడితే  మన బ్లాగిల్లు మసక బారడం సహజమే కదా ! పూర్వం యెంతో  బాగా రాసే బ్లాగులన్నీ కళ తప్పి వున్నాయి కొత్త బ్లాగులు మాత్రం కళ గా వున్నాయి  నేను . ఇప్పుడే  ఇల్లు కడిగి  ముగ్గులేసి   తోరణాలు కట్టి  రంగులేసాను  నా జ్ఞాపకాల పూలను నా అనుభవాల అల్లికలని పరికించి చూసి ఒచ్చాను  యెటు తిరిగొచ్చినా  నా ఇల్లు వదల కూడదని నేను సేద తీరేదిదని  పుట్టిన రోజున జ్ఞానోదయం అయ్యింది :-). 

21, జనవరి 2016, గురువారం

రొటీన్ కి భిన్నంగా

కొత్త సంవత్సరంలో కనీసం వారానికి ఒక టపా రాయాలని నిర్ణయం తీసుకున్నా మరునాటి నుంచే జన్మభూమి అనక సంక్రాంతి సంబరాలు తరువాత ఇంట్లో నిజమైన సంక్రాంతి పండగలు ఇక ఇప్పుడేమో పెండిగ్ పనులు నా ప్రపంచానికి దూరం అయ్యిపోతున్నాను . గత సంవత్సరం లానే ఈసారి కూడా ఆఫీసు ప్రక్కనే వున్నా పుస్తక లోకాన్ని ఒక్కసారంటే ఒక్కసారి తొంగి చూడలేకపోయాను .ఇల్లు వాకిలి పట్టక ఇంట్లో నాకోసం చూసే పిల్లల్ని పట్టించుకోక  ఒక ఇరుగు పొరుగు మాట మంతి లేక  ఉగాదులు ఉషస్సులు లేక ;-) నేను పాటుపడి చేసేదేమిటో నాకే అర్ధం కావడం లేదు  . నన్ను నేను బంధించుకున్న ఈ చట్రం నుండి బయటికి రావాలి .

11, అక్టోబర్ 2015, ఆదివారం

స్మార్ట్ విలేజ్

Smart village "somavarapadu"nagapuram habitation Pedaparupudimandal Krishna district.We adopted this village because my roots are here my forefathers and my father birth place. He was educated there with meager facilities and achieved good position ,taught values and provided good education to his children and kin. My grandma was great lady , gave quality education to her children and thereby we are in good positions.
Firstly we provided drinking water borewells .
Secondly we took up the issue of Individual Sanitation, and 40 houses completed the first phase.
Coming months we are working on plantation Health and nutrition.

22, ఫిబ్రవరి 2015, ఆదివారం

మిస్సవుతున్నాను

రోజు రోజుకి ఈ ఉరుకులు పరుగులు ఎక్కువ అవ్వుతున్నాయే కాని యెక్కడా క్షణం ఆగి సేదతీరుదామన్న అవకాశమే రావడం లేదు ,అంతా మన చేతుల్లోనే వుంది అంటారు పక్కన కూర్చుని చోద్యం చూసేవాళ్ళు !ఈ మధ్యకాలం లో చాలా మిస్ అవ్వుతున్నాను పట్టుమని పది నిమిషాలు నాకెంతో ఇష్టం అయిన వారపత్రికలు చూడలేక పోతున్నాను హ్మ్మ్ ! నా గదిలో పుస్తకాలన్నీ నిశబ్ధం గా నిద్దరోతున్నాయి  అంతెందుకు ఆఫీసు ప్రక్కనే అన్ని రోజులు పుస్తక ప్రపంచం పుస్తక ప్రియులతో కళకళ లాడిపోతున్న అందులో అడుగుపెడటానికి ఒక్క క్షణం తీరితే ఒట్టు ... యేమి కట్టుకుంటున్నానో  యేమి  తింటున్నానో  నాకే తెలియడం లేదు పిల్లలతో కనీసం పదినిమిషాలు ఫోను మాట్లాడదమన్నా పది మిస్సేడ్ కాల్ల్స్ ..నిద్రమొహాన పరిగెట్టి  నిద్రకళ్ళతో ఇల్లు చేరడం ... నన్ను నేనే మరిచిపోయేట్లున్నా !అన్నీమిస్స్ అవ్వుతున్నాను .  

17, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆనాటి వాన చినుకులేవి

ఈ రోజు చాలా కాలం తరువాత బ్లాగిళ్ళ కు తిరిగి వచ్చాను పాత ఇళ్లన్నీ వెల వెల బోతున్నాయి కొత్తవన్ని కళ కళ లాడుతున్నాయి ... దాదాపు అన్ని ఇళ్ళు మూసేసి వున్నాయి నెమలికన్ను మరువం పద్మర్పిత తేటగీతి బ్లాగిళ్ళు మాత్రం ముత్యాల ముగ్గులతో కళ గా వున్నాయి కాసేప్పక్కడ తచ్చాడి మూసేసిన వాకిళ్లలో నాటి స్మృతి సుగంధాలను ఆఘ్రాణించి వెనుదిరిగాను 

13, ఆగస్టు 2014, బుధవారం

ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు

చాల సంతోషంగా వుంది ....ఇక మీదట రివ్యూలు మీటింగులకు భాగ్యనగరం  వెళ్ళనవసరం లేదని ప్రశాంతమైన వాతావరణంలో అందరం పనిచేసుకోవచ్చని .

20, జులై 2014, ఆదివారం

ముసుగెందుకు

ముసుగెందుకు ? చాలారోజుల నుండి నన్ను వేధిస్తున్న ప్రశ్న ...ఎందుకని ఈ అమ్మాయిలూ ముఖానికి ముసుగు వేస్తున్నారు కళ్ళు మాత్రమె కనబడేలా ఉంచుకుని రకరకాల స్కార్ఫ్స్ తో ముసుగులతో వెళ్తున్నారు బండి నడిపే వాళ్ళు నడపని వాళ్ళు ఇదే పద్దతుల్లో కనబడుతున్నారు సిటీ లోనే కాకుండా మండల కేంద్రాల్లో ఇలాటి అమ్మాయిలను  తరుచు చూస్తున్నాము .... ఎండబారినుండి పిగ్మేంటేషన్  నుండి తప్పుకోవడానికా అనుకుంటే నిజం కాదనిపిస్తుంది బహుశా  క్రూర మృగాళ్ళ నుండి రక్షణ కోసం  అనుకుంటా !