నేను బ్లాగు రాయడము 2009 ఫిబ్రవరి లో మొదలుపెట్టాను ,,,బ్లాగులు అస్సలు తెలియదు ఇలాంటివి వుంటాయని అప్పట్లో నాకు తెలియదు ... మిత్రుడు మురళి గారు (నెమలికన్ను )బ్లాగుకి నామకరణము చేసి నా మాటల్లో మొదటి పోస్ట్ రాశారు తెలుగులో ఎలా టైపు చెయ్యాలో కూడానా నేర్పారు . అది మొదలు ఎడాపెడా రోజుకి ఒక బ్లాగ్ రాసేదాన్ని ...కాదేది కవితకు అనర్హం అన్నట్లు బ్లాగటానికి అనిపించినా కనిపించిన వన్నీ నా బ్లాగులో ఒదిగిపోయాయి ...రాను రాను రాయడము తగ్గిపోయింది ..వర్క్ ప్రేస్సర్ ఒక కారణం అయితే కొత్తగా వచ్చిన బాధ్యతలు .... కాలం లో కలిసిపోయిన ఆప్తులు నన్ను బాగా కృంగదీసి ఒక రకంగా డిప్రెషన్ లోకి పోయి చాలా విషయాలకి దూరంగా వున్నాను ..బ్లాగాలని యెంత ప్రయత్నం చేసినా నిలకడగా అమలు చేయలేక పోయాను . ఎప్పుడైనా బ్లాగ్స్ చదవాలని తీసిన చాలా వెలితిగా ఉండేవి బ్లాగ్స్ .. ఒకప్పుడు యెంత ఉత్సాహంగా రాసిన వాళ్ళు కనబడటం మానేశారు .. బహుశ ఫెస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో బిజీ గా వుండి బ్లాగింగ్ తగ్గించేశారు అనుకుంటా ! ఆశ్చర్యంగా ఈ మధ్య తెలుగు బ్లాగ్స్ కళకళ లాడుతున్నాయి సంవత్సరకాలం ఆపేసిన వారు కూడా బ్లాగు వాకిళ్లు తెరిచారు ...పూర్వ వైభవము వచ్చినట్లే ... ఊహించని సెలవలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ... నా గార్డెనింగ్ కి బోల్డంత సమయము దొరికింది ... తీరికగా ఇన్నాళ్లు మిస్ అయినా బ్లాగ్ పోస్ట్లు చదుకోవాలి ...
29, మార్చి 2020, ఆదివారం
11, ఫిబ్రవరి 2020, మంగళవారం
23, జనవరి 2020, గురువారం
నెల తరువాత
28, డిసెంబర్ 2019, శనివారం
అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను
అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను ...పెద్ద మామయ్యా రమ్మని పిలిస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను ..అక్కడ అమ్మమ్మ లేదు ..నన్ను కన్నా అమ్మ లేదు ...కానీ వారి మధుర జ్ఞాపకాలు మనస్సు నిండా వున్నాయి ...నాకు ఇష్టం అయినా జ్ఞాపకం ఏవిటంటే నా తీపి బాల్యం ... నా అక్షరాలూ అక్కడే దిద్దాను ...వెన్నెల్లో అక్కడే ఆడుకున్నాను ముత్తాత వెచ్చని పక్కలో ముడుచుకుని ఆయన చెప్పే వింత వింత కథలు అక్కడే విన్నాను ...అద్భుతమైన బాల్యం అక్కడే అనుభవించాను https://himabinduvulu.blogspot.com/2009/02/blog-post_5638.html... ఇంతదాని అయ్యిన నేను ఆ ఊరి ఋణము ఎలా తీర్చుకోగలను ..... ఆ ఊరి ప్రజల అభిమతము మేరకు ఆ ఊరి చర్చికి మొత్తము గ్రానైట్ పరిచాను మూడేళ్ళ క్రిందట ... అమ్మ యెంత గొప్పగా ఫీల్ అయ్యిందో మరిచిపోలేను .... పోయిన ఏడాది నేను ఆ ఆ లు దిద్దిన బడికి ఖరీదైన ప్లాంక్ చైర్స్ వేయించాను ... నేను చేసినది చంద్రునికి ఒక నూలు పోగు లాంటిదే అదొక తృప్తి ..ఇంకా ఏంటో చేయాలని కాంక్ష ... రోజంతా మామయ్యా పిన్నులు అత్తామ్మ్మ కజిన్స్ అందరితో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము
25, డిసెంబర్ 2019, బుధవారం
24, డిసెంబర్ 2019, మంగళవారం
30, నవంబర్ 2019, శనివారం
ముసుగు కావాలి
అయిదు సంవత్సరాల క్రిందట జులై 2014 లో నేనొక సందేహం వ్యక్తపరిచాను ...అమ్మాయిలూ ఎక్కడ చూసినా ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని కనబడుతున్నారు ఎందుకనో అని ...హ్మ్మ్ సమాధానం కూడా నేనే చెప్పేసుకున్నా ! అమాయకంగా కనబడుతూ మేక వన్నె పులుల్లా సమయం వస్తే చటుక్కున్న నోటా కరుచుకుని కబళించాలని చూసే మానవ మృగాలనుండి రక్షించుకోవడానికి అని అర్ధం అయ్యింది .....పసిపిల్లనుండి పండు ముదుసలి వరకు యెంత ఎదిగినా యెంత ఒదిగినా.ఆడదానికి రక్షణ కరువయ్యింది .ముసుగు కావాలి మృగాళ్ళనుండి రక్షించుకోవడం కొరకు . https://himabinduvulu.blogspot.com/2014/07/blog-post_20.html నా ఓల్డ్ పోస్ట్ "ముసుగెందుకు "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)

















