9, ఫిబ్రవరి 2009, సోమవారం

రొటీన్ కి భిన్నంగా...

మంచు పడుతున్న ఓ ఉదయం వేళ లేత చిగుళ్ళ కొసల నుంచి జాలువారే హిమబిందువులు అప్పుడే ఉదయిస్తున్న భానుడి లేత కిరణాలు సోకి కరుగుతున్న వేళ ప్రకృతి కాంతను చూడ్డం ఎంత బాగుంటుంది..?

ఓ సాయంత్రం..నీలాకాశంలో ఎగిరే కొంగల బారుని చూస్తూ కెంజాయ రంగులో పశ్చిమానికి కుంగి పోతున్న సూర్యుడి నుంచి వీడ్కోలు తీసుకోవడం..ఈ అనుభూతిని మాటల్లో వర్ణించ గలమా?

మననుంచి ఏమి ఆశించి ప్రకృతి మనకీ వరాలని ఇస్తోంది.. ఆమె నిజంగా ఏమైనా ఆశించినా మనం ఇవ్వగలమా? ఉదారంగా మనకి లభిస్తున్న కానుకలని మనం అందుకో గలుగుతున్నామా?

ఉహు.. మనకి సూర్యోదయాన్ని చూడడం కన్నా న్యూస్ పేపర్ కోసం ఎదురు చూడడంతోనే ఉదయం వేళ గడిచిపోతుంది.

ఇక సూర్యాస్తమయమా? అంటే ఏమిటి? ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే వేళ.. రేపటి రోజుకోసం కూరలు పళ్ళు కొనుక్కునే సమయం..

'అదే సూర్యుడు..నా చిన్నప్పటినుంచీ చూస్తూనే ఉన్నా..' అనబోతున్నారా? ఐతే మీరెప్పుడూ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించ లేదన్నమాట.

ఒక్క రోజు..కనీసం ఒక్కపూట.. మీ ముఖ్యమైన పనులన్నీ వాయిదా చేసుకుని సుర్యోదయాన్నో, సూర్యాస్తమయాన్నో చూడండి..రొటీన్ జీవితం నుంచి బ్రేక్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని అనిపించకపోతే నన్ను అడగండి..

10 కామెంట్‌లు:

karthik చెప్పారు...

gud post.
i like your observations.
way to go

-Karthik

Unknown చెప్పారు...

Wow Chala Baga chepparu. E busy life lo manam em kolpothunnamo oka example tho super ga chepparu great.

అజ్ఞాత చెప్పారు...

nijame

మురళి చెప్పారు...

చాలా బాగా చెప్పారండి.. కీప్ ఇట్ అప్..

PAVANKALYAN[I.A.S] చెప్పారు...

hima bhindhuvulu lo roteen ki binnamgaa title baagundhi kavithvam laa chaala bagundhi all the best nirantharam raasthu vunddandi
pavankalyanias.blogspot.com

PAVANKALYAN[I.A.S] చెప్పారు...

all the best hima bhindhu
pavankalyanias.blogspot.com

PAVANKALYAN[I.A.S] చెప్పారు...

ఈ చిరు ప్రయత్నం baagundhi naa blog choochi nandhuku chaala tanks
ఈ చిరు ప్రయత్నం vardhillaali ani koru kuntunnaanu all the best

Unknown చెప్పారు...

హిమబిందు గారికి బ్లాగులోకానికి నా హృదయపూర్వక స్వాగతం.
మీ బ్లాగులు బాగున్నాయి.బ్లాగుతూ ఉండండి.

Hima bindu చెప్పారు...

thanq..baalakrishna garu.

Unknown చెప్పారు...

బ్లాగ్‌ ప్రారంభిస్తూ మీ వద్ద ఎన్నో కబుర్లున్నాయన్నారు.
బ్లాగింగ్‌ చేస్తున్న వారందరూ నాకు తెలిసి మాట్లాడటం కంటే... ఇంట్రావర్ట్స్‌గా ఎక్కువగా వుంటారు. మంచి గర్ల్‌ఫ్రెండ్స్‌ అసలు లేని వారు కూడా వుంటారు. మీ వారు కూడా చాలా పెద్ద మనిషి తరహాలో వుంటారని రాశారు. ఎందుకలా అంటే... ఆయన పెరిగిన వాతావరణం...
ఆడపిల్లలు ఎలా వుంటారో తెలియక...
కాబట్టి ఆడపిల్లల మనసు... వారి ఆలోచనలు... స్పందనలు... (దేనికి ఎలా స్పందిస్తారు), వారిని ఎలా అర్థం చేసుకోవాలి... మీ స్నేహితురాళ్ల ఆశలు... ఇష్టాలు... బాధలు... ఇలా ఆడపిల్లలకు సంబంధించి మీరు గమనించిన అంశాలను పంచుకుంటే బాగుంటుంది... తద్వారా గర్ల్‌ఫ్రెండ్స్‌ లేని వారికి ఆ లోటు తీరుతుంది.
వుంటే తమ గర్ల్‌ ఫ్రెండ్స్‌ను అర్థం చేసుకోవటం తెలుస్తుంది. వారిని బాగా చూసుకోవటం కూడా తెలుస్తుంది.