సాయంత్రంఆఫీసు నుండి ఇంట్లో కి అడుగు పెడుతూ గేటు తిసానో లేదో ఓ అల్లరి కెరటం చల్లగా నన్ను తాకింది .తన తాలుక పరిమళం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.తన వైపు చూడగానే రారంమంటూ అల్లరిగా నవ్వింది.
నిద్ర కళ్ళ తోనే నిన్ను పలకరించి నీ దాహం తీర్చ కదా ,,అలసి వచ్చిన నన్ను ఇంట్లోకైన వెళ్ళనియవ అని ముద్దుగా
విసుక్కుంటూనే వెళ్ళాను ."నీకోసం ఏమి దాచానో చూడు ,ఉదయానే చెబుదామంటే ,నాతొ గడపినది ఎక్కడ ?,అందర్నీ చూడాలంటూ విసుక్కుంటూ వెళ్ళవు కదా !"అంటు గారం కార్చింది నా 'చంపకం'.ఎంతమందిలో ఉన్నా నీకు సరి రారెవరు అంటు ,తన తను లతనేల్ల తాకేనో ,లేదో ఒక్కసారే తన సువాసనతో నన్ను మత్తెక్కించింది .నాతొ ఇంట్లోకి వచ్చేయమని అడిగినతడవే ,,సిగ్గుపడుతూ ఆకుల మాటు కళ్లు విప్పి అచ్చర్యముగా నన్ను చూస్తున్న బుజ్జి పాపాయినినా చేతిలో పెట్టింది .అబ్బురంగా అందుకుని ఇంట్లోకి తేసుకు వెళిగాజు తొట్టి లో వేసానా ,,ఇల్లంతా "పరిమళమే".ఇది నా సంపెంగ చెట్టు కథ.నే నాటిన మా తోట లోని ఓ ఆత్మా కథ.
20, ఫిబ్రవరి 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్లు:
మధురంగా ఉందండీ !
thanq...sameeha,
చాలా బాగా రాశారు. కాకపొతే కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. బహుశా పని తొందరలో చూసుకో లేదనుకుంటా..
చిన్ని గారు, మీ టపా చదివాను. మీ శైలి బాగుంది. :-) టైపింగ్ లో లోపాలు సరిచేసుకొని తప్పులు లేకుండా టపా ప్రచురిస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా! sorry for saying like this :-) your style of narration is simple and nice
@మురళికి,పిచ్చోడి గారికి ధన్యవాదాలండి ,,మీ సూచనులు తప్పక పాటిస్తాను.
మీ పరిమళం నా మనసుని కూడా దోచింది.
@పద్మగారికి ,,ధన్యవాదాలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి