26, ఫిబ్రవరి 2009, గురువారం

అభిమాన హీరోలు

అభిమాన హీరోలు అనగానే నాకు ఒక విషయం మదిలో తళుక్కుమంటది .ఈ విషయం తప్పకుండ మీతో షేర్ చేసుకోవాల్సిందే .
నేను ఎనిమిదవ తరగతిలో ఉండగా జరిగిన ఉదంతం.మేము ఏలూరు సెయింట్ తెరిసా స్కూల్లో చదువుకున్నాము ,అందులోనే హాస్టల్లో ఉండేవాళ్ళం .హాస్టల్లో ఎక్కువ శాతం గోదావరి జిల్లా వాళ్ళుండే వాళ్ళు ,ఎపుడు సినిమాలే హాట్ టాపిక్ .ఉదయానే పేపర్ చూడమంటే సినిమా బొమ్మలు ,కొత్త సినిమాలు ,వాటి విశేషాలు చూసేవాళ్ళు ,అక్కడికి వెళ్ళాక మనము నేర్చుకున్నమనుకోండి ,....
మాది పద్నాలుగు మంది తో కూడిన గ్రూప్ ,ప్రతి ఒక్కరికి అభిమాన హీరో ,మరియు హీరోయిన్ ఉండే వారు.అంటే వారి మీద సర్వ హక్కులు వారివే ,పేటెంట్ అన్నమాట.,మనకి ఆ హీరో ఇష్టమైన చెప్పే హక్కు ఉండదు,మనసులోనే ఉంచుకోవలన్నమాట ,లేకపోతె వాళ్ళహీరో ముందు మనవాళ్ళు చులకన కావడమే కాకుండా ,గొడవలు పడేవాళ్ళు
మా విజ్జి మరీను మురళి మోహన్ ని మాట పడనిచేది కాదు,చూపు సరేసరి .
ఆ నేపధ్యం లో నేను ఎంచు కున్నాను కృష్ణం రాజు ని .
రాత్రి డిన్నర్ తరువాత మాకు ఒక గంట రేక్రేషన్ ఉండేది ,అపుడు మేము ,సినిమా కబుర్లు విన్నవి ,కన్నవి గోరంతలు కొండంతలు చేసి చెప్పుకునే వాళ్ళం ,మా అభిమాన హీరో లకి సంబంధించి న పాటలు పాడుకునే వాళ్ళం ,అదే విదంగా సండే మద్యాహ్నం నుండి డిన్నర్ వరకు ఫ్రీ ఉండేది ,ఆ సమయాల్లో ఇలాటి కబుర్లతో గడిపే వాళ్ళం .అభిమనహేరో ల కి సంభందించి ఏ వార్తా ఉన్నా కట్ చేసి దాచు కునేవాళ్ళం .
ఒకరోజు సినిమా పత్రికలో కృష్ణం రాజు గురించి రాస్తో అతని అడ్రస్ కూడా ఇచ్చారు. అతను నా అభిమాన హీరో కాబట్టి డైరెక్ట్ గ పేపర్ కటింగ్ ,నా దగ్గరకు చేరింది.నేను అడ్రెస్స్ దొరికింది కదా అని ఒక ఉత్తరం రాసాను ,అన్నయ్య మీ అభిమానిని అంటూ {హ..హ..హ}అతని నుండి లెటర్ వస్తే సిస్టర్స్ ఒపెంచేసి అక్షింతలు వేస్తారని ,చివరికి మా ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను .నా స్నేహబృందమంత ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఆ లెటర్ ని డే స్కాలర్ సహాయం తో పోస్ట్ చేసాం.

వేసవి సెలవవలు ఇచ్చారు ,మేము ఇంటికి వెళ్లి పోయాము .మాది చాల పెద్ద ఫ్యామిలీ .ఆడుకోవటానికి ఇంకొకరి అవసరం లేకుండా పిల్లలం మేమే సరిపోయేవాళ్ళం ,నాన్న ఇంట్లో ఉన్నంత సేపు పిన్ పడిన వినపడేది ,,ఆయన బయటకి వెళ్ళగానే గోలంతా మా ఇంట్లోనే ఉండేది .
ఒకరోజు మద్యాహ్నం మా అమ్మ మా అందర్నీ చుట్టూ కూర్చోబెట్టి ఏవో కథలు చెబుతుండగా ,నాన్న ఇంటి ముందున్న ఆఫీసురూం నుండి నన్ను పిలిచారు ,సాదారణంగా గెస్ట్ లు వచ్చినపుడే ,ఏ కఫ్ఫే,టీ చెప్పడానికో,పనివాళ్ళు అందుబాటులో లేనపుడే మమ్మల్ని పిలిచేవారు. అలాంటిదేదో అనుకుని నాన్న రూమ్ లోకి వెళ్ళాను .నాన్న ముఖం చాల సీరియస్ గ ఉంది {అసలెప్పుడు సీరియస్ ఇంకా అన్నమాట }అక్కడ ఎవ్వరు లేరు .
"ఏంటి నాన్న పిలిచారు "వినయంగా అన్నాను .
నాన్న నా వైపు చూడకుండా ,కాబినెట్ సైజు ఫోటో,ఒక లెటర్ చేతి లో పైకి ఎత్తి చూపిస్తో "ఏంటిది?"అన్నారు.
ఒక్క క్షణం నాకు అర్ధం కాలేదు .నాన్న చేతి వంక చూడగానే ,ఫోటో లో హుందాగా కృష్ణం రాజు ,అతని లెటర్ పాడ్ మీద నాకు రాసిన ఉత్తరం ,ఒక్కసారే ఆనందము ,వెంటనే భయం కలిగింది .
"ఇదన్న మాట కాన్వెంటు లో మనం చేస్తున్న ఘనకార్యం ,సిస్టర్స్ నీవేదో తెలివి కలదానివి ,అది ,ఇది అంటే నేను ఘర్వపడుతున్నాను "
మన దగ్గర సమాధానం లేదు .అస్సలికే నాన్నంటే భయం,అక్కడ సిస్టర్స్ కి జడిసి మన స్నేహితుల ప్రోద్బలంతో ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను ,ఐన ఇలా ఉత్తరం వస్తుందని కాని,నాన్న ఇలా చూస్తారని కానీ అనుకోలేదు .
"చూడమ్మా ,ఏదైనా చూసి వదిలివేయాలి ,ఆహ్లాదం కోసం మనం సినిమాలు చూస్తాం ,వాళ్లు తమ వృత్తి గ నటిస్తారు .అది వారి ఉద్యోగం,ఇపుడు నేను ఉద్యోగం చేసినట్లుగా ,ఐన అదంతా రంగుల ప్రపంచం ,అదే నిజమనుకుని భ్రమపడకు ,తీరిక దొరికితే మంచి పుస్తకాలు చదువు ,మరొక్క సారి ఇల్లాంటి సంధర్బం తీసుకురాకు ,"అని మెత్తగా మందలించారు.
తలాడించి ఇంట్లోకి వెళ్తోన్న నన్ను ,వెనక్కి పిల్చి ,"ఇదిగో తీసికో "అంటూ ఫోటో ,ఉత్తరం నా చేతి లో పెట్టి వెళ్ళమన్నారు .బిక్కచచ్చిన నేను గది లోకి వచ్చి అమ్మ వాళ్ళకి చూపించాను .తమ్ముడు వాళ్ళు ఫోటో చూసి గంతులు వేస్తోంటే ,పెద్దయ్యాక అక్కలుగా మనం చెప్పాలేమో అనుకున్నాను,.నాన్న దగ్గర ఏమిజరిగిందో మనం చెప్పకుండానే అమ్మకి ,అక్కకి అర్ధం అవ్వింది .
చాల కాలం ఆ ఉత్తరం ,ఫోటో నా "మధురస్మృతుల"కట్ట లో ఉండేది .
సెలవుల తరువాత స్కూల్ కి వెళ్ళిన నా అభిమాన హీరో గురించి మాట్లద్తే వొట్టు.సినిమాలంటే మనల్ని ఆహ్లదపరిచేవి అని అప్పటికి ,ఇప్పటికి నమ్ముతాను.
ఇప్పటికి తల్చుకుంటాను ,నాన్న తన టీనేజ్ కూతురికి ఎంత హుందాగా చెప్పారు,అని.
ఇదండీ మన అభిమాన హీరో గారి కథ .

10 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

బాగున్నాయండి మీ జ్ఞాపకాలు.. ఉత్తరంలో నిజంగా అన్నయ్య అనే సంబోధించారా? :)

చిన్ని చెప్పారు...

అవునండి ,చిన్నవాళ్ళం అప్పట్లో అంతకన్నా ఏ ఫీలింగ్స్ ఉండవు కదా ,అమాయకత్వమే ఆభరణాలు ,.ఇప్పట్ల టీవీ లు లేవు ,నేర్పించడానికి .

అశోక్ చెప్పారు...

"ఇప్పట్ల టీవీ లు లేవు ,నేర్పించడానికి " Thats true...

subhadra చెప్పారు...

baagundi.
naaku chinnapu venky ante estam.
ynduko teliyadu mari.

మధు చెప్పారు...

నాన్న తన టీనేజ్ కూతురికి ఎంత హుందాగా చెప్పారు,అని.

convent annaaru? teenage?? a bit confused

పరిమళం చెప్పారు...

చిన్నిగారు, బాగున్నాయండి మీ జ్ఞాపకాలు.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

బాగున్నాయి మీ జ్ఞాపకాలు... గోదారి బ్లాగర్లు పెరిగిపోతున్నారు... :-)

చిన్ని చెప్పారు...

@అశోక్ గారికి,సుభద్ర గారికి ధన్యవాదాలు ,
@మధు గారు ,టీనేజ్ అంటే పదమూడు నుండి పందొమ్మిది కదండీ ,నేను చదివినది సిస్టర్స్ చే నడపబడిన కాన్వెంటు ,కథొలిక్స్కాంగ్రిగాషన్ ,సెయింట్ తెరిసా .ఎనిమిదో తరగతంటే టీన్స్ కదా!
@ పరిమళం గారు మీ బ్లాగ్ చూసానండి ,మీ పేరు లానే సువాసనలు వేదజల్లుతున్నయండి .
@దీలిప్ గారు పోరబడ్తున్నారు,,మనది గోదారి కాదు ,కృష్ణమ్మ ముద్దు బిడ్డలం .పొతే తెలంగాణా ,రాయలసీమల్లో పుట్టినప్పటినుండి ,హైస్కూల్ కి వచ్చే వరకు పెరిగము ,చదివాం ,నాన్న ఉద్యోగం పుణ్యాన ,తరువాత గోదారిలో కాలేజీ చేరే వరకు ,,..ఇప్పుడు చెప్పండి గోదావరా మాది?

teresa చెప్పారు...

నేనూ సెయింట్‌ తెరిసా నించేనోచ్‌! అందుకే నా పేరు ఇలా ... :)

చిన్ని చెప్పారు...

@తెరెసా గారు ,మనం మనం ఒకటేనన్నమాట!