4, మార్చి 2009, బుధవారం

ఆలోచించు -ఆచరించు

ఈరోజు మధ్యాహ్నం ఒక షాప్ లో చక్కని సూక్తులు లాటివి చూసానండి .తప్పకుండ నాలానే ఇవి తెలియని వాళ్లు ఉంటారనే చెప్పే ప్రయత్నం .
-సులభమైన పని తప్పులువెదుకుట
-గోప్పగురువు అనుభవం
-వివేకవంతుడు నమ్మినదాన్ని ఆచరించువాడు
-అతి అసహ్యకరమైన ఇతరులను విమర్శించడం
పని
-దుఖబాజకం జీవితం పట్ల నిరాసక్తత
-అతి కష్టమైన పని ఇతరులను ప్రశంసించడం
-అతి నీచలోచన ఆసుయ
-అదృష్టవంతుడు పనులలో నిమగ్నమైనవాడు
-నమ్మదగిన మిత్రుడు స్వ ప్రయత్నం
-గోప్పతప్పు కాలహరణం
ఇంకా చాల ఉన్నాయండి ,కాని నేను నేర్చుకోవలసినవి మాత్రమె ఇక్కడ ప్రస్తావించాను .థాంక్స్ ..దీపక్జువలరీ .



12 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

బావున్నాయండీ !అందరూ తెలుసుకోతగ్గవి .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

బాగున్నాయి ఆచరిస్తే మరీ మంచిది ఎవరికైనా

మురళి చెప్పారు...

జ్యుయలరీ షాపు కి వెళ్లి వచ్చి, నగల గురించి కాకుండా అక్కడ కనిపించిన సూక్తుల గురించి రాయడం గొప్ప విషయం.. ఓ చిన్న సూచన చేద్దామనుకుంటూనే మొదటి సూక్తి గుర్తొచ్చి విరమించుకున్నా.. :)

పిచ్చోడు చెప్పారు...

హహ్హహ్హ... మురళి గారూ, ఇక్కడ కూడా పేల్చారా... :-)

అజ్ఞాత చెప్పారు...

ఇది చదివిన తరువాత గతంలో నా భార్యని లేడీ డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళినపుడు అక్కడ చదివిన కొటేషను గుర్తొచ్చింది.
'సమయం కంటే ముందుగానూ, భాగ్యం కంటే అధికంగాను ఎవరికి ఏమీ దొరకదు '

Hima bindu చెప్పారు...

హాయ్ ,పరిమళం గారు,విజయమోహన్ గారు ,బోనగిరి గారు మనం ఆచరించబోయే {?}సూక్తులు మిమ్మల్ని కూడా ఆలోచింపచేసయ?హ హ ..జస్ట్ సరదాకి .,అంటున్నాను.
@మురళిగారు మీతో మేము పడలేమండే,,ఎప్పటికైనా మీ స్థాయికి రావటానికి ప్రయత్నిస్తాను.
@పిచ్చోడు గారు చూసారా ,మురళి గారపుడే చక్కగా పాటిస్తున్నారు.

teresa చెప్పారు...

ఖర్చు లేకుండా భలే priceless jewelry తెచ్చి అందరితో పంచుకున్నారు!

Hima bindu చెప్పారు...

తెరెసా గారికి ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@చిన్ని: నాతో పడలేరా..? నేనేం చేశానండి బాబు.. చెప్పాలనుకున్నది కూడా చెప్పలేదు కదా.. :)

Hima bindu చెప్పారు...

@మురళి మిమ్మల్ని చూస్తోంటే స్కూల్లో మాస్టర్ని చూసినంత భయమండీ ,,మీ అంత చక్కగా రాయలేమండి.

ఉమాశంకర్ చెప్పారు...

ఇంతకీ ఏమైనా కొన్నారా లేక వెళ్ళి ఆ సూక్తులని రాసుకొని చక్కా వచ్చేసారా?

Hima bindu చెప్పారు...

@ఉమాశంకర్ ,, పాపం షాప్ వాడిని అన్యాయం చేయలేదు ,నిన్ననే న ఫ్రెండ్ పుట్టినరోజు ,ఆమె కి గిఫ్ట్ కొంధమనే వెళ్ళాను ,అక్కడ మనకి గిఫ్ట్ దొరికింది.